తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Honda Bikes Recall: సీబీ 350 సిరీస్ బైక్స్ ను రీకాల్ చేస్తున్న హోండా; ఫాల్టీ పార్ట్సే కారణం..

Honda bikes recall: సీబీ 350 సిరీస్ బైక్స్ ను రీకాల్ చేస్తున్న హోండా; ఫాల్టీ పార్ట్సే కారణం..

HT Telugu Desk HT Telugu

02 December 2023, 14:53 IST

  • Honda bikes recall: మార్కెట్లో ఉన్న H'ness CB350, CB350RS బైక్స్ ను వెనక్కు తీసుకుంటున్నట్లు హోండా సంస్థ ప్రకటించింది. వారంటీతో సంబంధం లేకుండా, ఆయా బైక్స్ లోని తప్పుడు విడి భాగాలను ఉచితంగా రీప్లేస్ చేస్తామని ప్రకటించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Honda bikes recall: మార్కెట్లో ఉన్న H'ness CB350, CB350RS బైక్స్ ను స్వచ్ఛందంగా రీకాల్ చేస్తున్నట్లు హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా ప్రకటించింది. కస్టమర్‌లు తమ మోటార్‌సైకిళ్లను డిసెంబర్ 2023 రెండవ వారం నుండి బిగ్ వింగ్ (BigWing) డీలర్‌షిప్‌ల వద్దకు తీసుకెళ్లాలి. వాహనం యొక్క వారంటీ స్థితితో సంబంధం లేకుండా నాసిరకం భాగాలను ఉచితంగా రీప్లేస్ చేస్తామని హోండా ప్రకటించింది.

అక్టోబర్ 2020 నుంచి..

అక్టోబర్ 2020 నుంచి జనవరి 2023 వరకు ఉత్పత్తి చేసిన H'ness CB350, CB350RS బైక్స్ లోని రియర్ స్టాప్ లైట్ స్విచ్ లో సమస్య ఉన్నట్లు మొదట గుర్తించారు. అందులో వాడిన రబ్బర్ పార్ట్స్ నాసిరకంగా ఉన్నాయని, వాటివల్ల ఆ స్విచెస్ లోనికి వాటర్ వెళ్లే అవకాశం ఉందని గుర్తించారు. అలాగే, అక్టోబర్ 2020 నుంచి డిసెంబర్ 2021 వరకు ఉత్పత్తి చేసిన H'ness CB350, CB350RS బైక్స్ లో బ్యాంక్ యాంగిల్ సెన్సర్ లో కూడా సమస్య ఉన్నట్లు గుర్తించారు. ఆ సెన్సర్ బాడీ సీలింగ్ లో గ్యాప్ ఉందని, దానివల్ల సెన్సర్ లోనికి వాటర్ వెళ్లే అవకాశం ఉందని గుర్తించారు. ఈ రెండు పార్ట్స్ ను ఉచితంగా రీప్లేస్ చేస్తామని వెల్లడించింది.

త్వరలో సీబీ 350

త్వరలో సీబీ 350 మోడల్ బైక్ ను మార్కెట్లో లాంచ్ చేయనున్నట్లు హోండా ప్రకటించింది. H'ness CB350, CB350RS లతో పోల్చినప్పుడు ఇది మరింత రెట్రో డిజైన్‌తో వస్తుంది. దీని ఎక్స్ షో రూమ్ ధర రూ. 1,99,900 నుంచి ప్రారంభమవుతుంది. DLX, DLX ప్రో వేరియంట్స్ ఎక్స్ షో రూమ్ ధర రూ. 2,17,800 నుంచి ప్రారంభమవుతుంది. హోండా సీబీ లైనప్ లో ఇదే తక్కువ ధర కలిగిన బైక్. ఇందులో 348.36 cc, ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్, సింగిల్-సిలిండర్ ఇంజన్ ఉంటుంది. BS6 స్టేజ్ 2 నిబంధనలకు అనుగుణంగా దీన్ని రూపొందించారు. ఇది 5,500 rpm వద్ద 20.78 bhp గరిష్ట శక్తిని మరియు 3,000 rpm వద్ద 29.4 Nm గరిష్ట టార్క్ అవుట్‌పుట్‌ను విడుదల చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో, స్లిప్-అండ్-అసిస్ట్ క్లచ్‌తో వస్తోంది.

తదుపరి వ్యాసం