తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Maharashtra News: రాజ్ థాకరేతో ఏక్‌నాథ్ షిండే మంతనాలు

Maharashtra news: రాజ్ థాకరేతో ఏక్‌నాథ్ షిండే మంతనాలు

HT Telugu Desk HT Telugu

27 June 2022, 9:36 IST

    • maharashtra politics : మహారాష్ట్ర రాజకీయ ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. 
ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాకరే
ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాకరే (HT_PRINT)

ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాకరే

ముంబై, జూన్ 27: మహారాష్ట్రలో రాజకీయ గందరగోళం కొనసాగుతుండగా, ఇటీవలి రాజకీయ పరిస్థితులపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాకరేతో తిరుగుబాటు శివసేన నాయకుడు ఏక్‌నాథ్ షిండే మాట్లాడారు.

షిండే రాజ్ థాకరేతో ఫోన్‌లో రెండుసార్లు మాట్లాడారని, ఆయన ఆరోగ్యం గురించి కూడా ఆరా తీశారని ఓ ఎంఎన్ఎస్ నేత ధ్రువీకరించారు.

‘రెబెల్ శివసేన ఎమ్మెల్యే ఏక్‌నాథ్ షిడే ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాకరేతో ఫోన్‌లో రెండుసార్లు మాట్లాడారు. మహారాష్ట్రలో ఇటీవలి రాజకీయ పరిస్థితుల గురించి షిండే మాట్లాడారు. అతని ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు’ అని ఆ నాయకుడు ధృవీకరించారు.

ముంబై బాంబు పేలుడు నిందితులు దావూద్ ఇబ్రహీంకు, అలాగే అమాయకుల ప్రాణాలను తీయడానికి కారణమైన వారికి మద్దతు ఇస్తున్నారని ఆరోపిస్తూ ఇతర ఎమ్మెల్యేలతో పాటు ప్రస్తుతం అస్సాంలో క్యాంప్ నిర్వహిస్తున్న షిండే అంతకుముందు పార్టీపై విరుచుకుపడ్డారు.

‘ముంబయి బాంబు పేలుళ్ల నిందితులు, ముంబైలోని అమాయకుల ప్రాణాలను తీసేందుకు బాధ్యులైన వారితో ప్రత్యక్ష సంబంధం ఉన్న వ్యక్తులకు బాలాసాహెబ్ ఠాక్రే శివసేన ఎలా మద్దతు ఇస్తుంది? అందుకే మేం అలాంటి చర్య తీసుకున్నాం. లేకుంటే చనిపోవడమే మంచిది..’ అని షిండే ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు.

హిందుత్వ భావజాలాన్ని అనుసరించడానికి తిరుగుబాటు ఎమ్మెల్యేలు చనిపోవలసి వచ్చినా దానిని తమ విధిగా భావిస్తారని ఆయన అన్నారు.

శివసేన ఎమ్మెల్యే సంజయ్ రౌత్ తిరుగుబాటు ఎమ్మెల్యేలను ‘సజీవ శవాలు’ అని అభివర్ణిస్తూ వారి ‘ఆత్మలు చనిపోయాయి’ అని విమర్శించడంతో షిండే ఈ వ్యాఖ్య చేశారు.

అయితే శివసేన నాయకుడు ఆదిత్య థాకరే మాట్లాడుతూ మే 20న సిఎం ఉద్ధవ్ థాకరే.. కావాలంటే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించవచ్చని ఏకనాథ్ షిండేను కోరారని, అయితే ఆ సమయంలో అతను డ్రామా చేసాడని, కేవలం ఒక నెల తరువాత ఇలా తిరుగుబాటు చేసాడని విమర్శించారు.

షిండే శిబిరం ఎమ్మెల్యేలు ఎప్పుడైనా మహారాష్ట్ర శాసనసభలో ఫ్లోర్ టెస్ట్ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారని, అయితే మొదటి పిలుపు ఏకనాథ్ షిండే వర్గానికి ఇవ్వాలని ఇప్పుడు ఏక్‌నాథ్ షిండే శిబిరంలో ఉన్న మాజీ మంత్రి, శివసేన ఎమ్మెల్యే దీపక్ కేసర్కర్ అన్నారు. కాగా షిండే వర్గం తమ బృందానికి 'శివసేన బాలాసాహెబ్' అని పేరు పెట్టింది.

కాగా తిరుగుబాటు ఎమ్మెల్యేలపై డిప్యూటీ స్పీకర్‌ జారీ చేసిన అనర్హత నోటీసులపై షిండే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. షిండే స్థానంలో శివసేన శాసనసభాపక్ష నేతగా అజయ్ చౌదరిని నియమించడాన్ని కూడా ఈ పిటిషన్ సవాలు చేసింది.

టాపిక్

తదుపరి వ్యాసం