తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Yoga For Joint Health । కీళ్లను బలోపేతం చేసే, అర్థరైటిస్‌ను నివారించే యోగాసనాలు!

Yoga for joint health । కీళ్లను బలోపేతం చేసే, అర్థరైటిస్‌ను నివారించే యోగాసనాలు!

HT Telugu Desk HT Telugu

12 August 2023, 9:31 IST

    • Yoga for joint health: ఆర్థరైటిస్ నొప్పులకు యోగాలోని వివిధ ఆసనాలు ప్రభావవంతమైన పనితీరును కనబరుస్తాయి. కీళ్ల నొప్పులకు సహాయపడే యోగాసనాలు ఏవో ఈ కింద తెలుసుకోండి.
Yoga for joint health:
Yoga for joint health: (istock)

Yoga for joint health:

Yoga for joint health: ఆర్థరైటిస్ అనేది కీళ్ల నొప్పులను కలిగించే ఒక సమస్య. ఇందులో వందకు మించిన రకాలు ఉన్నాయి. చాలా రకాల ఆర్థరైటిస్‌లు చురుకైన రోగనిరోధక వ్యవస్థ దాని స్వంత కణజాలంపైనే దాడి చేయడం వల్ల ఆయా ప్రాంతాల్లో మంట, నొప్పి అలాగే వాపు ఉంటుంది. కీళ్ల మధ్యలో మృదులాస్థి అరిగిపోవడం వలన కీళ్ల నొప్పులు, కదపలేకుండా గట్టిపడటం, వాపు మొదలైన సాధారణ లక్షణాలు కనబరుస్తుంది. అయితే అన్ని రకాల ఆర్థరైటిస్ నొప్పులకు యోగాలోని వివిధ ఆసనాలు ప్రభావవంతమైన పనితీరును కనబరుస్తాయి. ఆ ఆసనాలను వేయడం వలన నొప్పి నుంచి ఉపశమనం లభించడమే కాకుండా, ప్రభావిత కీళ్లలో కదలిక గణనీయంగా మెరుగుపడుతుందని యోగా నిపుణులు పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు

Friday Motivation: మీ మనసును అదుపులో పెట్టుకుంటేనే విజయం దక్కేది, అందుకోసం ధ్యానం చేయక తప్పదు

Patha Chinthakaya Pachadi: పాత చింతకాయ పచ్చడి ఇలా చేసుకున్నారంటే దోశె, ఇడ్లీ, అన్నంలోకి అదిరిపోతుంది

Diabetes and Methi water: ఖాళీ పొట్టతో మెంతి నీళ్లు తాగి చూడండి, నెలలోనే మ్యాజిక్ చూస్తారు

Cherakurasam Paramannam: పంచదారకు బదులు చెరుకు రసంతో పరమాన్నాన్ని వండి చూడండి, ఎంతో ఆరోగ్యం

HT లైఫ్‌స్టైల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, అక్షర యోగా సంస్థల వ్యవస్థాపకుడు హిమాలయన్ సిద్ధా అక్షర్ మాట్లాడుతూ అర్థరైటిస్ సమస్యకు యోగా అద్భుతమైన పరిష్కారం చూపుతుందని చెప్పారు. యోగా ఆసనాలు డైనమిక్ కదలిక, కండరాల సాగదీయడం, బలాన్ని పెంచడం, మెరుగైన ఫ్లెక్సిబిలిటీ అందిస్తాయని తెలిపారు. ఈ మేరకు ఆయన కొన్ని ఆసనాలను తెలియజేశారు, వాటిని మీ శరీర సామర్థ్యంపై అవగాహన కలిగి ఉండి సురక్షితంగా సాధన చేయాలని తెలిపారు. ప్రతి ఒక్క భంగిమలో కనీసం పది నుండి పదిహేను సెకన్ల పాటు ఉంటూ, పునరావృతం చేయాలని సూచించారు. కీళ్ల నొప్పులకు సహాయపడే యోగాసనాలు ఏవో ఈ కింద తెలుసుకోండి.

1. హస్తోత్తనాసనం

విధానం: నేలపై నిటారుగా నిలబడండి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ, రెండు చేతులను మీ తలపైకి పైకెత్తి, మీ అరచేతులను ఇంటర్‌లాక్ చేయండి. అదే భంగిమలో మీకు ఎంత వీలైతే అంత మీ వీపును వెనక్కి వంచండి, అలా కొన్ని సెకన్ల పాటు ఉండి, నెమ్మదిగా ఊపిరి వదులుతూ, మీ చేతులను సమస్థితి స్థానానికి క్రిందికి తీసుకురండి.

2. మలాసనం

ఇది వ్యర్థాలను తరలించే భంగిమ, ఈ మలాసనంలో మీరు సాంప్రదాయ పద్ధతిలో మల విసర్జన కార్యకలాపం చేస్తున్నట్లుగా కూర్చోవాలి. అయితే ఈ సమయంలో మీ రెండు చేతులు జోడించి నమస్కార భంగిమలో ఉండాలి.

3. సమస్థితి/తడాసనం

సమస్థితి లేదా దీనినే తడాసనం లేదా పర్వత భంగిమ అంటారు. పర్వత భంగిమలో మీరు నిటారుగా నిలబడండి, మీ రెండు చేతులను పూర్తిగా పైకెత్తి ఒకదానితో ఒకటి ఇంటర్లాక్ చేయండి. ఈ భంగిమలో మీ కాలి వేళ్లు, మడమలను దగ్గరగా తాకేలా నిలబడాలి, రెండు పాదాల మధ్య మీ శరీర బరువును సమానంగా పంపిణీ అవ్వాలి. ఈ భంగిమలో 5-8 సార్లు శ్వాస తీసుకోవడం, వదలడం చేయండి.

4. పశ్చిమోత్తనాసనం

పశ్చిమోత్తనాసనం కూర్చొని వేసే భంగిమ. ఆసనం వేయడానికి ఒకచోట కూర్చొని మీ రెండు కాళ్లను ముందుకు చాచండి. మీ చేతులతో మీ కాళ్ల వేళ్లను పట్టుకొని, మీ తలను మీ మోకాళ్లకు తగిలేకా చేయండి. మీరు మీ చేతులను పైకి ఎత్తేటప్పుడు మీ వెన్నెముక నిటారుగా ఉంచండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు ముందుకు వంగి, మీ కాలి బొటనవేళ్లను మీ వేళ్లతో లేదా ఏదైనా ఇతర ప్రాప్యత ప్రాంతంతో పట్టుకోవడానికి ప్రయత్నించండి.

5. ధనురాసనం (విల్లు భంగిమ)

ధనురాసనం లేదా బ్యాక్‌బెండింగ్ లేదా విల్లు భంగిమ చేసేటపుడు ఒక చోట బోర్లాపడుకోండి. ఆ తర్వాత మీ కాళ్లను మీ వీపు వైపు మడవండి, తర్వాత మీ చేతులతో మీ కాళ్ల చీలమండలను పట్టుకోడానికి ప్రయత్నించండి. మీ కడుపుపై భారం పడేలా పైకి చూస్తూ, మీ చేతులు, కాళ్ళను వీలైనంత ఎత్తుకు పైకి లేపండి.

తదుపరి వ్యాసం