తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Aryan Khan | త‌ప్పు చేయ‌కుండానే శిక్షా?

aryan khan | త‌ప్పు చేయ‌కుండానే శిక్షా?

HT Telugu Desk HT Telugu

11 June 2022, 22:54 IST

  • డ్ర‌గ్స్ కేసులో నిందితుడిగా దాదాపు నెల రోజుల‌ పాటు జైలు జీవితం గ‌డిపిన ఆర్య‌న్ ఖాన్.. త‌ప్పు చేయ‌కుండానే శిక్ష అనుభ‌వించాన‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నాడు. ఆర్య‌న్ ఖాన్ బాలీవుడ్ సూప‌ర్ స్టార్ షారూఖ్ ఖాన్ కుమారుడు అన్న‌విష‌యం తెలిసిందే.

ఆర్య‌న్ ఖాన్‌తో షారూఖ్ ఖాన్‌
ఆర్య‌న్ ఖాన్‌తో షారూఖ్ ఖాన్‌

ఆర్య‌న్ ఖాన్‌తో షారూఖ్ ఖాన్‌

`నిజంగా, నేనా శిక్ష‌కు అర్హుడినా?` అని ఆ డ్ర‌గ్స్ కేసును విచారించిన విచార‌ణ అధికారిని ఆర్య‌న్ ఖాన్ ప్ర‌శ్నించారని స‌మాచారం. త‌ప్పు చేయ‌కుండానే శిక్ష అనుభ‌వించాన‌ని ఆర్య‌న్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

స‌రిగ్గా నిద్ర‌పోవ‌డం లేదు

జైలు నుంచి తిరిగి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి త‌న కుమారుడు సరిగ్గా నిద్ర పోవ‌డం లేద‌ని షారూఖ్ ఖాన్ తెలిపారు. రాత్రి స‌మ‌యంలో ఒక్క‌డే ఉండ‌లేక‌పోతున్నాడ‌ని, తోడుగా ఎవ‌రో ఒక‌రు ఉండాల‌ని కోరుకుంటున్నాడ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. `డ్ర‌గ్స్ కేసు వాడి జీవితంలో మ‌చ్చ‌గా మిగిలిపోయింద‌`ని వాపోతున్నారు. ఈ డ్ర‌గ్స్ కేసును నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరొ(ఎన్‌సీబీ) సీనియ‌ర్ ఆఫీస‌ర్ సంజ‌య్ సింగ్ విచారించారు. విచార‌ణ సంద‌ర్భంగా ఆర్య‌న్ ఖాన్ త‌న‌ను కొన్ని లోతైన ప్ర‌శ్న‌లు వేశార‌ని సంజ‌య్ సింగ్ తరువాత ఒక ఇంట‌ర్వ్యూలో చెప్పారు.

అర్థం లేని ఆరోప‌ణ‌లు కాదా?

`నిజంగా, నేనీ శిక్ష‌కు అర్హుడినా?` అని ఆర్య‌న్ త‌న‌ను ప్ర‌శ్నించాడ‌ని సంజ‌య్ సింగ్ తెలిపారు. ఈ ప్ర‌శ్న‌ను తాను ఆర్య‌న్ నుంచి ఊహించ‌లేద‌ని సంజ‌య్ సింగ్ వ్యాఖ్యానించారు. `నా మ‌న‌స్సులో ఏం లేద‌ని, ఓపెన్ మైండ్‌తో ఈ విచార‌ణ‌కు వ‌చ్చాన‌`ని తాను ఆర్య‌న్ ఖాన్ తో చెప్పానని సంజ‌య్ సింగ్ తెలిపారు. దానికి.. `మీరు ఇప్ప‌టికే నాపై అంత‌ర్జాతీయ డ్ర‌గ్ స్మ‌గ్ల‌ర్‌గా, డ్ర‌గ్ ట్రాఫికింగ్‌కు నిధులు అంద‌జేసే వాడిగా ముద్ర వేశారు. ఇవి అర్థం లేని ఆరోప‌ణ‌లు కాదా?` అని ఆర్య‌న్ త‌న‌ను ప్ర‌శ్నించార‌ని సంజ‌య్ వెల్ల‌డించారు. `ఆ రోజు నా వ‌ద్ద ఎలాంటి డ్ర‌గ్స్ ల‌భించ‌లేదు. అయినా, న‌న్ను అరెస్ట్ చేశారు. స‌ర్‌, మీరు నా విష‌యంలో చాలా త‌ప్పు చేశారు. నా పేరును దెబ్బతీశారు. ఇన్ని వారాలు నేను ఎందుకు జైళ్లో గ‌డ‌పాలి? నేను ఈ శిక్ష‌కు అర్హుడినా?` అని ఆర్య‌న్ సూటిగా ప్ర‌శ్నించాడ‌ని సంజ‌య్ వివ‌రించారు.

క‌న్నీళ్లు పెట్టుకున్న షారూఖ్‌

త‌రువాత తాను షారూఖ్‌ను క‌లిసిన స‌మ‌యంలో, త‌న కుమారుడి మాన‌సిక ఆరోగ్యం గురించి షారూఖ్ ఎంతో ఆందోళ‌న చెందాడ‌ని సంజ‌య్ వెల్ల‌డించారు. `ఎలాంటి ఆధారాలు లేన‌ప్ప‌టికీ.. తన కుమారుడిని దోషిగా చిత్రించార‌ని, ఈ స‌మాజాన్ని నాశ‌నం చేస్తున్న అంతర్జాతీయ నేర‌స్తులుగా త‌మపై ప్ర‌చారం చేశార‌ని చెబుతూ షారూఖ్ క‌న్నీళ్లు పెట్టుకున్నారు` అని సంజ‌య్ వివ‌రించారు.

8 నెల‌ల త‌రువాత‌

అరెస్టైన 8 నెల‌ల త‌రువాత ఆర్య‌న్ ఖాన్‌ను ఎన్‌సీబీ నిర్దోషిగా నిర్ధారించింది. దాదాపు 8 నెల‌ల క్రితం ముంబై తీరంలో ఒక క్రూయిజ్ షిప్‌లో జ‌రుగుతున్న పార్టీపై ఎన్సీబీ రెయిడ్ చేసింది. ఆ దాడిలో డ్ర‌గ్స్ వాడుతున్న‌ట్లు స‌మాచారం రావ‌డంతో దాడి చేసి, ఆర్య‌న్ ఖాన్ స‌హా ప‌లువురిని అరెస్ట్ చేసింది.

టాపిక్

తదుపరి వ్యాసం