తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Man Stabs Friend To Death : మంచి చెప్పిన స్నేహితుడిని కడతేర్చిన డ్రగ్స్​ 'బానిస'!

Man stabs friend to death : మంచి చెప్పిన స్నేహితుడిని కడతేర్చిన డ్రగ్స్​ 'బానిస'!

Sharath Chitturi HT Telugu

08 October 2022, 7:03 IST

  • Man stabs friend to death : 'డ్రగ్స్​ అలవాటు మానుకో..' అని స్నేహితుడికి చెప్పడమే అతడి తప్పు అయ్యింది! కోపంతో ఊగిపోయిన ఆ డ్రగ్స్​ బానిస.. చివరికి మంచి చెబుతున్న స్నేహితుడినే చంపేశాడు. ఈ ఘటన హరియాణాల చోటుచేసుకుంది.

మంచి చెప్పిన స్నేహితుడిని కడతేర్చిన డ్రగ్స్​ 'బానిస'
మంచి చెప్పిన స్నేహితుడిని కడతేర్చిన డ్రగ్స్​ 'బానిస'

మంచి చెప్పిన స్నేహితుడిని కడతేర్చిన డ్రగ్స్​ 'బానిస'

Man stabs friend to death : హరియాణా అంబాలాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మంచి చెప్పిన స్నేహితుడిని కడతేర్చాడు ఓ డ్రగ్స్​ బానిస! డ్రగ్స్​ వ్యామోహం విడిచిపెట్టాలని చెప్పడంతో కోపం తెచ్చుకున్న ఓ వ్యక్తి.. తన స్నేహితుడిని కత్తితో పొడిచి చంపేశాడు.

డ్రగ్స్​ వద్దు రా.. అంటే..

23ఏళ్ల గౌరవ్​, 26ఏళ్ల గుర్మీత్​.. మంచి స్నేహితులు. ఇద్దరు కొన్నేళ్లుగా బిహ్త గ్రామంలో నివాసముంటున్నారు.

అయితే.. కొంతకాలంగా గుర్మీత్​ డ్రగ్స్​కు బానిస అయ్యాడు. అది చూసి స్నేహితుడు గౌరవ్​ చాలా బాధపడ్డాడు. డ్రగ్స్​ను విడిచిపెట్టాలని విజ్ఞప్తి చేశాడు. ఎన్నో విధాలుగా చెప్పి చూశాడు. కానీ గుర్మీత్​.. గౌరవ్​ మాట వినలేదు. చెడు స్నేహంతో కలిసి డ్రగ్స్​ తీసుకుంటూనే ఉన్నాడు. ఇదే విషయంపై స్నేహితుల మధ్య విపరీతమైన గొడవలు అయ్యేవి.

Ambala crime news : శుక్రవారం.. ఈ గొడవ మరింత తీవ్రమైంది. గుర్మీత్​కు నచ్చజెప్పేందుకు గౌరవ్​ మరోమారు ప్రయత్నించాడు. కానీ అది గుర్మీత్​కు నచ్చలేదు. అంతే! కోపంతో ఊగిపోయిన గుర్మీత్​.. కత్తితో గౌరవ్​ను పొడిచి, పొడిచి చంపేశాడు.

"గుర్మీత్​ డ్రగ్స్​కు బానిస అవ్వడం గౌరవ్​కు నచ్చలేదు. వదిలేయాలని చాలాసార్లు చెప్పి చూశాడు. కానీ గుర్మీత్​ వదలలేదు. శుక్రవారం మధ్యాహ్నం.. రామ్​దసియా చోపల్​ ప్రాంతంలో భారీ అరుపులు వినిపించాయి. నేను వెళ్లి చూశాను. అదే సమయంలో గుర్మీత్​.. తన పాకెట్​లో నుంచి కత్తి తీసి గౌరవ్​ను పొడిచాడు. పొడిచి పొడిచి చంపాడు. నేను పరిగెత్తడం చూసి, గుర్మీత్​ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు," అని గౌరవ్​ సోదరుడు అంకిత్​ పోలీసులకు వెల్లడించాడు.

Man kill friend : స్థానికులు గౌరవ్​ను స్థానిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి అంబాలా కంటోన్మెంట్​లోని సివిల్​ హాస్పిటల్​కి తరలించారు. అక్కడి నుంచి పీజీఐఎంఈఆర్​కి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ గౌరవ్​ ప్రాణాలు కోల్పోయాడు.

అంకిత్​ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న సాహా పోలీస్​ స్టేషన్​ పోలీసులు.. గుర్మీత్​ను శుక్రవారం సాయంత్రం పట్టుకున్నారు. అరెస్ట్​ చేసి విచారణను ముమ్మరం చేశారు.

<p>పోలీసుల అదుపులో గుర్మీత్​</p>

కేసరి రైల్వే స్టేషన్​కు సమీపంలో గుర్మీత్​ని పట్టుకున్నట్టు పోలీసులు చెప్పారు. హత్యకు వాడిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. నిందితుడిని శనివారం కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు.

పంజాబ్​, హరియాణాల్లో డ్రగ్స్​ వ్యవహారం చాలా ఆందోళనకరంగా ఉంది. డ్రగ్స్​కు బానిసైన యువత గురించి తరచూ వార్తలు వస్తూనే ఉంటున్నాయి. దీనిపై తల్లిదండ్రులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. కానీ వారి ఆవేదనకు ఫలితం ఉండటం లేదు.

తదుపరి వ్యాసం