తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Himachal Pradesh New Cm Sworn-in: ప్రమాణస్వీకారం చేసిన హిమాచల్ కొత్త సీఎం.. రాహుల్ గాంధీ, ప్రియాంక హాజరు

Himachal Pradesh New CM Sworn-in: ప్రమాణస్వీకారం చేసిన హిమాచల్ కొత్త సీఎం.. రాహుల్ గాంధీ, ప్రియాంక హాజరు

11 December 2022, 15:09 IST

    • Himachal Pradesh CM Sukhwinder singh Sukhu: హిమాచల్ ప్రదేశ్ సీఎంగా సుఖ్విందర్ సింగ్ సుఖు ప్రమాణం చేశారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరయ్యారు.
Himachal Pradesh New CM Oath: ప్రమాణస్వీకారం చేసిన హిమాచల్ కొత్త సీఎం
Himachal Pradesh New CM Oath: ప్రమాణస్వీకారం చేసిన హిమాచల్ కొత్త సీఎం (PTI)

Himachal Pradesh New CM Oath: ప్రమాణస్వీకారం చేసిన హిమాచల్ కొత్త సీఎం

Himachal Pradesh CM Sukhwinder singh Sukhu Oath: హిమాచల్ ప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా సుఖ్విందర్ సింగ్ సుఖు ప్రమాణ స్వీకారం చేశారు. హిమాచల్ రాజధాని షిమ్లాలో ఆదివారం (డిసెంబర్ 11) ఈ కార్యక్రమం జరిగింది. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్ (Congress) జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ (Rahul Gandhi), ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) హాజరయ్యారు. హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రియంకా గాంధీ ముమ్మరంగా పాల్గొన్నారు. పార్టీని ముందుండి నడిపించారు. ఇక, హిమాచల్ ప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ముకేశ్ అగ్నిహోత్రీ (Mukesh Agnihotri) కూడా ప్రమాణం చేశారు. పూర్తి వివరాలు ఇవే..

హిమాచల్ ప్రదేశ్‍కు ఆరుసార్లు సీఎంగా సేవలు అందించిన దివంగత కాంగ్రెస్ నేత వీరభద్ర సింగ్‍ (Virbhadra Singh) కు.. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా నేతలు నివాళులు అర్పించారు. వేదికపై ఆయన చిత్రపటాన్ని ఉంచి.. అందరూ నివాళులు తెలిపారు. వీరభద్ర సింగ్ భార్య ప్రతిభా సింగ్‍ (Pratibha Singh) ను రాహుల్ గాంధీ కలిశారు. సీఎం సీటు రేసులో మొదట ప్రతిభనే ముందున్నారు. అయితే కాంగ్రెస్ హైకమాండ్ సుఖ్విందర్ ను సీఎం పదవికి ఎంపిక చేసింది. సగం కంటే ఎక్కువ మంది ఆయనకే మద్దతు తెలిపినట్టు తెలిసింది.

Himachal Pradesh CM Sukhwinder singh Sukhu: కాగా, హిమాచల్ ప్రదేశ్ సీఎం ఎంపిక కోసం రెండు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం నిర్వహించింది. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ కేంద్ర అబ్జర్వర్లు వచ్చిన సమయంలో ప్రతిభా సింగ్ మద్దతుదారులు వారి కార్లను చుట్టుముట్టారు. సీఎంగా ప్రతిభా సింగ్‍ను ఎంపిక చేయాలని నినాదాలు చేశారు. చత్తీస్‍గఢ్ సీఎం భూపేశ్ బఘేల్‍తో పాటు మరికొందరికి డిమాండ్లు వినిపించి.. హైకమాండ్‍కు తెలిసేలా చేశారు. అయితే కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రం సుఖ్విందర్ సింగ్ సుఖు వైపే మొగ్గుచూపింది. ఈ నేపథ్యంలో ప్రతిభా సింగ్ వర్గంలో అసంతృప్తి వ్యక్తం కాకుండా రాహుల్ గాంధీ ఆమెను కలిసి మాట్లాడారు.

అగ్నిహోత్రి డిప్యూటీగా అందుకే..

ముకేశ్ అగ్నిహోత్రిని హిమాచల్ ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది. ప్రతిభా సింగ్ వర్గానికి చెందిన ఆయనను డిప్యూటీ సీఎంగా చేయడం వల్ల అసంతృప్తి జ్వాలలు రగలకుండా హస్తం పార్టీ జాగ్రత్తలు తీసుకుంది. ఒకవేళ తనకు కాకుంటే ముకేశ్ అగ్నిహోత్రికైనా సీఎం పదవి దక్కాలని ప్రతిభ భావించారని సమచారం.

బస్ డ్రైవర్ కొడుకు నుంచి సీఎం వరకు..

Himachal Pradesh CM Sukhwinder singh Sukhu: సుఖ్విందర్ సింగ్ సుఖు ఇప్పటి వరకు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. హమిర్పూర్ జిల్లా నాదౌన్ (Nadaun) నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

సుఖ్విందర్ తండ్రి బస్ డ్రైవర్ గా విధులు నిర్వర్తిస్తుండేవారు. చదువుకుంటున్న రోజుల్లో కొంతకాలం సుఖ్విందర్ కూడా పాలు అమ్మారు. హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు సుఖ్విందర్. కాంగ్రెస్ పార్టీ విద్యార్థి నేతగా ఉన్నారు. ఆ తర్వాత పార్టీలోకి వచ్చి కీలక నేతగా మారారు. అంచెలంచెలుగా ఎదుగుతూ.. ఇప్పుడు 58 సంవత్సరాల వయసులో ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్నారు. ప్రచార కమిటీ అధ్యక్షుడిగా ఈ ఏడాది ఎన్నికల్లో పార్టీని ముందుండి నడిపించారు సుఖ్విందర్ సింగ్ సుఖు.

Himachal Pradesh Assebly Elections 2022: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 68 స్థానాలకు గాను 40 సీట్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. బీజేపీ 25 స్థానాలకు పరిమితమై అధికారం కోల్పోయింది. అయితే రెండు పార్టీల మధ్య 0.90 శాతం మాత్రమే ఓటింగ్ వ్యత్యాసం ఉంది.

తదుపరి వ్యాసం