తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Gyanvapi Shivling | 'జ్ఞాన్​వాపి మసీదులో శివలింగం కనిపించింది'

Gyanvapi Shivling | 'జ్ఞాన్​వాపి మసీదులో శివలింగం కనిపించింది'

HT Telugu Desk HT Telugu

16 May 2022, 16:37 IST

  • Gyanvapi Shivling | జ్ఞాన్​వాపి మసీదులో శివలింగం కనిపించిందని హిందూ న్యాయవాదులు వెల్లడించారు. ఈ క్రమంలో ఆ ప్రాంతాన్ని మూసివేయాలని కోర్టు ఆదేశాలిచ్చింది.

జ్ఞాన్​వాపి మసీదు
జ్ఞాన్​వాపి మసీదు (PTI/file)

జ్ఞాన్​వాపి మసీదు

Gyanvapi Shivling | ఉత్తర్​ప్రదేశ్​ వారణాసి జ్ఞాన్​వాపి మసీదు వీడియో సర్వేలో చివరి రోజున అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. మసీదులోని ఓ చెరువులో శివలింగం కనిపించిందని పలువురు న్యాయవాదులు వెల్లడించారు. శివలింగం రక్షణ కోసం వారు సివిల్​ కోర్టుకు వెళ్లారు. ఇది జరిగిన కొద్దిసేపటికే.. ఓ కోర్టు.. కీలక ఆదేశాలు జారీ చేసింది.

ట్రెండింగ్ వార్తలు

Couple gets intimate in the Bus: బస్సులోనే ఒక జంట అశ్లీల చర్యలు; వీడియో వైరల్; గట్టి పనిష్మెంట్ ఇవ్వాలంటున్న నెటిజన్లు

RRB RPF Recruitment 2024: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లో 4660 పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఈ రోజే లాస్ట్ డేట్

Fact Check : 'ల్యాబ్​లో పిల్లలను నచ్చినట్టు తయారు చేసుకోవచ్చు' అంటున్న ఈ వైరల్​ వీడియోలో నిజమెంత?

Sushil Modi death : బీజేపీ సీనియర్​ నేత సుశీల్ కుమార్​​ మోదీ కన్నుమూత..

చెరువులో శివలింగం..!

వీడియో సర్వేలో భాగంగా.. సోమవారం ఉదయం మసీదులో ఉన్న చెరువులోని నీటిని తొలగించారు. ఈ క్రమంలోనే చెరువు లోపల శివలింగం కనిపించిందని న్యాయవాదులు విష్ణు జైన్​, సుభాష్​ నందన్​ చతుర్వేదిలు మీడియాకు వెల్లడించారు.

Shivling found in Gyanvapi | శివలింగాన్ని రక్షించాలని విజ్ఞప్తి చేస్తూ.. కోర్టుకు వెళ్లారు. ఈ క్రమంలో వారణాసి జిల్లా మెజిస్ట్రేట్​కు.. కోర్టు  కీలక ఆదేశాలిచ్చింది. చెరువును మూసివేయాలని, ఎవరు అటువైపు వెళ్లకూడదని స్పష్టం చేసింది. మూసివేసిన ప్రాంతంలోకి ఎవరు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకునే బాధ్యతను సీఆర్​పీఎఫ్​, పోలీసు చీఫ్​కు అప్పగించాలని మెజిస్ట్రేట్​కు సూచించింది.

కాగా.. మసీదులో శివలింగం కనిపించిందన్న వార్తలను వారణాసి జిల్లా మెజిస్ట్రేట్​ కౌషల్​ రాజ్​ శర్మ ధ్రువీకరించలేదు.

'అవాస్తవం..'

Shivling in Gyanvapi | శివలింగం కనిపించిందన్న వార్తలను మసీదు కమిటీకి చెందిన న్యాయవాది అంజుమ్​ ఖండించారు. పిటిషనర్లు.. తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. చెరువులో ఉన్నది శివలింగం కాదని.. అది ఓ ఫౌంటైన్​ అని అన్నారు. ఈ విషయంపై కోర్టుకు వెళతామని వెల్లడించారు.

ఇదీ వివాదం..

వారణాసిలోని కాశీవిశ్వణాధుడి ఆలయానికి అత్యంత సమీపంలో ఉంటుంది ఈ జ్ఞాన్​వాపి మసీదు. దాని వెనుక కొన్ని హిందూ దేవతల విగ్రహాలు ఉంటాయి. ప్రస్తుతం.. ఆ ప్రాంతంలో ఏడాదికి ఒక్కసారి మాత్రమే పూజలు నిర్వహించుకునేందుకు అనుమతులు ఉన్నాయి.

Gyanvapi mosque Shivling | ఈ విషయంపై ఐదుగురు మహిళలు కోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. ఏడాది పొడవునా.. ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతులివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో.. మసీదు కాంప్లెక్స్​, నేలమాళిగలు, చెరువు వంటి ప్రాంతాల్లో వీడియో సర్వే నిర్వహించాలని వారణాసి సివిల్​ కోర్టు ఆదేశించింది.

Gyanvapi survey | కోర్టు ఆదేశాల మేరకు అధికారులు.. ఈ నెల 6న సర్వే చేపట్టారు. కానీ ఉద్రిక్తతల నేపథ్యంలో సర్వే ఆగిపోయింది. అనంతరం తాజాగా సర్వేను మంగళవారం పూర్తిచేశారు.

సర్వేకు వ్యతిరేకంగా సూప్రీంకోర్టులో పిటిషన్​ దాఖలైంది. ఈ వ్యవహారంపై మంగళవారం విచారణ చేపట్టనుంది సర్వోన్నత న్యాయస్థానం.

తదుపరి వ్యాసం