తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bjp Candidates List: బీజేపీ మరో రికార్డు; ఎన్నికల షెడ్యూల్ కన్నా ముందే అభ్యర్థుల జాబితా విడుదల

BJP Candidates list: బీజేపీ మరో రికార్డు; ఎన్నికల షెడ్యూల్ కన్నా ముందే అభ్యర్థుల జాబితా విడుదల

HT Telugu Desk HT Telugu

17 August 2023, 19:36 IST

  • BJP Candidates list: సాధారణంగా రాజకీయ పార్టీలు ఎన్నికల తేదీలు ప్రకటించిన తరువాత అభ్యర్థులను ప్రకటిస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో నామినేషన్ల దాఖలు వరకు కూడా సస్పెన్స్ కొనసాగుతూ ఉంటుంది. కానీ, బీజేపీ మాత్రం ఈ సారి ఈ ఎన్నికల ప్రకటనకు ముందే అభ్యర్థులను ప్రకటించే సంప్రదాయానికి తెర లేపింది.

బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా
బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా (PTI)

బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా

BJP Candidates list: సాధారణంగా రాజకీయ పార్టీలు ఎన్నికల తేదీలు ప్రకటించిన తరువాత అభ్యర్థులను ప్రకటిస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో నామినేషన్ల దాఖలు వరకు కూడా సస్పెన్స్ కొనసాగుతూ ఉంటుంది. కానీ, బీజేపీ మాత్రం ఈ సారి ఈ ఎన్నికల ప్రకటనకు ముందే అభ్యర్థులను ప్రకటించే సంప్రదాయానికి తెర లేపింది.

ట్రెండింగ్ వార్తలు

Sushil Modi death : బీజేపీ సీనియర్​ నేత సుశీల్ కుమార్​​ మోదీ కన్నుమూత..

Viral : ఆటగాడివే! ఒకేసారి ఇద్దరు గర్ల్​ఫ్రెండ్స్​.. దొరికిపోయి- చివరికి..

Southwest Monsoon 2024: గుడ్​ న్యూస్​.. ఇంకొన్ని రోజుల్లో దేశాన్ని తాకనున్న నైరుతి రుతుపవనాలు!

PM Modi : ‘పాకిస్థాన్​కి నేను గాజులు తొడుగుతా..’- ప్రధాని మోదీ కామెంట్స్​ వైరల్​!

మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్

ఈ సంవత్సరం మధ్య ప్రదేశ్, చత్తీస్ గఢ్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. త్వరలో ఈ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేయనుంది. అయితే, ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే అభ్యర్థులను ప్రకటించి బీజేపీ చరిత్ర సృష్టించింది. చత్తీస్ గఢ్ అసెంబ్లీలో 90 స్థానాలు ఉంటాయి. అందులో తొలి విడతగా 21 మంది అభ్యర్థులను బీజేపీ గురువారం ప్రకటించింది. అలాగే, 230 సీట్లున్న మధ్య ప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించి 39 నియోజకవర్గాలకు తొలి జాబితా అభ్యర్థులను ప్రకటించింది.

బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగింది. బీజేపీ అభ్యర్థుల ఎంపిక వ్యవహారాలను, ప్రచార వ్యూహాలకు సంబంధించిన విషయాలను ఈ కమిటీనే పర్యవేక్షిస్తుంటుంది. ఆ కమిటీ సమావేశంలో మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ అభ్యర్థుల ఎంపికపై చర్చ జరిగిందని, వివాదం లేని స్థానాల్లో అభ్యర్థులను వెంటనే ప్రకటించాలని ఆ సమావేశంలో నిర్ణయించారని పార్టీ వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా, అభ్యర్థుల పేర్లను ముందే ప్రకటించడం వల్ల ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థిత్వం ఆశించి భంగపడ్డ అసంతృప్త నేతలను బుజ్జగించడానికి, వారికి వేరే పదవులు ఆఫర్ చేయడానికి సమయం లభిస్తుందని పార్టీ అధినాయకత్వం భావించిందని వెల్లడించారు.

తదుపరి వ్యాసం