ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు.. కీలక సాక్షి మృతి.. ఏం జరిగిందంటే..?-key witness died in aryan khan drugs case ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు.. కీలక సాక్షి మృతి.. ఏం జరిగిందంటే..?

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు.. కీలక సాక్షి మృతి.. ఏం జరిగిందంటే..?

HT Telugu Desk HT Telugu
Apr 02, 2022 11:50 AM IST

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.ఈ కేసులో ఓ ప్రధాన సాక్షి మృతి చెందాడు.

ఆర్యన్ ఖాన్ కేసులో సాక్షి మృతి
ఆర్యన్ ఖాన్ కేసులో సాక్షి మృతి (HT)

సంచలనం సృష్టించిన ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముంబయి క్రూజ్ డ్రగ్స్‌ కేసులో ఎన్ సీబీ నమోదు చేసిన కేసులో కీలక సాక్షిగా ఉన్న ప్రభాకర్ సెయిల్‌(36) మృతి చెందారు. శుక్రవారం మధ్యాహ్నం గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయినట్లు.. అతడి తరఫు న్యాయవాది వెల్లడించారు. ప్రభాకర్ ఇంట్లో ఉన్న సమయంలో గుండెపోటు వచ్చిందని.. ఆయన మృతిపై కుటుంబ సభ్యులు ఎవరిపై అనుమానం వ్యక్తం చేయలేదని చెప్పారు. అతడికి తల్లి, భార్య, ఇద్దరు పిల్లలున్నారు.

ముంబయిలో గతేడాది అక్టోబర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన సంచలనం రేపింది. ముంబయి తీరంలో కార్డీలియా క్రూయిజ్‌ లైనర్‌ అనే నౌకపై ఎన్ సీబీ అధికారులు సోదాలు చేపట్టారు. క్రూయిజ్‌లో డ్రగ్స్ తీసుకున్న 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలతో పాటు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మొదటగా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ ను అరెస్ట్ చేశారు. అనంతరం పలువురిని అదుపులోకి తీసుకున్నారు.ఈ కేసులో పలువురిని సాక్షులుగా చేర్చింది ఎన్ సీబీ. అందులో ఒకరిగా ప్రభాకర్ సెయిల్ గా ఉన్నాడు.

IPL_Entry_Point

టాపిక్