HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Heatwave | ఆ ప్రాంతాల్లో 49 డిగ్రీల ఉష్ణోగ్రత.. అల్లాడిపోతున్న ప్రజలు

Heatwave | ఆ ప్రాంతాల్లో 49 డిగ్రీల ఉష్ణోగ్రత.. అల్లాడిపోతున్న ప్రజలు

HT Telugu Desk HT Telugu

15 May 2022, 22:02 IST

    • Heatwave Delhi | ఉత్తర భారతంపై భానుడి ప్రతాపం కొనసాగుతోంది! ముఖ్యంగా ఢిల్లీ ప్రజలు ఎండలతో అల్లాడిపోతున్నారు. ఆ ప్రాంతంలో ఆదివారం ఏకంగా 49డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
ఢిల్లీ పరిస్థితులు..
ఢిల్లీ పరిస్థితులు.. (PTI)

ఢిల్లీ పరిస్థితులు..

Heatwave Delhi | భానుడి భగభగలకు దేశ రాజధాని ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లోని ప్రజలు విలవిలలాడిపోతున్నారు. రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతున్నారు. తాజాగా... ఢిల్లీలో ఏకంగా 49డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు హీట్​వేవ్​ నేపథ్యంలో.. ఉత్తర భారతంలోని అనేక ప్రాంతాలకు ఆరెంజ్​ అలర్ట్​ జారీ చేసింది భారత వాతావరణ శాఖ(ఐఎండీ).

మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
ట్రెండింగ్ వార్తలు

Crime news: ‘‘బాలిక లోదుస్తులు తొలగించడం, తన ముందు నగ్నంగా ఉండటం 'అత్యాచార యత్నం కాదు’’: రాజస్తాన్ హైకోర్టు

Crime news: ఆన్ లైన్ లో ఆర్డర్ చేసిన ఐస్ క్రీమ్ కోన్ లో కట్ చేసి ఉన్న మనిషి వేలు

NEET UG 2024 grace marks: ఆ 1500 మందికి మళ్లీ పరీక్ష; నీట్ యూజీ 2024 పై కేంద్రం నిర్ణయం

1563 మంది అభ్యర్థుల నీట్ ఫలితాల రద్దుకు సుప్రీంకోర్టు అనుమతి

మండిపోతున్న 'ఢిల్లీ'..

వాయువ్య ఢిల్లీలోని ముంగేష్​పూర్​లో ఆదివారం 49.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక నజఫ్​గఢ్​లో 49.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

స్పోర్ట్స్​ కాంప్లెక్స్​లో 48.4, జఫర్​పూర్​లో 47.5, పితాంపూర్​లో 47.3, రిడ్జ్​లో 47.2 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయ్యింది.

ఇంత వేడి మధ్య.. ఢిల్లీ ప్రజలకు కాస్త ఊరటనిచ్చే విషయం చెప్పింది ఐఎండీ. సోమవారం ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

గురుగ్రామ్​లో సైతం భారీ ఉష్ణోగ్రతలే నమోదవుతున్నాయి. 1966 మే తర్వాత తొలిసారిగా.. అక్కడ 48.1డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది.

ఆరెంజ్​ అలర్డ్​..

Heatwave India | హీట్​వేవ్​ నేపథ్యంలో.. ఉత్తర భారతానికి ఆరెంజ్​ అలర్ట్​ జారీ చేసింది ఐఎండీ. రాజస్థాన్​కి మాత్రం రెడ్​ అలర్ట్​ ఇచ్చింది.

"రాజస్థాన్​లో హీట్​వేవ్.. సోమవారం​ అత్యంత తీవ్రంగా ఉండనుంది. అందుకే రెడ్​ అలర్ట్​ ఇచ్చాము. ఇక పంజాబ్​, హరియాణా, ఉత్తర్​ప్రదేశ్​, తూర్పు మధ్యప్రదేశ్​, ఢిల్లీ ప్రాంతాలకు ఆరెంజ్​ అలర్ట్​ జారీ చేశాము," అని ఐఎండీ వెల్లడించింది.

మధ్యప్రదేశ్​లో మరో 2-3రోజులు, ఉత్తర్​ప్రదేశ్​లో సోమవారం వరకు హీట్​వేవ్​ కొనసాగనుంది.

అక్కడ మాత్రం భారీ వర్షాలు..!

Kerala rain alert news | అరేబియా సముద్రంలో బలమైన గాలులు వీస్తుండటంతో.. రానున్న ఐదు రోజుల్లో కేరళవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ(ఐఎండీ) వెల్లడించింది. ఈ క్రమంలో కేరళలోని ఆరు జిల్లాలకు ఆదివారం.. ఆరెంజ్​ అలర్ట్​ను జారీ చేసింది.

24గంటల్లో.. 20సెంటీమీటర్లు.. అంతకన్నా భారీగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటే.. రెడ్​ అలర్ట్​ జారీ చేస్తుంది ఐఎండీ. 6-20సె.మీ మధ్య వర్షపాతం నమోదైతే ఆరెంజ్​ అలర్ట్​ ఇస్తుంది. ఇక 6-11సెంటీమటర్లైతే.. ఎల్లే అలర్ట్​ జారీ చేస్తుంది. ఈ క్రమంలో.. సోమవారం సాయంత్రం వరకు మత్స్యకారులు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లకూడదని స్పష్టం చేసింది.

Monsoon 2022 | ఎండలతో అల్లాడిపోతున్న దేశ ప్రజలకు భారత వాతావరణశాఖ 'చల్లటి' కబురు చెప్పింది. ఈ ఏడాది.. నైరుతి రుతుపవనాలు ఊహించని దాని కన్నా వారం రోజుల ముందే.. దేశంలోకి ప్రవేశించే అవకాశం ఉందని పేర్కొంది.

సాధారణంగా.. మే చివరి వారంలో అండమాన్​ నికోబార్​ దీవులను చుట్టి.. అటు ఇటుగా జూన్​ 1 నాటికి నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయి. ఈసారి ఈ ప్రక్రియ కాస్త ముందుగానే జరుగుతుందని ఐఎండీ అంచనా వేసింది.

టాపిక్

తదుపరి వ్యాసం