తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Population Shrink | 41 కోట్లు త‌గ్గ‌నున్న భార‌త్ జ‌నాభా

Population shrink | 41 కోట్లు త‌గ్గ‌నున్న భార‌త్ జ‌నాభా

HT Telugu Desk HT Telugu

23 July 2022, 15:10 IST

  • Population shrink | ప్ర‌పంచంలో జ‌నాభా(population) ఎక్కువ ఉన్న దేశాల్లో భార‌త్‌ది రెండో స్థానం. మొద‌టి స్థానంలో చైనా ఉంది. త్వ‌ర‌లో జ‌నాభా విష‌యంలో భార‌త్ చైనాను అధిగ‌మిస్తుంద‌న్న వార్త‌లు కూడా వ‌చ్చాయి.

ప్ర‌తీకాత్మ‌క చిత్రం
ప్ర‌తీకాత్మ‌క చిత్రం

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

Population shrink | అయితే, అందుకు విరుద్ధ‌మైన వార్త ఒక‌టి తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. భార‌త్‌లో గ‌ణ‌నీయ స్థాయిలో జ‌నాభా త‌గ్గ‌నుంద‌నే వార్త అది. 2100 నాటికి భార‌త్ జ‌నాభా 41 కోట్లు త‌గ్గుతుంద‌ని ఒక అంచ‌నా వెలువ‌డింది.

Population shrink | 100 కోట్ల‌కు

ఒక అధ్య‌య‌నం ప్ర‌కారం.. రానున్న 78 ఏళ్ల‌లో భార‌త్ జ‌నాభా (population) ఊహించ‌ని స్థాయికి త‌గ్గ‌నుంది. 2022లో భార‌త్ జ‌నాభా 141.2 కోట్లు. అది 2100 నాటికి 100.3 కోట్ల‌కు చేర‌నుంది. అంటే దాదాపు 41 కోట్ల జ‌న సంఖ్య త‌గ్గనుంది. దాంతో, స‌హ‌జంగానే అదే తీరులో, భార‌త జ‌న సాంద్ర‌త కూడా త‌గ్గుతుంది. Population Division of the United Nations projects తాజా రిపోర్ట్‌లో ఈ విష‌యాల‌ను వెల్ల‌డించింది.

Population shrink | చైనాతో పోలిస్తే..

అత్య‌ధిక జ‌నాభా ఉన్న దేశాల్లో తొలి రెండు స్థానాల్లో ఉన్న‌వి చైనా, భార‌త్‌. చైనా జ‌నాభా ఇప్పుడు భార‌త్ క‌న్నా కొద్దిగా ఎక్కువే. 2022లో చైనా జ‌నాభా 142.6 కోట్లు. 2100 నాటికి చైనా జ‌నాభాలో ఊహించ‌ని త‌గ్గుద‌ల చోటు చేసుకోనుంది. ప్ర‌స్తుతం 142.6 కోట్లుగా ఉన్న చైనా జ‌నాభా 2100 నాటికి భారీగా క్షీణించి కేవ‌లం 49.4 కోట్ల‌కు చేరుతుంది. అంటే, దాదాపు 78 ఏళ్ల‌లో చైనా జ‌నాభాలో 93.2 కోట్ల మంది త‌గ్గిపోతారు. జ‌న సాంద్ర‌త విష‌యానికి వ‌స్తే.. చైనా క‌న్నా భార‌త్ లోనే జ‌న‌సాంద్ర‌త ఎక్కువ‌. భార‌త్‌లో ఒక చ‌ద‌ర‌పు కిలో మీట‌రు ప‌రిధిలో నివ‌సించే ప్ర‌జ‌ల సంఖ్య 476 కాగా, చైనాలో ఇది 148 మాత్ర‌మే. 2100లో ఈ తేడా మ‌రింత పెరుగుతుంది. 2100లో భార‌త జ‌న‌సాంద్ర‌త ఒక చ‌ద‌ర‌పు కిమీకు 335 త‌గ్గుతుంది. అదే చైనాలో ఇది క‌నిష్ట స్థాయికి అంటే చ‌ద‌ర‌పు కిలోమీట‌రుకు 51గా ఉంటుంది.

Population shrink | జ‌న‌సంఖ్య త‌గ్గుద‌ల ప్ర‌భావం

అభివృద్ధి చెందుతున్న కొద్దీ జ‌నాభా వృద్ధి రేటులో త‌గ్గుద‌ల చోటు చేసుకుంటూ ఉంటుంది. జ‌నాభా ఎక్కువున్న దేశాలు జ‌నాభా త‌గ్గుద‌ల కోసం తీసుకునే చ‌ర్య‌లు, అలాగే, విద్య‌, విజ్ఞానం, సంప‌ద‌తో పాటు ప్ర‌జ‌ల్లో పెరుగుతున్నఅవ‌గాహన కార‌ణంగా జ‌నాభాలో ఈ త‌గ్గుద‌ల చోటు చేసుకుంటుంది. జ‌నాభా త‌గ్గుద‌ల కార‌ణంగా సానుకూల ఫలితాల‌తో పాటు ప్ర‌తికూల ప్ర‌భావాలు కూడా ఉంటాయి. ఎక్కువ స‌హ‌జ వ‌న‌రులు అందుబాటులో ఉండ‌డం జ‌నాభా త‌క్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌ధాన ప్ర‌యోజ‌నం కాగా, మాన‌వ వ‌న‌రుల సంఖ్య ప్ర‌మాద‌క‌ర స్థాయికి త‌గ్గ‌డం జ‌న‌సంఖ్య త‌గ్గుద‌ల వల్ల క‌లిగే ప్ర‌ధాన న‌ష్టం.

Population shrink | ఫెర్టిలిటీ రేటు

అభివృద్ధి చెందిన‌, చెందుతున్న దేశాల్లో జ‌నాభా పెరుగుద‌ల రేటు త‌గ్గుతూ ఉంటుంది. ఫెర్టిలిటీ రేటు(fertility rate)లో త‌గ్గుద‌ల కార‌ణంగా ఇది జ‌రుగుతుంది. ప్ర‌స్తుతం భార‌త్‌లో ఫెర్టిలిటీ రేటు ఒక మ‌హిళ‌కు 1.76 జ‌న‌నాలు(births per woman )గా ఉంది. 2032 నాటికి ఇది 1.39 జ‌న‌నాల‌కు(births per woman ) త‌గ్గుతుంది. 2100 నాటికి ఇది మ‌రింత త‌గ్గి 1.19 జ‌న‌నాల‌(births per woman )కు చేరుతుంది.

తదుపరి వ్యాసం