తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Hdfc Bank | హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ క్యూ1 ఫ‌లితాలు

HDFC Bank | హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ క్యూ1 ఫ‌లితాలు

HT Telugu Desk HT Telugu

16 July 2022, 18:23 IST

  • HDFC Bank | ఈ ఆర్థిక సంవ‌త్సరం తొలి త్రైమాసికంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మెరుగైన ఫ‌లితాల‌ను సాధించింది. జూన్‌తో ముగిసే తొలి త్రైమాసికంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రూ. 9,579 కోట్ల లాభాల‌ను ఆర్జించింది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్

HDFC Bank | హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ త్రైమాసిక ఫ‌లితాల‌ను శ‌నివారం విడుద‌ల చేసింది. నెట్ ప్రాఫిట్‌లో 20.91% మెరుగుద‌ల న‌మోదైంద‌ని వెల్ల‌డించింది. స్టాండ్ అలోన్ బేసిస్‌లో గ‌త సంవ‌త్స‌రం తొలి త్రైమాసిక లాభాలు రూ. 7,729.64 కోట్లు కాగా, ఈ సంవ‌త్స‌రం ఆ లాభాల్లో 20.91% జంప్‌తో రూ. 9,195.99 కోట్ల లాభాలను సాధించింది. కానీ, గ‌త ఆర్థ‌క సంవ‌త్స‌రం చివ‌రి త్రైమాసికంలో సాధించిన రూ. 10,055 కోట్ల లాభాల‌తో పోలిస్తే.. ఈ క్వార్ట‌ర్ ఫ‌లితాలు కొంత నిరాశాజ‌న‌కంగానే ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Viral : ఆటగాడివే! ఒకేసారి ఇద్దరు గర్ల్​ఫ్రెండ్స్​.. దొరికిపోయి- చివరికి..

Southest Monsoon : గుడ్​ న్యూస్​.. ఇంకొన్ని రోజుల్లో దేశాన్ని తాకనున్న నైరుతి రుతుపవనాలు!

PM Modi : ‘పాకిస్థాన్​కి నేను గాజులు తొడుగుతా..’- ప్రధాని మోదీ కామెంట్స్​ వైరల్​!

CBSE Class 10 results : సీబీఎస్​ఈ క్లాస్​ 10 ఫలితాలు విడుదల- ఇలా చెక్​ చేసుకోండి..

HDFC Bank | ఇంట్రెస్ట్ ఇన్‌క‌మ్‌

గ‌త సంవ‌త్స‌రం తొలి త్రైమాసికంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవ‌త్స‌రం తొలి త్రైమాసికంలో నెట్ ఇంట్రెస్ట్ ఇన్‌క‌మ్ రూ. 19,481.40 కోట్లు. ఇది గ‌తంతో పోలిస్తే 14.5% ఎక్కువ‌. గ‌త సంవ‌త్స‌రం తొలి త్రైమాసికంలో నెట్ ఇంట్రెస్ట్ ఇన్‌క‌మ్ రూ. 17009 కోట్లు. ట్రేడింగ్‌, మార్కెట్ లాస్‌ల‌ను మిన‌హాయించి, ఇత‌ర ఆదాయంలో రూ. 7,699.99 కోట్ల ఆదాయాన్ని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సాధించింది. ఇది గ‌త సంవ‌త్స‌రం తొలి త్రైమాసికంతో పోలిస్తే 35% ఎక్కువ‌. అలాగే, ఈ త్రైమాసికంలో బ్యాంక్‌ డిపాజిట్ల‌లో పెరుగుద‌ల 19.2 శాతంగా ఉంది.

HDFC Bank | ఎన్‌పీఏల్లో..

ఎన్‌పీఏల నిర్వ‌హ‌ణ‌లోనూ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మెరుగైన ఫ‌లితాల‌ను సాధించింది. గ‌త సంవ‌త్స‌రం తొలి త్రైమాసికంలో ఇది 1.47 శాతం ఉండ‌గా, ఈ త్రైమాసికంలో 1.28కి తగ్గింది. వ్య‌వ‌సాయ రంగంలోని ఎన్‌పీఏల‌ను మిన‌హాయిస్తే.. గ్రాస్ ఎన్‌పీఏల శాతం 1.06 మాత్ర‌మేన‌ని బ్యాంక్ వెల్ల‌డించింది. అలాగే, కొత్త‌గా 10,932 మంది ఉద్యోగుల‌ను తీసుకున్నామ‌ని, కొత్త‌గా 36 బ్రాంచ్‌లను ప్రారంభించామ‌ని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా 6 వేల‌కు పైగా బ్రాంచ్‌లున్న‌ట్లు తెలిపింది. రుణాల విష‌యానికి వ‌స్తే.. రిటెయిల్ లోన్ల‌లో 21.7%, క‌మ‌ర్షియ‌ల్‌, రూర‌ల్ బ్యాంకింగ్ లోన్ల‌లో 28.9% పెరుగుద‌ల న‌మోదైంద‌ని ప్ర‌క‌టించింది.

తదుపరి వ్యాసం