తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Garlic Price In Hyderabad : జేబుకు చిల్లు పెడుతున్న వెల్లుల్లి- భారీగా పెరిగిన ధరలు!

Garlic price in Hyderabad : జేబుకు చిల్లు పెడుతున్న వెల్లుల్లి- భారీగా పెరిగిన ధరలు!

Sharath Chitturi HT Telugu

12 December 2023, 8:55 IST

  • Garlic price in Hyderabad : దేశవ్యాప్తంగా వెల్లుల్లి ధరలు భారీగా పెరుగుతున్నాయి. కొన్ని వారాల్లోనే ధరలు రెట్టింపు అయ్యాయి!

జేబుకు చిల్లు పెడుతున్న వెల్లుల్లి- భారీగా పెరిగిన ధరలు!
జేబుకు చిల్లు పెడుతున్న వెల్లుల్లి- భారీగా పెరిగిన ధరలు! (Photo via Pixabay)

జేబుకు చిల్లు పెడుతున్న వెల్లుల్లి- భారీగా పెరిగిన ధరలు!

Garlic price in Hyderabad : నిన్న మొన్నటి వరకు టమాటా, ఉల్లిపాయల ధరలు పెరిగిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు.. వెల్లుల్లి వంతు వచ్చినట్టి కనిపిస్తోంది! దేశవ్యాప్తంగా వెల్లుల్లి ధరలు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన కొన్ని వారాల్లోనే ఈ ధరలు రెండింతలు పెరగడగం గమనార్హం. దేశంలోని అనేక ప్రాంతాల్లో కేజీ వెల్లుల్లి రూ. 400 పలుకుతోంది. ఇంకొన్ని ప్రాంతాల్లో రూ. 300- రూ. 400 మధ్యలో ఉంది. నవంబర్​లో వచ్చిన అకాల వర్షంతో పంట ధ్వంసమవ్వడం, మార్కెట్​లో డిమాండ్​కు తగ్గ సప్లై లేకపోవడం.. వెల్లులి ధరలకు రెక్కలు రావడానికి కారణం.

ట్రెండింగ్ వార్తలు

Couple gets intimate in the Bus: బస్సులోనే ఒక జంట అశ్లీల చర్యలు; వీడియో వైరల్; గట్టి పనిష్మెంట్ ఇవ్వాలంటున్న నెటిజన్లు

RRB RPF Recruitment 2024: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లో 4660 పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఈ రోజే లాస్ట్ డేట్

Fact Check : 'ల్యాబ్​లో పిల్లలను నచ్చినట్టు తయారు చేసుకోవచ్చు' అంటున్న ఈ వైరల్​ వీడియోలో నిజమెంత?

Sushil Modi death : బీజేపీ సీనియర్​ నేత సుశీల్ కుమార్​​ మోదీ కన్నుమూత..

హోల్​సేల్​ మార్కెట్​లో కేజీ వెల్లుల్లి ధర సగటున రూ. 130-140గా ఉంది. హై క్వాలిటీ వెల్లుల్లి హోల్​సేల్​ ధర మాత్రం కేజీకి రూ. 220- రూ. 250 మధ్యలో ఉంది. వాస్తవానికి శీతాకాలంలో వెల్లుల్లి ధరలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. ఈసారి పంట నష్టంతో పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారాయి.

Garlic price rise : అయితే.. రానున్న రోజుల్లో కూడా ఇదే పరిస్థితులు కొనసాగవచ్చని ట్రేడర్లు చెబుతున్నారు. ఇప్పట్లో పంట చేతికి రాకపోవచ్చని, ధరలు తగ్గకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు.

"స్టాక్​ పడిపోతోంది. సప్లై రావడం లేదు. వర్షాకాలంలో వానలు సరిగ్గా పడకపోవడంతో పంట సరిగ్గా పండలేదు. ఇప్పుడు పంట పండినా.. అకాల వర్షాలకు ధ్వంసమైపోయింది. ఇప్పట్లో ధరలు తగ్గకపోవచ్చు. గుజరాత్​, రాజస్థాన్​, మధ్యప్రదేశ్​ నుంచి రావాల్సిన సరకు.. చాలా ఎక్కువ ధర పలుకుతోంది," అని ముంబై ఏపీఎంసీ డైరక్టర్​ అశోక్​ తెలిపారు.

అకాల వర్షాలకు రైతులు ఎక్కువగా నష్టపోయారు. వాన నీటి నుంచి తమ పంటను కాపాడుకోలేకపోయారు. ఫలితంగా చాలా మందికి రూ. లక్షల్లో నష్టాలు వచ్చాయి.

టామాటా షాక్​..

దేశంలో ద్రవ్యోల్బణం తక్కువగానే ఉన్నా.. కొన్ని కూరగాయల రేట్లు మాత్రం ప్రజలను ఎప్పటికప్పుడు భయపెడుతూనే ఉంటున్నాయి. కొన్ని నెలల క్రితం టమాటా ధరలు ఆకాశాన్ని తాకాయి. రీటైల్​ మార్కెట్​లో కేజీ టమాటా రూ. 220 పలికన సందర్భాలు కూడా ఉన్నాయి. దాని కన్నా ముందు.. కేజీ టమాటా రూ. 20, రూ. 30గా ఉండేది! కొన్ని రోజుల్లోనే ధరలు రెట్టింపు అయ్యాయి. చాలా మంది రైతులు రూ. కోట్లల్లో లాభాలు చూశారు. ఆ తర్వాత పరిస్థితులు మెరుగుపడి, టమాటా ధరలు దిగొచ్చాయి.

తదుపరి వ్యాసం