తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Kabul Blasts : గురుద్వారా లక్ష్యంగా అఫ్గానిస్థాన్​లో వరుస పేలుళ్లు

Kabul blasts : గురుద్వారా లక్ష్యంగా అఫ్గానిస్థాన్​లో వరుస పేలుళ్లు

Sharath Chitturi HT Telugu

18 June 2022, 11:07 IST

    • Kabul blast news : అఫ్గానిస్థాన్​ రాజధాని కాబుల్​లో ఉన్న గురుద్వారా లక్ష్యంగా శనివారం ఉదయం వరుస పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో అనేకమంది మరణించినట్టు సమాచారం.
గురుద్వారా లక్ష్యంగా అఫ్గానిస్థాన్​లో వరుస పేలుళ్లు
గురుద్వారా లక్ష్యంగా అఫ్గానిస్థాన్​లో వరుస పేలుళ్లు (HT)

గురుద్వారా లక్ష్యంగా అఫ్గానిస్థాన్​లో వరుస పేలుళ్లు

Kabul blast news : వరుస పేలుళ్లతో అఫ్గానిస్థాన్​ అట్టుడికింది. కాబుల్​లోని గురుద్వారా లక్ష్యంగా శనివారం ఉదయం జరిగిన ఈ పేలుళ్లల్లో అనేక మంది మరణించినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. గాయపడిన వారి సంఖ్యపైనా ప్రస్తుతం స్పష్టత లేదు.

కాబుల్​లోని అత్యంత రద్దీగా ఉండే కార్తే పర్వాన్​ ప్రాంతంలో ఉన్న గురుద్వారాలో పేలుళ్లు జరిగాయి. అదే సమయంలో ఐసిస్​ ఉగ్రవాదులు.. గురుద్వారాలోకి ప్రవేశించి కాల్పులకు తెగబడినట్టు తెలుస్తోంది. వారిని అడ్డుకునేందుకు తాలిబన్​ పోలీసులు తీవ్రంగా కృషిచేస్తున్నట్టు సమాచారం.

ఉగ్రవాదులు- పోలీసుల మధ్య భీకర కాల్పులు నెలకొన్నాయి. కాగా.. పేలుళ్ల ఘటనలో గురుద్వారాకు చెందిన సెక్యూరిటీ గార్డు ప్రాణాలు కోల్పోయారు.

భారత్​ ఆందోళన..

Kabul gurdwara blast : కాబుల్​ గురుద్వారా పేలుళ్లపై భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్టు పేర్కొంది. మరిన్ని వివరాలను సేకరిస్తున్నట్టు స్పష్టం చేసింది.

2020లో కూడా కాబుల్​​లోని ఓ గురుద్వారాపై దాడి జరిగింది. ఆ ఘటనలో 27మంది సిక్కులు మరణించారు. అనేకమంది గాయపడ్డారు. కాగా.. అదే తరహా దాడులు చేపడతామని ఐసిస్​.. ఇటీవలే ఓ వీడియోను విడుదల చేసింది. చివరికి ఐసిస్​ ఉగ్రవాదులు అనుకున్నది చేశారు!

అఫ్గానిస్థాన్​లోని సిక్కు సమాజంపై గత కొంతకాలంగా దాడులు జరుగుతున్నాయి. 2021 ఆగస్టులో తాలిబన్లు అఫ్గాన్​ను తమ వశం చేసుకున్నప్పటి నుంచి ఇవి మరింత పెరిగాయి!

టాపిక్

తదుపరి వ్యాసం