తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Gta 6 Leaks : ఆన్​లైన్​లో 'జీటీఏ 6' వీడియోలు లీక్​..!

GTA 6 leaks : ఆన్​లైన్​లో 'జీటీఏ 6' వీడియోలు లీక్​..!

Sharath Chitturi HT Telugu

18 September 2022, 14:55 IST

    • GTA 6 leaked videos : జీటీఏ 6కి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. జీటీఏ 6 లీక్ వీడియోలు అంటూ.. కొన్ని ఆన్​లైన్​లో చక్కర్లు కొడుతున్నాయి.
ఆన్​లైన్​లో 'జీటీఏ 6' వీడియోలు లీక్​..!
ఆన్​లైన్​లో 'జీటీఏ 6' వీడియోలు లీక్​..! (AFP/representative image)

ఆన్​లైన్​లో 'జీటీఏ 6' వీడియోలు లీక్​..!

GTA 6 leaks : జీటీఏ (గ్రాండ్​ తెఫ్ట్​ ఆటో)కి ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్​ ఉంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా.. చాలా మంది ఈ గేమ్​ని ఆడేస్తూ ఉంటారు. పట్టణాల్లో.. ఈ జీటీఏని ఆడని పిల్లలు బహుశా ఎవరు ఉండకపోవచ్చు! అయితే.. ఇప్పుడు జీటీఏ 6కి సంబంధించిన వార్త ఒకటి.. ట్విట్టర్​లో ట్రెండ్​ అవుతోంది. జీటీఏ 6 వీడియోలు ఆన్​లైన్​లో లీక్​ అయినట్టు తెలుస్తోంది. ఆ వీడియోలను చూసి, జీటీఏ 6 ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు నెటిజన్లు, గేమింగ్​ ప్రియులు ఉవ్విళ్లూరుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Fire in flight: ఆకాశంలో ఉండగానే ఎయిర్ ఇండియా విమానంలో మంటలు; ఢిల్లీ ఏర్ పోర్ట్ లో ఫుల్ ఎమర్జెన్సీ

UGC NET June 2024: యూజీసీ నెట్ జూన్ 2024 రిజిస్ట్రేషన్ గడువును మళ్లీ పొడిగించిన ఎన్టీఏ

USA Crime News: స్కూల్లో క్లాస్ మేట్స్ ఎగతాళి చేస్తున్నారని పదేళ్ల బాలుడు ఆత్మహత్య

IMD predictions: ఆంధ్ర ప్రదేశ్ సహా దక్షణాది రాష్ట్రాల్లో మే 21 వరకు భారీ వర్షాలు; యూపీ, హరియాణాల్లో హీట్ వేవ్

జీటీఏను రాక్​స్టార్​ అనే గేమింగ్​ సంస్థ రూపొందిస్తుంది. కాగా.. జీటీఏ 6 కోసం అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. దీనిపై విపరీతమైన అంచనాలు కూడా ఉన్నాయి. ఈ విషయంపై ఈ ఏడాదిలోనే అప్డేట్​ ఇచ్చింది రాక్​స్టార్​ సంస్థ. జీటీఏ 6.. అభివృద్ధి దశంలో ఉందని పేర్కొంది. ఫలితంగా అభిమానుల్లో విపరీతమైన హైప్​ నెలకొంది.

అయితే.. జీటీఏ 6కి సంబంధించినవి అంటూ..10కిపైగా వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. టీపాట్యూబర్​హ్యాకర్​ అనే యూజర్​.. ఈ వీడియోలను లీక్​ చేసినట్టు తెలుస్తోంది.

GTA 6 leaked video in online : "ఇదిగో జీటీఏ 6కి చెందిన వీడియో క్లిప్స్​. ఇంకా వీడియోలను నేను లీక్​ చేయగలను," అని ఆ యూజర్​ రాసుకొచ్చాడు.

ఇక జీటీఏ 6కి వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్​గా మారాయి. యూట్యూబ్​, ట్విట్టర్​లో ఇవి దర్శనమిస్తున్నాయి. రాబరీ, గన్స్​, సంభాషణలతో పాటు మరెన్నో విషయాలు ఈ జీటీఏ 6 లీకడ్​ వీడియోల్లో ఉన్నాయి.

ఈ జీటీఏలో ఇప్పటివరకు హీరో పాత్రలో పురుషుడు మాత్రమే ఉండేవాడు. ఇక జీటీఏ 6లో ఫీమేల్​ లీడ్​ కూడా ఉంటుందని అప్పట్లో ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ లీక్​ అయిన వీడియోల్లో కూడా ఫీమేల్​ లీడ్​ ఉండటం విశేషం.

ఈ వీడియోలు నిజంగా జీటీఏ 6కి చెందినవేనా? అన్న ప్రశ్నకు ప్రస్తుతం సమాధానం లేదు. అయితే.. రాక్​స్టార్​ ఇంటర్నల్​ స్లాక్​ గ్రూప్​ నుంచి వీటిని డైరక్ట్​గా డౌన్​లోడ్​ చేసినట్టు టీపాట్యూబర్​హ్యాకర్​ చెప్పుకొచ్చాడు.

Rockstar gaming GTA 6 : ఈ జీటీఏ 6 లీక్​ వీడియోలపై పలువురు అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అందులో కనిపిస్తున్న పలు దృశ్యాలు జీటీఏ 5తో పోలి ఉన్నాయని చెబుతున్నారు.

ఆన్​లైన్​లో చక్కర్లు కొడుతున్న వీడియోలు నిజంగానే జీటీఏ 6కి చెందినవా? అన్న విషయంపై రాక్​స్టార్​ సంస్థ ఇంకా స్పందించలేదు.

తదుపరి వ్యాసం