తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Up Teen Bags World Record: 15 ఏళ్లకే వరల్డ్ రికార్డ్; గిన్నిస్ బుక్ లో స్థానం; ఈ రికార్డు ఎందులోనో తెలుసా..?

UP teen bags world record: 15 ఏళ్లకే వరల్డ్ రికార్డ్; గిన్నిస్ బుక్ లో స్థానం; ఈ రికార్డు ఎందులోనో తెలుసా..?

HT Telugu Desk HT Telugu

16 September 2023, 14:32 IST

  • UP teen bags world record: గ్రేటర్ నోయిడాకు చెందిన సిదక్ దీప్ సింగ్ చాహల్ కు 15 ఏళ్లు. ఈ బాలుడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ (Guinness World Records)లో చోటు సంపాదించారు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన జుట్టు (longest hair) ఉన్నవాడిగా ఈ బాలుడు రికార్డు సృష్టించారు.

గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించిన సిదక్ దీప్ సింగ్ చాహల్
గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించిన సిదక్ దీప్ సింగ్ చాహల్ (YouTube/@guinnessworldrecords)

గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించిన సిదక్ దీప్ సింగ్ చాహల్

UP teen bags world record: ఉత్తర ప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాకు చెందిన 15 ఏళ్ల సిదక్ దీప్ సింగ్ చాహల్ (Sidakdeep Singh Chahal) గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించాడు. అత్యంత పొడవైన జుట్టు (longest hair) ఉన్నవాడిగా ఆయన రికార్డు సృష్టించాడు. 2024 ఎడిషన్ గిన్నిస్ బుక్ లో అతడి వివరాలు రానున్నాయి. గిన్నిస్ బుక్ వారు ఈ వివరాలను ఒక యూట్యూబ్ వీడియోలో షేర్ చేశారు.

ఎంత పొడవంటే..

సిక్ కమ్యూనిటీకి చెందిన సిదక్ దీప్ సింగ్ చాహల్ కుటుంబం తమ మతాచారాలను కచ్చితంగా పాటిస్తుంటుంది. అందులో భాగంగానే సిదక్ దీప్ సింగ్ చాహల్ కు వారు చిన్నప్పటి నుంచి జుట్టు కత్తిరించలేదు. దాంతో, అతడి జుట్టు బలంగా, పొడవుగా పెరిగింది. ఇప్పుడు సిదక్ దీప్ సింగ్ చాహల్ జుట్టు పొడవు 4.10 అడుగులు లేదా 146 సెంటీమీటర్లు. దాంతో, అత్యంత పొడవైన జుట్టు (long hair) ఉన్నవ్యక్తిగా సిదక్ దీప్ సింగ్ చాహల్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించాడు. గిన్నిన్ బుక్ లో స్థానం సంపాదించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని, ఈ విషయం చెబితే తన స్నేహితులు, బంధువులు నమ్మడం లేదని నవ్వుతూ చెబుతున్నాడు.

మొదట్టో ఏడుపు.. ఇప్పుడు హ్యాపీ..

సిదక్ దీప్ సింగ్ చాహల్ మొదట్లో తన జుట్టుతో చాలా ఇబ్బంది పడేవాడట. జుట్టు కత్తిరించాలని కుటుంబ సభ్యులతో గొడవ పెట్టుకునేవాడట. కానీ, క్రమంగా తన జుట్టుపై ఇష్టం పెంచుకుని, జాగ్రత్తగా చూసుకోవడం ప్రారంభించాడట. ఈ పొడవైన జుట్టు తన జీవితంలో ఒక భాగంగా మారిపోయిందని, జీవితాంతం అది తనతోనే ఉంటుందని నిర్ధారించుకున్నాడట. ఈ వివరాలను ఒక యూట్యూబ్ వీడియోలో సిదక్ దీప్ సింగ్ చాహల్ వివరించాడు. జుట్టును జాగ్రత్తగా చూసుకోవడంతో తన తల్లి తనకు ఎంతో సహాయం చేస్తోందని, ఆమె సాయం లేకపోతే, తన సరి చేసుకోవడానికి తనకు ఒక రోజంతా పడుతుందని తెలిపాడు. తమ మతాచారాల ప్రకారం తన జుట్టును ముడి వేసి, టర్బన్ తో కవర్ చేస్తానని తెలిపాడు.

తదుపరి వ్యాసం