తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bharat Bandh Today : నేడు భారత్​ బంద్​.. రైతన్నల ఆందోళనలు తీవ్రతరం!

Bharat bandh today : నేడు భారత్​ బంద్​.. రైతన్నల ఆందోళనలు తీవ్రతరం!

Sharath Chitturi HT Telugu

16 February 2024, 6:53 IST

  • Bharat Bandh live updates : నేడు భారత్​ బంద్​కు పిలుపునిచ్చాయి రైతు సంఘాలు. కేంద్రానికి వ్యతిరేకంగా తమ నిరసనలను మరింత తీవ్రతరం చేయనున్నాయి. 

నేడు భారత్​ బంద్​.. రైతన్నల ఆందోళనలు తీవ్రతరం!
నేడు భారత్​ బంద్​.. రైతన్నల ఆందోళనలు తీవ్రతరం! (AFP)

నేడు భారత్​ బంద్​.. రైతన్నల ఆందోళనలు తీవ్రతరం!

Bharat Bandh 16 feb : నేడు భారత్​ బంద్​. సంయుక్త కిసాన్​ మోర్చా సహా అనేక రైతు సంఘాలు.. శుక్రవారం నాడు గ్రామీణ భారత్​ బంద్​కి పిలుపునిచ్చాయి. కేంద్రానికి వ్యతిరేకంగా రైతన్నలు చేపట్టిన నిరసనల్లో భాగంగా.. ఈ భారత్​ బంద్​ని అత్యంత కీలకంగా భావిస్తున్నాయి రైతు సంఘాలు. తమ డిమాండ్​లు నెరవేర్చేందుకు కేంద్రం దిగిరావాలని ఆందోళన చెపట్టేందుకు అన్ని ప్రాంతాల్లో రైతన్నలు సిద్ధమవుతున్నారు. దేశ నలుమూలల్లోని రైతు సంఘాలు.. ఈ భారత్​ బంద్​లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది సంయుక్త కిసాన్​ మోర్చా.

ట్రెండింగ్ వార్తలు

International Space Station: మే 14 వరకు ఈ సమయాల్లో అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ ను నేరుగా చూసే అవకాశం

Crime news : దారుణం.. తల్లి, భార్యను చంపి- పిల్లల్ని మేడ మీద నుంచి పడేసి.. చివరికి..!

Prajwal Revanna case : ప్రజ్వల్​ రేవన్నపై ఫిర్యాదు చేసిన బీజేపీ నేత అరెస్ట్​- మరో మహిళపై..

Weather update : ఇంకొన్ని రోజుల పాటు ఎండల నుంచి ఉపశమనం.. ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు!

నేడు భారత బంద్​..

కేంద్రంపై నిరసనలు చేపట్టేందుకు అనేక రైతు సంఘాలు.. కొన్ని రోజుల క్రితం పంజాబ్​, హరియాణా నుంచి దిల్లీవైపు కదిలాయి. కానీ.. వారందరిని పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. బ్యారికేడ్లు వేసి, భారీగా భద్రతా ఏర్పాట్లు చేసి.. వారిని దిల్లీలోకి రానివ్వకుండా చేశారు. అంతేకాకుండా.. హరియాణాలో.. రైతులపై టియర్​ గ్యాస్​ని సైతం ప్రయోగించారు.

ఈ నేపథ్యంలో శుక్రవారం జరగనున్న భారత్​ బంద్​ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ బంద్​.. ఉదయం 6 గంటలకు మొదలై.. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది.

Bharat Bandh 16 Feb Bangalore : గ్రామీణ భారత్​ బంద్​ కారణంగా.. రవాణా వ్యవస్థ, వ్యవసాయ కార్యకలాపాలు, ఎంఎన్​ఆర్​ఈజీఏ (మహాత్మా గాంధీ నేషనల్​ రూరల్​ ఎంప్లాయిమెంట్​ గ్యారంటీ యాక్ట్​) పనులు, ప్రైవేటు కార్యాలయాలు, గ్రామీణ దుకాణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఇండస్ట్రియల్​, సర్వీస్​ సేక్టార్​లపై ప్రభావం పడే అవకాశం ఉంది.

అయితే.. భారత్​ బంద్​లో అంబులెన్స్​ సర్వీసులు, న్యూస్​ పేపర్​ పంపిణీ, పెళ్లిల్లు, మెడికల్​ షాప్​లు, విద్యార్థుల పరీక్షలు వంటి ఎమర్జెన్సీ సేవలపై ఎలాంటి ప్రభావం ఉండదని పలు నివేదికలు సూచిస్తున్నాయి.

బ్యాంక్​లు మూతపడి ఉంటాయా?

Bharat Bandh in Telangana : భారత్​ బంద్​ నేపథ్యంలో బ్యాంక్​లు పనిచేస్తాయా? అన్న సందేశాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. బ్యాంక్​లు మూసివేయాలని.. ఆర్​బీఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. భారత్​ బంద్​ తీవ్రత ఎక్కువ ఉండే ప్రాంతాల్లో.. బ్యాంకింగ్​ సేవలకు తీవ్ర ఆటంకం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి.

రైతుల డిమాండ్​లు ఏంటి?

Farmers protest delhi : రైతులకు ప్రధానంగా ఆరు డిమాండ్​లు ఉన్నాయి. అవి.. పంటకు కనీస మద్దతు ధరకు చట్టం, రైతు రుణ మాఫీ, స్వామినాథన్​ కమిషన్​ సిఫార్సుల అమలు, 2020 విద్యుత్​ చట్టం ఉపసంహరణ, లఖింపుర్​ ఖేరీ ఘటనలో మరణించిన రైతు కుటుంబాలకు పరిహారం, గతంలో చేపట్టిన నిరసనల నేపథ్యంలో.. రైతులపై వేసిన కేసులను రద్దు చేయడం.

రైతులకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. మరి ఈ భారత్​ బంద్​పై కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

తదుపరి వ్యాసం