తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Blue Jeans : జీన్స్ ప్యాంట్ ఎక్కువగా బ్లూ కలర్‌లో ఎందుకు ఉంటుంది?

Blue Jeans : జీన్స్ ప్యాంట్ ఎక్కువగా బ్లూ కలర్‌లో ఎందుకు ఉంటుంది?

Anand Sai HT Telugu

10 March 2024, 9:30 IST

    • Blue Jeans : దాదాపు అందరికీ బ్లూ జీన్స్ కచ్చితంగా ఉంటుంది. ఈ రంగు జీన్స్ లేకుండా మన బట్టలు ఉండవు. అయితే మనం వాడే జీన్స్‌లో ఎక్కువగా బ్లూ కలర్ జీన్స్ ఎందుకు ఉంటాయి?
బ్లూ జీన్స్ ఎందుకు వాడుతారు
బ్లూ జీన్స్ ఎందుకు వాడుతారు (Unsplash)

బ్లూ జీన్స్ ఎందుకు వాడుతారు

జీన్స్‌లో నీలిరంగు ఆధిపత్యం కేవలం యాదృచ్చికం మాత్రమే కాదు. ఇది ఉత్పత్తి, వినియోగదారుల ప్రాధాన్యత కలిగి ఉంది. ఇలా ఎక్కువగా బ్లూ రంగు జీన్స్ ఉండేందుకు చారిత్రక, సాంస్కృతిక, మానసిక కారణాలు కూడా ఉన్నాయి. జీన్స్‌లో బ్లూ కలర్‌ను ఎందుకు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు? దీనిని ఎంచుకోవడం వెనుక ఉన్న కారణాలను చూద్దాం..

ట్రెండింగ్ వార్తలు

Chanakya Niti On Women : ఈ 5 గుణాలున్న స్త్రీని పెళ్లి చేసుకుంటే పురుషుల జీవితం స్వర్గమే

Oats vegetables khichdi: ఓట్స్ వెజిటబుల్స్ కిచిడి... ఇలా చేస్తే బరువు తగ్గడం సులువు, రుచి కూడా అదిరిపోతుంది

Men Skin Care Drinks : మెరిసే చర్మం కావాలంటే రోజూ ఉదయం వీటిలో ఏదో ఒకటి తాగండి

Sunday Motivation: ప్రపంచాన్ని గెలిచిన విజేతల విజయ రహస్యాలు ఇవే, ఫాలో అయిపోండి

నీలిరంగు జీన్స్ చరిత్ర 19వ శతాబ్దానికి చెందినది. ఈ రంగు దాని మన్నిక, దృఢత్వానికి ప్రసిద్ధి చెందింది. మొదట మైనర్లకు పని దుస్తులను తయారు చేయడానికి ఉపయోగించారు. ఇండిగోఫెరా మొక్క నుండి ఈ కలర్ తీసుకునేవారు. దీనిని నీలిమందు మెుక్క అని కూడా అంటారు. ఆ కాలంలో సులభంగా లభించే, మన్నికైన రంగు ఇది. దీంతో దీని వాడకం ఎక్కువైంది.

ఈ రంగు ఇతర రంగుల కంటే మంచి ప్రయోజనాన్ని కలిగి ఉంది. ఎందుకంటే ఇది కఠినమైన డెనిమ్ ఫాబ్రిక్‌కు బాగా అతుక్కుని ఉంటుంది. నీలిమందు మెుక్క నుంచి రంగు తీసి బట్టకు వేసినా పోకుండా ఉండేది. ఎక్కువగా వాషింగ్ చేసిన తర్వాత కూడా రంగు తగ్గిపోయేది కాదు. ఈ కారణాలతో కార్మికులు, మైనర్లలో బ్లూ జీన్స్‌ను ప్రముఖ ఎంపికగా మారింది.

తర్వాత జీన్స్ మైనింగ్ దుస్తుల నుండి ఫ్యాషన్ దుస్తులకు మారాయి. సాంస్కృతిక అంశాలు కూడా ఇందుకు దోహదపడ్డాయి. 20వ శతాబ్దం మధ్యకాలంలో నీలిరంగు జీన్స్ ఎక్కువగా వాడకం మెుదలైంది. యువతలో బ్లూ జీన్స్ చిహ్నంగా మారిందని చెప్పవచ్చు. ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్‌లో నీలి రంగు జీన్స్ వాడకం ఎక్కువగా ఉండేది.

జేమ్స్ డీన్ నటించిన రెబెల్ వితౌట్ ఎ కాజ్ వంటి చలనచిత్రాలు డెనిమ్‌తో ముడిపడి ఉన్నాయి. ఫ్యాషన్ ఐకాన్‌గా బ్లూ కలర్ జీన్స్ వచ్చాయి. నీలిరంగు జీన్స్ యువత స్వేచ్ఛకు ప్రాతినిధ్యం వహిస్తాయనే ఆలోచన పెరిగింది. ఈ మార్పు జీన్స్‌కు ప్రాధాన్యతనిచ్చే రంగుగా నీలం రంగును అయింది.

మనం వేసుకునే బట్టల రంగు కూడా మన మనసును మారుస్తుంది. నీలం రంగు.. ప్రత్యేకమైన మానసిక ప్రభావాన్ని కలిగి ఉంటుంది. నీలం తరచుగా శాంతి, విశ్వాసం, విశ్వసనీయతతో ముడిపడి ఉంటుంది. ఈ రంగు ప్రశాంతత, స్థిరత్వం భావాన్ని కలిగి ఉంటుంది.

నీలిరంగు జీన్స్‌ని ఎంచుకున్నప్పుడు కంఫర్ట్‌గా ఫీలవుతారు. ఇతరుల చూపు మన మీద ఉన్నట్టుగా ఫీలవుతారు. ఇలా చాలా కారణాలతో ప్రజాదరణ వచ్చింది. దీనిపైన ఎలాంటి చొక్కా వేసుకున్న అందంగా కనిపిస్తారు. దీంతో నీలం రంగు జీన్స్ కు ప్రాధాన్యత పెరిగింది.

బ్లూ జీన్స్ ఉత్పత్తి ద్వారా కూడా కొన్ని ప్రయోజనాలను అందిస్తాయి. నీలిమందు రంగు వేసే ప్రక్రియ ఇతర రంగులకంటే సులభంగా ఉంటుంది. జీన్స్‌కు ఈ రంగు అందంగా కనిపిస్తుంది. ఫ్యాషన్ పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా విస్తరించడంతో బ్లూ జీన్స్ ఆధిపత్యం వేగంగా పెరిగింది. కొన్ని కంపెనీలు మెుదట్లో కేవలం బ్లూ జీన్స్ ను మాత్రమే మార్కెట్లోకి తీసుకోచ్చాయి. నీలం రంగు జీన్స్ సంస్కృతి ఎప్పుడో మెుదలైనా.. ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది.

తదుపరి వ్యాసం