తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Yuva Nidhi Scheme: కర్నాటకలో ‘యువ నిధి’ స్కీమ్ కు రంగం సిద్ధం; అర్హులు ఎవరు?.. ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు?

Yuva Nidhi scheme: కర్నాటకలో ‘యువ నిధి’ స్కీమ్ కు రంగం సిద్ధం; అర్హులు ఎవరు?.. ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు?

HT Telugu Desk HT Telugu

21 December 2023, 14:33 IST

  • Karnataka's Yuva Nidhi scheme: కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఎన్నికల హామీల్లో మరో హామీని నెరవేర్చడానికి రంగం సిద్ధమైంది. నిరుద్యోగ యువతకు ఆర్థిక సాయం అందించే యువ నిధి పథకం త్వరలో ప్రారంభం కానుంది. 

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Sanchit Khanna/HT Photo)

ప్రతీకాత్మక చిత్రం

Karnataka's Yuva Nidhi scheme: సైటకర్నాటకలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో మరో ముఖ్యమైనది రాష్ట్రంలోని యువతకు నిరుద్యోగ భృతి. రాష్ట్రంలోని నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు ‘యువ నిధి (Yuva Nidhi scheme)’ పథకం పేరుతో ప్రతీ నెల రూ. 3 వేలు అందిస్తామని అప్పుడు ఐదవ హామీగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

రిజిస్ట్రేషన్స్..

తాజాగా, కర్నాటకలో యువనిధి పథకాన్ని (Yuva Nidhi scheme) అమలు చేసే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పథకం అమలు కోసం ఇప్పటికే రూ. 250 కోట్ల నిధులను విడుదల చేసింది. అర్హులైన నిరుద్యోగులను గుర్తించడానికి వీలుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను డిసెంబర్ 26వ తేదీ నుంచి ప్రారంభిస్తోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం, రాష్ట్రంలో 5,29,123 మంది గ్రాడ్యుయేట్లు, డిప్లోమా హోల్డర్లు ఉన్నారు. వీరిలో 4,81,000 మంది గ్యాడ్యుయేట్లు, 48,153 డిప్లోమా హోల్డర్లు. యువనిథి పథకం కింద డిగ్రీ పూర్తి చేసిన ప్రతీ ఒక్కరికీ నెలకు రూ. 3 వేల చొప్పున, డిప్లోమా పూర్తి చేసిన యువతకు నెలకు రూ. 1500 చొప్పున నిరుద్యోగ భృతిగా ప్రభుత్వం అందిస్తుంది. ఈ మొత్తాన్ని లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా జమ అవుతుంది.

అర్హత, ఇతర వివరాలు..

2022-23 విద్యా సంవత్సరంలో డిగ్రీ లేదా డిప్లోమా పూర్తి చేసినవారు మాత్రమే ఈ నిరుద్యోగ భృతి పొందడానికి అర్హులు. వారు ఆయా కోర్సులు కర్నాటకలో పూర్తి చేసి ఉండాలి. అలాగే, కనీసం గత ఆరు సంవత్సరాలుగా వారు కర్నాటకలో నివిసిస్తున్నవారై ఉండాలి. ఈ స్థానికతను 10వ తరగతి మెమో, డిగ్రీ సర్టిఫికెట్, సీఈటీ రిజిస్ట్రేషన్ నంబర్, రేషన్ కార్డ్ తదితరాల ద్వారా నిర్ధారిస్తారు. డిగ్రీ, లేదా డిప్లొమా పూర్తి చేసిన వెంటనే యువ నిధి పథకానికి యువత అప్లై చేసుకోవచ్చు. కానీ, వారికి ఆరు నెలల తరువాత నుంచే యువ నిధి పథకం డబ్బులు అందుతాయి.

Who are not eligible for Yuva Nidhi?: వీరు అర్హులు కారు..

కింద పేర్కొన్నవారు ఈ పథకం కింద ఆర్థిక సాయం పొందడానికి అనర్హులు.

1. ప్రభుత్వ సర్వీసులో ఉద్యోగం చేస్తున్న వారు.

2. ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారు.

3. స్వయం ఉపాధి పొందుతున్న వారు.

4. ఉన్నత విద్యను కొనసాగిస్తున్న వారు.

5. కర్ణాటక వాసులు కాని వారు.

How to apply for Yuva Nidhi?: ఇలా అప్లై చేసుకోండి

అర్హత గల అభ్యర్థులు అధికారిక ‘సేవాసింధు పోర్టల్’ http://sevasindhugs.karnataka.gov.in వెబ్ సైట్ కు లాగిన్ కావడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ అకడమిక్ సర్టిఫికేట్‌లను NAD పోర్టల్ లింక్ http://nad.karnataka.gov.in ద్వారా వారి డిగ్రీ లేదా డిప్లొమా రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఉపయోగించి విశ్వవిద్యాలయాలు లేదా విద్యా సంస్థల నుండి అప్‌లోడ్ చేసి తనిఖీ చేయవచ్చు.

తదుపరి వ్యాసం