HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  8 Ex-indian Navy Officers Detained In Doha: ఖతార్ నిర్బంధంలో నేవీ మాజీ అధికారులు

8 ex-Indian Navy officers detained in Doha: ఖతార్ నిర్బంధంలో నేవీ మాజీ అధికారులు

HT Telugu Desk HT Telugu

08 November 2022, 20:38 IST

  • 8 ex-Indian Navy officers detained in Doha: ఎనిమిది మంది భారతీయ నౌకాదళ మాజీ అధికారులను ఖతార్ ప్రభుత్వం అక్రమంగా నిర్బంధించింది. ఈ అక్రమ నిర్బంధంపై ప్రభుత్వం స్పందించడం లేదని ఆ బంధితుల్లో ఒకరైన నేవీ అధికారి సోదరి ఆరోపించారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

8 ex-Indian Navy officers detained in Doha: భారత నౌకాదళ మాజీ ఉన్నతాధికారులను ఖతార్ అక్రమంగా నిర్బంధించినవిషయం ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ సంవత్సరం ఆగస్ట్ 30 నుంచి ఖతార్ రాజధాని దోహాలో వారిని వేర్వేరుగా ఏకాంత నిర్బంధంలో ఉంచారు.

8 ex-Indian Navy officers detained in Doha: రిటైర్డ్ కమాండర్

ఖతార్ నిర్బంధంలో ఉన్న 8 మంది నేవీ మాజీ అధికారుల్లో ఒకరు పునేందు తివారి. ఆయన నేవీలో కమాండర్ గా విధులు నిర్వర్తించారు. ఈ నేవీ మాజీ అధికారుల అక్రమం నిర్బంధం గురించి ఆయన సోదరి మీతు భార్గవ వెల్లడించారు. తన సోదరుడు, అతడితో పాటు నిర్బంధంలో ఉన్న వారిని సురక్షితంగా తీసుకురావాలని ఆమె ప్రధాని మోదీని కోరారు.

8 ex-Indian Navy officers detained in Doha: ట్రైనింగ్ ఇవ్వడానికి..

మీతు భార్గవ తెలిపిన వివరాల ప్రకారం.. పునేందు తివారీ నేవీలో కమాండర్ గా పని చేశారు. రిటైర్మెంట్ అనంతరం సొంతంగా దాహ్రా గ్లోబల్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ను స్టార్ట్ చేశారు. ఆ సంస్థ తరఫున ఖతార్ నేవీ అధికారులకు శిక్షణ ఇవ్వడానికి సహచరులు ఏడు మందితో కలిసి దోహాకు వెళ్లారు.

8 ex-Indian Navy officers detained in Doha: కారణాలు తెలియదు..

కారణాలేంటో తెలియదు కానీ.. ఆ ఎనిమిది మందిని ఖతార్ ప్రభుత్వం అక్రమంగా నిర్బంధించింది. వారిపై ఎలాంటి చట్టబద్ధ ఆరోపణలు చేయకుండా, నిర్బంధాన్ని కొనసాగిస్తోంది. ఈ విషయంపై ఖతార్ ప్రభుత్వం ఆ నేవీ అధికారుల కుటుంబాలకు కానీ, భారత ప్రభుత్వానికి కానీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. వారిపై మోపిన నేరారోపణలు ఏంటో కూడా చెప్పడం లేదు.

8 ex-Indian Navy officers detained in Doha: ఆరోగ్యం బాగాలేదు..

70 ఏళ్ల తన సోదరుడి ఆరోగ్యం బాగాలేదని, ఆయన విడుదల కోసం కృషి చేయాలని మీతు భార్గవ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తన సోదరుడు పునేందు తివారీకి ఖతార్ ప్రభుత్వ సిఫారసు మేరకు భారత ప్రభుత్వం ‘ప్రవాస భారతీయ సమ్మాన్’ పురస్కారం కూడా ఇచ్చిందని ఆమె తెలిపారు.

తదుపరి వ్యాసం