తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Viral: పెళ్లి పీటలపై కూర్చొని ల్యాప్‍టాప్‍తో పని చేసిన వరుడు.. నెటిజన్లు ఎలా స్పందిస్తున్నారంటే!

Viral: పెళ్లి పీటలపై కూర్చొని ల్యాప్‍టాప్‍తో పని చేసిన వరుడు.. నెటిజన్లు ఎలా స్పందిస్తున్నారంటే!

29 November 2022, 20:08 IST

    • Groom with laptop during Wedding: పెళ్లి పీటలపై కూర్చొని ల్యాప్‍టాప్‍లో పని చేశాడు ఓ వరుడు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది.
Viral: పెళ్లి పీటలపై కూర్చొని ల్యాప్‍టాప్‍తో పని చేసిన యువకుడు
Viral: పెళ్లి పీటలపై కూర్చొని ల్యాప్‍టాప్‍తో పని చేసిన యువకుడు

Viral: పెళ్లి పీటలపై కూర్చొని ల్యాప్‍టాప్‍తో పని చేసిన యువకుడు

Groom with laptop during Wedding: కరోనా వైరస్ (COVID-19) ప్రపంచంలోకి ప్రవేశించిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ (Work from home) సర్వ సాధారణమైంది. చాలా మంది జీవితాల్లో ఇది అంగర్భాగమైపోయింది. ఆఫీస్ పనులను పూర్తి చేసేందుకు వర్క్ ఫ్రమ్ హోమ్‍లో ఉన్న వారు సమయంతో సంబంధం లేకుండా విధులు నిర్వర్తిస్తుంటారు. పని వేళల్లోనే కాకుండా వేరే సమయాల్లో వర్క్ లో మునిగిపోతుంటారు. అయితే ఓ పెళ్లి కొడుకు మాత్రం ఏకంగా పీటలపై కూర్చొనే ల్యాప్‍టాప్‍తో పని చేశారు. పెళ్లి రోజున కూడా విధులు నిర్వర్తిస్తూ కెమెరాకు చిక్కాడు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

ఓ వైపు పండితులు ఆశీర్వదిస్తున్నా..

Groom with laptop during Wedding: కోల్‍కతా ఇన్‍స్టాగ్రామర్స్ పేరున్న హ్యాండిల్ నుంచి ఇన్‍స్టాగ్రామ్‍లో ఈ ఫొటో పోస్ట్ అయింది. ఓ మండపంలో పెళ్లి కొడుకు పీటలపై కూర్చొని ల్యాప్‍టాప్‍లో పని చేస్తున్నట్టు ఈ ఫొటోలో ఉంది. వేద పండితులు ఆశీర్వదిస్తున్న సమయంలోనూ ఆ పెళ్లి కొడుకు అటు చూడకుండా.. ల్యాప్‍టాప్‍లో మునిగిపోయాడు. ల్యాప్‍టాప్‍లో అతడు ఏం చేస్తున్నాడో స్పష్టత లేదు కానీ, ఆఫీస్ వర్క్ చేస్తున్నాడని భావించవచ్చు.

“వర్క్ ఫ్రమ్ హోమ్ మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్‍కు చేర్చినప్పుడు” అంటూ కోల్‍కతా ఇన్‍స్టాగ్రామర్స్ హ్యాండిల్ ఈ ఫొటోకు ట్యాగ్ ఇచ్చింది. పెళ్లిలో ఇలాంటివి చూడగలిగే స్నేహితులకు ట్యాగ్ చేయండి అంటూ పేర్కొంది.

నెటిజన్ల స్పందన ఎలా ఉందంటే..

Groom with laptop during Wedding: పెళ్లి పీటలపై ల్యాప్‍టాప్‍తో ఉన్న వరుడి ఫొటోకు నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొందరు ఇది చాలా సరదాగా ఉందని కొందరు అంటుంటే.. చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రమాదకరమైన వర్క్ కల్చర్ అని, తన పెళ్లిని కూడా అతడు ఎంజాయ్ చేయలేకున్నాడని చాలా మంది రాసుకొచ్చారు.

“నాకు ఇది సరదాగా అనిపించడం లేదు. పెళ్లి రోజున పని చేయాలని ఏ సంస్థ కూడా ఉద్యోగులకు చెప్పదు. ఒకవేళ ఇది నిజమే అయితే, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలో ఈ వ్యక్తి నేర్చుకోవాల్సి ఉంది. ఆయన పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయికి దేవుడి ఆశీర్వాదం ఉండాలి” అని ఓ యూజర్ ఈ ఫొటోకు కామెంట్ చేశారు. ప్రమాదకరమైన వర్క్ కల్చర్ అంటూ చాలా మంది రాసుకొచ్చారు. అయితే సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఇదో జిమ్మిక్కు అంటూ ఓ యూజర్ అనుమానం వ్యక్తం చేశాడు. మరికొందరు ఇలాంటి వర్క్ కల్చర్ ను ప్రోత్సహించకండి అంటూ అభిప్రాయపడ్డారు.

తదుపరి వ్యాసం