తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bsf | బీఎస్​ఎఫ్​ క్యాంప్​లో కాల్పుల మోత.. ఐదుగురు మృతి

BSF | బీఎస్​ఎఫ్​ క్యాంప్​లో కాల్పుల మోత.. ఐదుగురు మృతి

HT Telugu Desk HT Telugu

06 March 2022, 14:33 IST

  • BSF | పంజాబ్ అమృత్​సర్​లోని బీఎస్​ఎఫ్​కు చెందిన 144వ బెటాలియన్​ క్యాంప్​లో ఆదివారం కాల్పుల మోత మోగింది. ఓ కానిస్టేబుల్​.. ఐదుగురు సిబ్బందిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్​తో సహా మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వ్యక్తి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.​

జవాన్లను తరలించిన ఆసుపత్రిలో పోలీసులు
జవాన్లను తరలించిన ఆసుపత్రిలో పోలీసులు

జవాన్లను తరలించిన ఆసుపత్రిలో పోలీసులు

BSF jawans killed | పంజాబ్​లోని అమృత్​సర్​లో షాకింగ్​ ఘటన వెలుగులోకి వచ్చింది. నలుగురు బీఎస్​ఎఫ్​ సిబ్బందిపై సహోద్యోగి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో మొత్తం ఐదుగురు మరణించగా.. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.

ఖాశా ప్రాంతంలో 144వ బెటాలియన్​ క్యాంప్​ వద్ద ఆదివారం ఉదయం 9:30- 9:45 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సటెప్ప ఎస్​ఎక్​ అనే కానిస్టేబుల్​.. తన సర్వీస్​ రైఫిల్​తో ఐదుగురు సహచరులపై కాల్పులకు పాల్పడ్డాడు. అయితే కాల్పుల అనంతరం ఎస్​కే ఆత్మహత్య చేసుకున్నాడో లేక ఇతరులు ఆయనపై గన్​పేల్చారో ఇంకా తెలియలేదు.

కాల్పులకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే సీనియర్​ అధికారులు ఘటనాస్థలానికి వెళ్లారు.

ఘటనలో మొత్తం ఐదుగురు మరణించినట్టు, ఒకరు గాయపడినట్టు బీఎస్​ఎప్​ ఓ ప్రకటన విడుదల చేసింది. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించినట్టు స్పష్టం చేసింది. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్టు వెల్లడించింది. కాగా ఈ ఘటనకు గల కారణాలను బీఎస్​ఎఫ్​ ఇంకా బయటకు చెప్పలేదు.

సహచరులపై జవాన్లు కాల్పులకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవలి కాలంలో తీవ్రంగా పెరుగుతున్నాయి. గతేడాది.. ఛత్తీస్​గఢ్​లోని సుక్మా ప్రాంతంలో ఓ జవాను ఇతరులపై కాల్పులు జరిపాడు. ఈ ఘటన సైతం స్థానికంగా కలకలం సృష్టించింది.

అయితే జవాన్లపై అధిక ఒత్తిడి ఉండటం.. కొన్ని సందర్భాల్లో ఇలాంటి ఘటనలకు దారితీస్తున్నాయని గతంలో మానసిక నిపుణులు చెప్పారు. పైగా జవాన్లు చాలా కాలం ఇంటికి దూరంగా ఉండాల్సి రావడంతో వారిపై ఒత్తిడి మరింత పెరుగుతోందని అభిప్రాయపడ్డారు. ఫలితంగా వారి మానసిక ఆరోగ్యం దెబ్బతింటోందని స్పష్టం చేశారు.

తదుపరి వ్యాసం