తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Amazon Layoffs: అమెజాన్‍లో ఉద్యోగుల తొలగింపు మొదలు.. 10వేల మందికిపైగా..

Amazon Layoffs: అమెజాన్‍లో ఉద్యోగుల తొలగింపు మొదలు.. 10వేల మందికిపైగా..

17 November 2022, 10:37 IST

    • Amazon Layoffs process starts: పాపులర్ కంపెనీ అమెజాన్ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను మొదలుపెట్టింది. సుమారు 10వేల మంది ఎంప్లాయిస్‍ను తొలగించనున్నట్టు అధికారికంగా ధ్రువీకరించింది ఆ సంస్థ. అయితే ఉద్యోగాలు కోల్పోనున్న వారికి మరో ఆప్షన్‍ను ఇచ్చింది అమెజాన్.
Amazon Layoffs: అమెజాన్‍లో ఉద్యోగుల తొలగింపు మొదలు.. 10వేల మందికిపైగా..
Amazon Layoffs: అమెజాన్‍లో ఉద్యోగుల తొలగింపు మొదలు.. 10వేల మందికిపైగా.. (REUTERS)

Amazon Layoffs: అమెజాన్‍లో ఉద్యోగుల తొలగింపు మొదలు.. 10వేల మందికిపైగా..

Amazon Layoffs starts: దిగ్గజ సంస్థ అమెజాన్.. ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను మొదలుపెట్టింది. కంపెనీ నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా సిబ్బందిని తగ్గించుకునేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను నేడు మొదలుపెట్టింది. మొత్తంగా ఈవారంలో వివిధ విభాగాల్లో సుమారు 10వేల మంది ఉద్యోగులను తీసేయనున్నట్టు అమెరికన్ కంపెనీ అమెజాన్ ప్రకటించింది. వివిధ దేశాల్లో పని చేస్తున్న ఉద్యోగులు కూడా ఈ తొలగింపునకు గురికానున్నారు. ఇప్పటికే ట్విట్టర్, మెటాతో పాటు కొన్ని భారీ సంస్థలు వేలాది మంది ఉద్యోగులను తీసేయగా.. ఇప్పుడు జెఫె బెజోస్ (Jeff Bezos)కు చెందిన అమెజాన్ కూడా అదే బాటలో నడిచింది. దీనిపై అమెజాన్ అధికారిక ప్రకటన చేసింది. పూర్తి వివరాలు..

ట్రెండింగ్ వార్తలు

CBSE Class 12 Result 2024: సీబీఎస్ఈ 12వ తరగతి మార్కుల వెరిఫికేషన్ కు రిజిస్ట్రేషన్ ప్రారంభం

Bihar crime news : కస్టడీలో దంపతులు మృతి.. ప్రజల ఆగ్రహానికి తగలబడిన పోలీస్​ స్టేషన్​!

Haryana bus accident : బస్సులో చెలరేగిన మంటలు.. 8 మంది మృతి- 24 మందికి గాయాలు!

Fire in flight: ఆకాశంలో ఉండగానే ఎయిర్ ఇండియా విమానంలో మంటలు; ఢిల్లీ ఏర్ పోర్ట్ లో ఫుల్ ఎమర్జెన్సీ

Amazon Layoffs starts: ఆర్థిక పరిస్థితుల వల్లే..

అసాధారణ, అనిశ్చితితో కూడిన ఆర్థిక పరిస్థితుల వల్ల ఉద్యోగుల తీసివేత తప్పలేదని అమెజాన్ పేర్కొంది. ఇప్పటికే తొలగించాలనుకున్న ఉద్యోగులకు ఈ-మెయిల్స్ ద్వారా సమాచారం పంపింది. ఈ విషయాన్ని అమెజాన్ డివైజెస్, సర్వీసెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డేవిడ్ లింప్ వెల్లడించారు. “ప్రభావితమైన ప్రతీ ఉద్యోగికి మద్దతు అందిస్తాం. కొత్త రోల్స్ వెతుక్కునేందుకు కూడా సాయం చేస్తాం” అని డేవిడ్ తెలిపారు. ఈ-కామర్స్, క్లౌడ్ కంప్యూటింగ్, ఆన్‍లైన్ అడ్వర్టయిజింగ్, డిజిటల్ స్ట్రీమింగ్ విభాగాల్లోని సిబ్బందిలో కోత విధిస్తోంది అమెజాన్.

అమెజాన్ ప్రతికూల ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొంటోందని, అందుకే కొన్ని టీమ్స్ ను సవరించి, ప్రోగ్రామ్‍లను ఏకీకృతం చేస్తున్నట్టు డేవిడ్ లింప్ చెప్పారు. అంటే ఆర్థిక కారణాలే ఉద్యోగాల తొలగింపునకు కారణం అని వెల్లడించారు.

Amazon Layoffs starts: అందుకు రెండు నెలల గడువు

ఉద్యోగుల తొలగింపు వల్ల అమెజాన్‍లో డివైజ్& సర్వీస్‍లపై ఎక్కువ ప్రభావం ఉండనుంది. తీసివేతకు సంబంధించిన ఉద్యోగులు ఇప్పటికే ఉద్యోగులు మెయిల్స్ అందుకున్నారు. కంపెనీలోనే ఇంకో రోల్‍ను పొందేందుకు అమెజాన్ వారికి రెండు నెలల గడువు ఇచ్చింది. అంటే కంపెనీలోనే వేరే విధులు ఉండే ఉద్యోగ కోసం ప్రయత్నించవచ్చు. ఒకవేళ రెండు నెలల్లోగా వేరే ఉద్యోగానికి ఎంపిక కాకపోతే.. అమెజాన్ నుంచి బయటికి పోవాల్సిందే. ఇలా సంస్థ నుంచి తొలగించే ఉద్యోగులకు సపరేషన్ పేమెంట్స్, ట్రాన్సిషనల్ బెనిఫిట్స్ ను అందించనున్నట్టు అమెజాన్ పేర్కొంది.

ఫేస్‍బుక్ పేరెంట్ కంపెనీ మెటా ఇటీవలే భారీ స్థాయిలో ఉద్యోగులను సాగనంపింది. ఏకంగా సుమారు 11వేల మందిని ఒకేసారి తొలగించింది. ప్రపంచవ్యాప్తంగా 13శాతం మంది సిబ్బందిని తగ్గించుకుంది. చరిత్రలో ఇంత మంది ఉద్యోగులను తొలగించటం ఆ కంపెనీకి ఇదే తొలిసారి. మరోవైపు ఎలాన్ మస్క్ చేతుల్లోకి వెళ్లిన ట్విట్టర్ కూడా భారీ స్థాయిలోనే ఉద్యోగులను తొలగించింది. 50 శాతం మందిని ఇంటికి పంపింది. సుమారు 3,700 మంది ఉద్యోగులను కంపెనీ నుంచి ఎలాన్ మస్క్.. అప్పటికప్పుడు తొలగించారు.

టాపిక్

తదుపరి వ్యాసం