తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Jee Advanced 2022 Results: జేఈఈ అడ్వాన్స్‌డ్ టాపర్ శిరీష్

JEE Advanced 2022 Results: జేఈఈ అడ్వాన్స్‌డ్ టాపర్ శిరీష్

11 September 2022, 10:25 IST

  • JEE Advanced 2022 Results: జేఈఈ అడ్వాన్స్‌డ్ రిజల్ట్స్ ఆదివారం ఉదయం వెలువడ్డాయి. పరీక్షకు హాజరైన అభ్యర్థులు దిగువ ఇచ్చిన డైరెక్ట్ లింక్ ద్వారా తమ ఫలితాలను చూసుకోవచ్చు.

JEE Advanced 2022 Result declared at jeeadv.ac.in, direct link here
JEE Advanced 2022 Result declared at jeeadv.ac.in, direct link here (JEE Advanced 2022 official website)

JEE Advanced 2022 Result declared at jeeadv.ac.in, direct link here

JEE Advanced 2022 Results: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బొంబాయి JEE అడ్వాన్స్‌డ్ 2022 ఫలితాలను ప్రకటించింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు JEE అడ్వాన్స్‌డ్ అధికారిక సైట్ jeeadv.ac.in, రిజల్ట్స్ సైట్ ద్వారా ఫలితాలను తనిఖీ చేయవచ్చు.

ఫలితాలతో పాటు ఫైనల్ ఆన్సర్ కీ కూడా విడుదలైంది. ఫలితాలను తనిఖీ చేయాలనుకునే అభ్యర్థులు దిగువ ఇచ్చిన ఈ సాధారణ స్టెప్స్ అనుసరించవచ్చు.

JEE అడ్వాన్స్‌డ్ 2022 ఫలితాలను తనిఖీ చేయడానికి డైరెక్ట్ లింక్

JEE Advanced 2022 Results: ఎలా తనిఖీ చేయాలి

  • JEE అడ్వాన్స్‌డ్ అధికారిక సైట్‌ సందర్శించండి.
  • హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న JEE అడ్వాన్స్‌డ్ 2022 ఫలితాల లింక్‌పై క్లిక్ చేయండి.
  • లాగిన్ వివరాలను నమోదు చేసి, సబ్‌మిట్ చేయండి.
  • మీ ఫలితం స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది.
  • ఫలితాన్ని తనిఖీ చేయండి. రిజల్ట్స్ డౌన్‌లోడ్ చేయండి.
  • తదుపరి అవసరం కోసం హార్డ్ కాపీ భద్రపరచుకోండి.

విజయవంతమైన అభ్యర్థుల కేటగిరీ వారీగా ఆల్ ఇండియా ర్యాంక్‌లు JEE (అడ్వాన్స్‌డ్) 2022 ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా అందుబాటులో ఉంటాయి. అభ్యర్థులకు వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లకు టెక్ట్స్ మెసేజెస్ కూడా పంపుతారు. అధికారిక సైట్ ద్వారా అభ్యర్థులు మరిన్ని సంబంధిత వివరాల కోసం తనిఖీ చేయవచ్చు.

అర్హత కలిగిన అభ్యర్థులు నేటి నుండి సెప్టెంబర్ 12 సాయంత్రం 5 గంటల వరకు అధికారిక JEE అడ్వాన్స్‌డ్ వెబ్‌సైట్ — jeeadv.ac.inలో ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (AAT) కోసం నమోదు చేసుకోవచ్చు.

ఈ సంవత్సరం JEE అడ్వాన్స్‌డ్ 2022లో మొత్తం 40,712 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. R K శిశిర్ ఈ సంవత్సరం ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలో 314 మార్కులతో అగ్రస్థానంలో నిలిచాడు. మహిళా టాపర్ 277 మార్కులతో తనిష్క కబ్రా 16వ ర్యాంకు సాధించింది. పోలు లక్ష్మి సాయి లోహిత్ రెడ్డి, థామస్ బిజు చీరంవేలిల్ వరుసగా రెండు, మూడవ ర్యాంకులు సాధించారు. ఐఐటీ బాంబే కేటగిరీల వారీగా మెరిట్ జాబితాను విడుదల చేసింది.

JEE అడ్వాన్స్‌డ్ 2022 రిజల్ట్స్: ర్యాంకుల జాబితా

AIR 1- R K శిశిర్

AIR 2- పోలు లక్ష్మి సాయి లోహిత్ రెడ్డి

AIR 3- థామస్ బిజు చీరంవేలిల్

AIR 4- వంగపల్లి సాయి సిద్ధార్థ

AIR 5- మయాంక్ మోత్వాని

AIR 6- పోలిశెట్టి కార్తికేయ

AIR 7- ప్రతీక్ సాహూ

AIR 8- ధీరజ్ కురుకుంద

AIR 9- మహిత్ గాధివాలా

AIR 10- వెచ్చ జ్ఞాన మహేష్

JEE అడ్వాన్స్‌డ్ 2022 రిజల్ట్స్: కేటగిరీ వారీగా టాపర్లు

Genral- ఆర్ కే శిశిర్ (ఐఐటీ బాంబే)

OBC-NCL- వంగపల్లి సాయి సిద్ధార్థ (IIT మద్రాస్)

Gen-EWS- పోలిశెట్టి కార్తికేయ (IIT మద్రాస్)

SC- దయ్యాల జాన్ జోసెఫ్ (ఐఐటీ మద్రాస్)

ST- లవేష్ మహర్ (IIT ఢిల్లీ)

GEN-PwD- ఓజాస్ మహేశ్వరి (IIT బాంబే)

GEN-EWS-PwD- గైకోటి విఘ్నేష్ (IIT మద్రాస్)

OBC-NCL-PwD- ఓంకార్ రమేష్ షిర్పురే (IIT బాంబే)

SC-PwD- ప్రకాష్ S రాథోడ్ (IIT బాంబే)

ST-PwD- తాదర్ సిమి (IIT గౌహతి)

సీట్ల కేటాయింపు (JoSAA 2022) కౌన్సెలింగ్ ప్రక్రియ సెప్టెంబర్ 12న ప్రారంభమవుతుంది. JEE అడ్వాన్స్‌డ్ 2022లో అర్హత సాధించిన విద్యార్థులు JoSAA కౌన్సెలింగ్ ద్వారా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IITలు)లో ప్రవేశం పొందుతారు.

టాపిక్

తదుపరి వ్యాసం