తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Aryan Khan | డ్రగ్స్​ కేసులో ఆర్యన్​ ఖాన్​కు క్లీన్​ చిట్ ఇచ్చిన్​ ఎన్​సీబీ

Aryan Khan | డ్రగ్స్​ కేసులో ఆర్యన్​ ఖాన్​కు క్లీన్​ చిట్ ఇచ్చిన్​ ఎన్​సీబీ

HT Telugu Desk HT Telugu

27 May 2022, 13:50 IST

    • Aryan Khan drugs case | ముంబై డ్రగ్స్​ కేసులో బాలీవుడ్​ హీరో షారుఖ్​ ఖాన్​ కుమారుడు ఆర్యన్​ ఖాన్​కు ఎన్​సీబీ క్లీన్​ చిట్​ ఇచ్చేసింది. ఆర్యన్​ ఖాన్​ తప్పుచేసినట్టు ఆధారాలు దొరకలేదని వెల్లడించింది.
ఆర్యన్​ ఖాన్​
ఆర్యన్​ ఖాన్​ (HT_PRINT/file)

ఆర్యన్​ ఖాన్​

Aryan Khan drugs case | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముంబై క్రూజ్​ పార్టీ డ్రగ్స్​ కేసులో బాలీవుడ్​ నటుడు షారుక్​ ఖాన్​ తనయుడు ఆర్యన్​ ఖాన్​కు క్లీన్​ చిట్​ లభించింది. ఈ మేరకు.. ఎన్​సీబీ(నార్కొటిక్స్​ కంట్రోల్​ బ్యూరో) శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

ట్రెండింగ్ వార్తలు

JEE Advanced Admit Card : జేఈఈ అడ్వాన్స్​డ్​ అడ్మిట్​ కార్డు విడుదల- ఇలా డౌన్​లోడ్​ చేసుకోండి..

Rain alert : తెలంగాణ, ఆంధ్రలో మరో వారం రోజుల పాటు వర్షాలు- ఆ ప్రాంతాల్లో మాత్రం..

Woman muscular photo: కండలు తిరిగిన యువతిపై ట్రోలింగ్.. అబ్బాయిలకు దిమ్మతిరిగే జవాబు ఇచ్చిన కోచ్

Diabetes medicine price cut: గుండెజబ్బులు, డయాబెటిస్ మందుల ధరలను తగ్గించిన ప్రభుత్వం

గతేడాది ముంబైలోని క్రూజ్​ షిప్​లో బయటపడ్డ డ్రగ్స్​ కేసులో.. తాజాగా 6వేల పేజీలతో కూడిన ఛార్జ్​ షీట్​ను దాఖలు చేసింది ఎన్​సీబీ. మొత్తం మీద 14మందిపై నేరారోపణలు మోపింది. కాగా.. అందులో ఆర్యన్​ ఖాన్​ పేరు లేదు.

"ఛార్జ్​షీట్​లో పేర్కొన్న వారికి డ్రగ్స్​తో సంబంధం ఉందని తేలిసింది. కాగా.. ఆర్యన్​ ఖాన్​తో పాటు మరో ఐదుగురు.. డ్రగ్స్​ తీసుకున్నట్టు ఆధారాలేవీ లభించలేదు. అందుకే వారి పేర్లను ఛార్జ్​షీట్​లో పేర్కొనలేదు," అని ఎన్​బీ సీనియర్​ అధికారి సంజయ్​ కుమార్​ సింగ్​ ఓ ప్రకటనలో వెల్లడించారు.

ఇదీ కేసు..

Aryan Khan | ముంబయిలో గతేడాది అక్టోబర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన సంచలనం రేపింది. ముంబయి తీరంలో కార్డీలియా క్రూయిజ్‌ లైనర్‌ అనే నౌకపై ఎన్​సీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. క్రూయిజ్‌లో డ్రగ్స్ తీసుకున్న 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలతో పాటు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మొదటిగా.. షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ ను అరెస్ట్ చేశారు. అనంతరం పలువురిని అదుపులోకి తీసుకున్నారు. బెయిల్​ లభించగా.. ఆర్యన్​ ఖాన్​ కొన్ని రోజుల పాటు జైలులోనే ఉండాల్సి వచ్చింది. చివరికి ఆయనకు బెయిల్​ దొరికింది.

కాగా.. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో గత నెలలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక సాక్షిగా ఉన్న ప్రభాకర్ సెయిల్‌(36) మృతి చెందారు. గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయినట్లు.. అతడి తరఫు న్యాయవాది వెల్లడించారు. ప్రభాకర్ ఇంట్లో ఉన్న సమయంలో గుండెపోటు వచ్చిందని.. ఆయన మృతిపై కుటుంబ సభ్యులు ఎవరిపై అనుమానం వ్యక్తం చేయలేదని చెప్పారు. అతడికి తల్లి, భార్య, ఇద్దరు పిల్లలున్నారు.

తదుపరి వ్యాసం