తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Gyanvapi Masjid Case | ‘మహిళల పిటిషన్​.. చట్టానికి విరుద్ధం’

Gyanvapi masjid case | ‘మహిళల పిటిషన్​.. చట్టానికి విరుద్ధం’

HT Telugu Desk HT Telugu

31 May 2022, 6:30 IST

  • Gyanvapi masjid case | జ్ఞాన్​వాపి మసీదు వివాదంపై వారణాసి జిల్లా కోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలో మసీదు కమిటీ సభ్యులు దాదాపు రెండు గంటల పాటు తమ వాదనను వినిపించారు.

జ్ఞాన్​వాపి మసీదు
జ్ఞాన్​వాపి మసీదు (HT_PRINT)

జ్ఞాన్​వాపి మసీదు

Gyanvapi masjid case | ఉత్తర్​ప్రదేశ్​ జ్ఞాన్​వాపి మసీదు వివాదంపై వారణాసి జిల్లా న్యాయమూర్తి ఎదుట వాదనలు వినిపించింది మసీదు కమిటీ. కాంప్లెక్స్​లోని దేవుడి విగ్రహాలకు నిత్యం పూజలు చేసుకునే విధంగా అనుమతులివ్వాలన్న ఐదుగురు మహిళల పిటిషన్​.. చట్టానికి విరుద్ధమని ఆరోపించింది. ఇది 1991 ప్లేసెస్​ ఆఫ్​ వర్షిప్​ యాక్ట్​ను ఉల్లంఘిస్తుందని పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు

Crime news: స్కూల్ లో బాలికపై అత్యాచారం; దారుణం చేసింది స్కూల్ ఓనరే; అతడికి సహకరించిన ఏఎస్సై

UPSC CDS 2: కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ నోటిఫికేషన్ విడుదల చేసిన యూపీఎస్సీ

UK Graduate Visa: హైయర్ స్టడీస్ కు యూకే వెళ్లే స్టుడెంట్స్ కు గుడ్ న్యూస్; గ్రాడ్యుయేట్ వీసాపై కీలక అప్ డేట్

Rajasthan: రాజస్థాన్ గనిలో కుప్పకూలిన లిఫ్ట్; మైన్ లో ఇరుక్కుపోయిన 15 మంది అధికారులు

ఇది హిందువులకు సంబంధించిన విషయం కాదని, కేవలం ఐదుగురు మహిళలు తమ వ్యక్తిగతంగా పిటిషన్​ వేశారని.. సోమవారం జరిగిన విచారణలో మసీదు కమిటి తెలిపింది. అందువల్ల కేసు చెల్లదని వివరించింది. ఈ క్రమంలో జ్ఞాన్​వాపి మసీదు కమిటికి చెందిన న్యాయవాది అభయ్​ నాథ్​ యాదవ్​.. దాదాపు రెండు గంటల పాటు తమ వాదనలను వినిపించారు.

Gyanvapi case update | కాగా.. మహిళల పిటిషన్​ న్యాయపరమైనదేనని, చట్టానికి లోబడే ఉందని నిరూపించేందుకు తమ వద్ద వాదనలు ఉన్నాయని హిందువుల తరఫు న్యాయవాది సుభాష్​ నందన్​ చతుర్వేది పేర్కొన్నారు. కోర్టుకు విన్నవించి, ప్రూవ్​ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ఇరువైపులా వాదనలు విన్న జిల్లా కోర్టు న్యాయమూర్తి.. తదుపరి విచారణను జులై 4కు వాయిదా వేశారు.

జ్ఞాన్​వాపి మసీదు వివాదం..

జ్ఞాన్​వాపి మసీదు వెనక భాగం గోడలపై హిందువుల విగ్రహాలు ఉంటాయి. వాటికి.. ఏడాదికి ఒకసారి మాత్రమే పూజలు చేసుకునేందుకు వీలు ఉంటుంది. కాగా.. విగ్రహాలకు నిత్యం పూజలు చేసుకునే విధంగా.. అనుమతులివ్వాలని వారణాసి స్థానిక కోర్టులో గతేడాది పిటిషన్​ వేశారు ఐదుగురు మహిళలు. పిటిషన్​పై విచారణ చేపట్టిన కోర్టు.. మసీదులో వీడియో సర్వే నిర్వహించాలని ఆదేశించారు. తీవ్ర ఉద్రిక్తతల నడుమ వీడియో సర్వే జరిగింది. మసీదులోని చెరువు వద్ద శివలింగం బయటపడిందని హిందువుల తరఫు న్యాయవాదులు ఆరోపించారు. ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

Gyanvapi Shivling | మరోవైపు.. ఈ పూర్తి వ్యవహారంపై జ్ఞాన్​వాపి మసీదు కమిటీ సభ్యులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. 1991 చట్టం ప్రకారం.. అసలు హిందువుల పిటిషన్​ చెల్లదంటూ వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. కేసును స్థానిక కోర్టు నుంచి జిల్లా కోర్టుకు తరలించింది. ఫలితంగా.. హిందువుల పిటిషన్​ అసలు చెల్లుతుందా? లేదా? అన్నది జిల్లా న్యాయమూర్తి చేతిలో ఉంది.

టాపిక్

తదుపరి వ్యాసం