తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bengaluru Students Pro-pakistan Slogans:బెంగళూరు కాలేజీలో జై పాకిస్తాన్ నినాదాలు

Bengaluru students pro-Pakistan slogans:బెంగళూరు కాలేజీలో జై పాకిస్తాన్ నినాదాలు

HT Telugu Desk HT Telugu

19 November 2022, 21:33 IST

  • Bengaluru students pro-Pakistan slogans: బెంగళూరులోని ఒక ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థులు పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేయడం వివాదానికి దారితీసింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Bengaluru students pro-Pakistan slogans: బెంగళూరులోని ఒక ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థులు పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేయడం సంచలనంగా మారింది. ఫిర్యాదు అందడంతో పోలీసులు ఆ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.

Pro pak slogans for fun: ఊరికే.. సరదాగా..

బెంగళూరులో ఉన్న ఒక ప్రైవేటు కాలేజీలో ఈ ఉదంతం జరిగింది. కాలేజ్ లో జరుగుతున్న ఒక కల్చరల్ కార్యక్రమంలో ముగ్గురు విద్యార్థులు ఈ నినాదాలు చేశారు. దాంతో, ఇతర విద్యార్థులు వారిని అడ్డుకుని, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘జై హింద్, భారత్ మాతా కీ జై, కర్నాటక మాతా కి జై‘ అని నినాదాలు చేయాలని వారిని డిమాండ్ చేశారు. దాంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. కాలేజీ యాజమాన్యం సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి వెళ్లి ఆ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని ప్రశ్నించగా.. ఊరికే సరదాకి అలా నినాదాలు చేశామని వారు పోలీసులకు చెప్పడం విశేషం.

viral video: వీడియో వైరల్

కొందరు విద్యార్థులు పాక్ అనుకూల నినాదాలు చేయడం, వారితో ఇతర విద్యార్థులు గొడవకు దిగడం అక్కడి వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో కొద్ది సేపట్లోనే వైరల్ గా మారింది. పాక్ అనుకూల నినాదాలు చేసిన దినకర్, ఆర్యన్, రవి చంద్రలపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిపై ఐపీసీ 153, 505 తదితర సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం, ఆ విద్యార్థులను స్టేషన్ బెయిల్ తో రిలీజ్ చేశారు.

టాపిక్

తదుపరి వ్యాసం