తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Aishwarya Rai's Fake Passport: ఐశ్వర్య రాయ్ ఫొటో, పేరుతో ఫేక్ పాస్ పోర్ట్

Aishwarya Rai's fake passport: ఐశ్వర్య రాయ్ ఫొటో, పేరుతో ఫేక్ పాస్ పోర్ట్

HT Telugu Desk HT Telugu

16 December 2022, 21:39 IST

  • Aishwarya Rai's fake passport: ఉత్తర ప్రదేశ్ లో ఒక నైజీరియన్ గ్యాంగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి బాలీవుడ్ స్టార్ ఐశ్వర్య రాయ్ ఫోటో, పేరుతో ఉన్న నకిలీ పాస్ పోర్ట్ లభించింది.

ఐశ్వర్య రాయ్ (ఫైల్ ఫొటో)
ఐశ్వర్య రాయ్ (ఫైల్ ఫొటో)

ఐశ్వర్య రాయ్ (ఫైల్ ఫొటో)

Aishwarya Rai's fake passport: గ్రేటర్ నోయిడాలో యూపీ పోలీసులు శుక్రవారం ముగ్గురు నైజీరియన్లను అరెస్ట్ చేశారు. వారు ఫార్మా కంపెనీ పేరుతో పలువురిని మోసం చేసిన కేసులో, పలు సైబర్ నేరాల్లో వారు నిందితులుగా ఉన్నారు.

Nigerian gang: ఐశ్వర్య పాస్ పోర్ట్

నైజీరియన్ గ్యాంగ్ వద్ద ఐశ్వర్య రాయ్ నకిలీ పాస్ పోర్ట్ లభించడంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.ఆ పాస్ పోర్ట్ లో పుట్టిన స్థలం కాలమ్ లో భావ్ నగర్, గుజరాత్ అని, అలాగే, పుట్టిన తేదీ కాలమ్ లో ఏప్రిల్ 8, 1990 అని ఉంది. ఆ పాస్ పోర్ట్ ను ఎలా సంపాదించారు? దానితో ఏం చేయాలనుకుంటున్నారు?, ఇంకా ఎవరైనా ప్రముఖుల పేర్లతో డాక్యుమెంట్లను రూపొందించారా? తదితర అంశాలపై ఆ గ్యాంగ్ ను ప్రశ్నిస్తున్నారు. ఆ గ్యాంగ్ రూ. 1.8 కోట్ల మోసం కేసులో నిందితులుగా ఉన్నారు. దాంతో పాటు మేట్రిమోనియల్ సైట్లు, డేటింగ్ యాప్ ల ద్వారా వారు చాలా మందిని మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. వారితో పాటు భారత్ కు చెందిన ఒక రిటైర్డ్ కల్నల్ కూడా ఉండడం విశేషం. ఆ గ్యాంగ్ నుంచి పోలీసులు 3000 డాలర్లను, 10,500 పౌండ్లను, రూ. 11 కోట్ల నకిలీ కరెన్సీని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ నైజీరియన్ల వద్ద వారి వీసాలు కానీ, పాస్ పోర్ట్ లు కానీ పోలీసులకు లభించలేదు.

Aishwarya Rai's fake passport: గతంలో కూడా

గతంలో కూడా ఒకసారి వేరే గ్యాంగ్ నుంచి ఐశ్వర్య రాయ్ నకిలీ పాస్ పోర్ట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం గమనార్హం. అప్పుడు ఆ పాస్ పోర్ట్ పై బర్త్ ప్లేస్ గా మంగళూరు, కర్నాటక అని, డేటాఫ్ బర్త్ నవంబర్ 1, 1973 అని ఉంది. 2006లో దాన్ని ఒకసారి రెన్యువల్ కూడా చేయడం విశేషం. తాగా, ఐశ్వర్య రాయ్ మణిరత్నం దర్శకత్వం వహించిన పొన్నియిన్ సెల్వన్ 1 లో సినిమాలో నటించారు.

తదుపరి వ్యాసం