Teach For Change Fashion Show: పేద పిల్లల కోసం టీచ్ ఫర్ చేంజ్ ఫ్యాషన్ షో.. అట్రాక్ట్ చేసిన శ్రుతి హాసన్, శ్రీయా సరన్-lakshmi manchu about teach for change fashion show 2024 shruti haasan shriya saran photos ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Teach For Change Fashion Show: పేద పిల్లల కోసం టీచ్ ఫర్ చేంజ్ ఫ్యాషన్ షో.. అట్రాక్ట్ చేసిన శ్రుతి హాసన్, శ్రీయా సరన్

Teach For Change Fashion Show: పేద పిల్లల కోసం టీచ్ ఫర్ చేంజ్ ఫ్యాషన్ షో.. అట్రాక్ట్ చేసిన శ్రుతి హాసన్, శ్రీయా సరన్

Sanjiv Kumar HT Telugu
Feb 12, 2024 02:21 PM IST

Lakshmi Manchu Teach For Change Fashion Show 2024: మంచు లక్ష్మీ ఆధ్వర్యంలో టీచ్ ఫర్ చేంజ్ ఫ్యాషన్ షో అదిరిపోయేలా జరిగింది. ఈ షోకు స్టాపర్స్‌గా బ్యూటిఫుల్ శ్రుతి హాసన్, శ్రీయా సరన్‌తోపాటు హీరో హర్షవర్ధన్ రాణే వ్యవహరించారు. ఈ ఫ్యాషన్ షో పూర్తి వివరాల్లోకి వెళితే..

పేద పిల్లల కోసం టీచ్ ఫర్ చేంజ్ ఫ్యాషన్ షో.. అట్రాక్ట్ చేసిన శ్రుతి హాసన్, శ్రీయా సరన్
పేద పిల్లల కోసం టీచ్ ఫర్ చేంజ్ ఫ్యాషన్ షో.. అట్రాక్ట్ చేసిన శ్రుతి హాసన్, శ్రీయా సరన్

Teach For Change Fashion Show 2024 Celebrities: ప్ర‌ముఖ సినీ న‌టి లక్ష్మీ మంచు ఆధ్వ‌ర్యంలో టీచ్ ఫర్ చేంజ్ ఫ్యాషన్ షో వావ్ అనేలా జరిగింది. పేద విద్యార్థుల చ‌దువుల‌కు నిధుల స‌మీక‌ర‌ణ కోసం ప్ర‌తి ఏటా నిర్వ‌హించే ఈ టీచ్ ఫ‌ర్ ఛేంజ్ ఫ్యాష‌న్ షో తాజాగా మరోసారి ఆకట్టుకుంది. టీచ్ ఫర్ చేంజ్ పేరుతో ఫ్యాషన్ షో నిర్వహించి దాని ద్వారా వచ్చే వార్షిక నిధులను పేద పిల్లల చదువులకు ఖర్చు చేస్తుంటారు.

అయితే ఈ సారి ఈ షో స్టాప‌ర్‌లుగా శ్రుతి హాసన్, శ్రీయ సరన్, హర్షవర్ధన్ రాణేతోపాటు ప్ర‌ముఖ క్రీడాకారులు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ వంటి ప్రముఖులు కూడా టీచ్ ఫర్ చేంజ్ కోసం ర్యాంప్ వాక్ చేశారు. పేద విద్యార్థులకు నాణ్య‌మైన విద్య‌ను అందించేందుకు టీచ్‌ ఫర్ చేంజ్ వార్షిక నిధుల సమీకరణ కోసం ఫిబ్ర‌వ‌రి 11న 9వ ఎడిషన్‌ను లక్ష్మీ మంచు ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించారు. స్టార్-స్టడెడ్ సెలబ్రిటీ ఫ్యాషన్ షోతో ఈ సారి న‌గ‌ర వాసులను కళ్లు చెదురే షో గా నిలిచింది.

ఈ ఈవెంట్‌లో మహిళల దుస్తుల కోసం ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్స్ అమిత్ జీటీ, పురుషుల దుస్తుల కోసం శశాంక్ చెల్మిల్లా రూపొందించిన డిజైన్‌లు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణగా నిలిచాయి. ఈ కార్యక్రమానికి సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్ ఆభరణాలను స్పాన్సర్ చేసింది. టీచ్ ఫర్ చేంజ్ వార్షిక నిధుల కోసం ప్ర‌ముఖులు, సినీ రంగ న‌టీనటుల భాగ‌స్వామ్యంతో ముందుకు వెళ్తుంది. ఇందులో న‌గ‌రానికి చెందిన వివిధ రంగాల ప్ర‌ముఖులు హాజ‌రై త‌మ‌వంతు సాయాన్ని అందిస్తూ నాణ్య‌మైన‌, మెరుగైన విద్య‌కు సాయంగా నిలుస్తున్నారు.

ఈ కార్య‌క్ర‌మం ద్వారా వ‌చ్చే ఆదాయం సంస్థ అభివృద్ధి, కార్యక్రమాలకు కోసం వినియోగిచబడుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న స‌మ‌స్య‌ల‌కు శాశ్వ‌త ప‌రిష్కారాన్నిచూపేందుకు ఈ సంస్థ ముందుకెళ్తుంది.

ఈ షోలో సీరత్ కపూర్, ఫరియా అబ్దుల్లా, అవంతిక మిశ్రా, లేఖా ప్రజాపతి, అలేక్య హారిక, రాశి సింగ్, అక్షర గౌడ, అశోక్ గల్లా, ప్రదీప్ మాచిరాజు, విరాజ్ అశ్విన్, శ్రుతి హాసన్, శ్రీయా సరన్, హర్షవర్ధన్ రాణే, సురభి, యాంకర్ వర్షిణి సౌందరరాజన్ వంటి ప్రముఖులు ఈ వేడుక‌లో పాల్గొన్నారు.

టీచ్ ఫర్ చేంజ్ కార్యక్రమానికి సుధీర్ బాబు, అదిత్, శివ కంద్కూరి, బ్యాడ్మింటన్ క్రీడాకారులు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్, నోవాటేల్ జనరల్ మేనేజర్ రాబిన్ చేరియన్ తోపాటు తెలంగాణ రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

"ది టీచ్ ఫర్ చేంజ్ ఫ్యాషన్ షో కేవలం స్టైల్, గ్లామర్ మాత్రమే కాదు. అవసరమైన పిల్లల జీవితాలలో అర్ధవంతమైన మార్పును తీసుకురావడానికి చేస్తున్న గొప్ప ప్ర‌య‌త్నం. ఈ ప్ర‌య‌త్నంలో ఎంతో మంది పెద్ద మ‌న‌సుతో ముందుకు వ‌చ్చి త‌మ వంతు సాయాన్ని అందిస్తున్నారు. నిధులను సేకరించి వాటిని విద్యార్థులకు అందించి వారి భ‌విష్య‌త్తులో భాగం అవ్వాలనే ఆలోచ‌న‌తో ముందుకెళ్తున్నాం" అని లక్ష్మీ మంచు తెలిపారు.

"టీచ్ ఫర్ చేంజ్స్ వార్షిక ఫ్యాషన్ షో నిధుల సమీకరణలో భాగమ‌వ్వ‌డాన్ని గౌర‌వంగా భావిస్తున్నాను. విద్య అనేది ప్రాథమిక హక్కు. టీచ్ ఫర్ చేంజ్ వంటి కార్యక్రమాలు ఇలాంటి మార్పుకు చాలా అవసరం. ప్రతి విద్యార్థ‌ికి నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తుంది. మంచు లక్ష్మీ నిజంగా అసాధారణమైన వ్య‌క్తిత్వం ఉన్న స‌హృద‌యిని. ఆమె అంకితభావానికి నా మద్దతును అందించ‌డానికి సిద్దంగా ఉన్న‌ాను" అని శ్రీయ సరన్ పేర్కొన్నారు.

"కొన్ని సంవత్సరాలుగా మంచు లక్ష్మీ వేలాది మంది విద్యార్థుల భ‌విష్యత్తును తీర్చిదిద్దేందుకు టీచ్ ఫర్ చేంజ్ చొరవలో భాగం కావడం అద్భుతం. ఇలాంటి మంచి కార్య‌క్ర‌మంలో నేను భాగ‌మ‌వ్వ‌డం, వారి కోసం ఫ్యాష‌న్ షోలో పాల్గొన‌డం గొప్ప అనుభూతి" అని హీరో, నటుడు హర్షవర్దన్ రాణే చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే ఆర్టీ (ARETE) హాస్పిటల్స్, త్రిపుర కన్‌స్ట్రక్షన్స్ ఈ సంవత్సరం టీచ్ ఫర్ చేంజ్ వార్షిక నిధుల సేకరణ ఫ్యాషన్ షోకు మద్దతునిస్తున్నాయి.

IPL_Entry_Point