తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  ఆసుపత్రి నుంచి పసికందును ఈడ్చుకెళ్లి చంపేసిన వీధి కుక్క!

ఆసుపత్రి నుంచి పసికందును ఈడ్చుకెళ్లి చంపేసిన వీధి కుక్క!

Sharath Chitturi HT Telugu

29 June 2022, 8:30 IST

    • Dog kills newborn : రెండు రోజుల పసికందును ఓ వీధి కుక్క చంపేసింది. ఆసుపత్రిలోకి ప్రవేశించి.. పసికందును బయటకు ఈడ్చుకెళ్లింది. ఈ ఘటన హరియాణాలో జరిగింది.
ఆసుపత్రి నుంచి పసికందును ఈడ్చుకెళ్లి చంపేసిన కుక్క!
ఆసుపత్రి నుంచి పసికందును ఈడ్చుకెళ్లి చంపేసిన కుక్క! (HT Photo)

ఆసుపత్రి నుంచి పసికందును ఈడ్చుకెళ్లి చంపేసిన కుక్క!

Dog kills newborn : హరియాణాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పానిపట్​లో.. ఓ కుక్క ఆసుపత్రిలోకి ప్రవేశించి.. పసికందును చంపేసింది!

అధికారుల సమాచారం ప్రకారం.. సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన మహిళ.. డెలివరి కోసం తన కుటుంబంతో కలిసి పానిపట్​కు వచ్చింది. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరింది.

సోమవారం అర్ధరాత్రి.. మహిళ తల్లి నేల మీద పడుకుంది. పక్కనే రెండు రోజుల పసికందును పడుకోబెట్టుకుంది. కొద్దిసేపటికి.. కుటుంబసభ్యులు వచ్చేసరికి పసికందు కనిపించలేదు. సర్వత్రా భయాందోళనలు నెలకొన్నాయి. పసికందు కోసం వెతకడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఆసుపత్రి సీసీటీవీ ఫుటేజీని చూశారు.

సీసీటీవీ కెమెరాలో అంతా స్పష్టంగా కనిపించింది. ఆర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఓ వీధి కుక్క.. ఆసుపత్రిలోకి ప్రవేశించింది. దానిని ఎవరు పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే పసికందు వద్దకు వెళ్లింది. ఆ పసికందును ఈడ్చుకుంటూ బయటకు తీసుకెళ్లింది. అక్కడే ఆ పసికందును చంపేసింది.

ఈ ఘటనపై స్పందించిన పోలీసులు.. దర్యాప్తును ముమ్మరం చేశారు. ఆసుపత్రి వర్గాల నిర్లక్ష్యంపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తున్నాయి.

టాపిక్

తదుపరి వ్యాసం