తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Eating Garlic : వెల్లుల్లి తినడంతోనూ సమస్య.. ఎవరు మానుకోవాలి?

Eating Garlic : వెల్లుల్లి తినడంతోనూ సమస్య.. ఎవరు మానుకోవాలి?

Anand Sai HT Telugu

04 February 2023, 14:41 IST

    • Avoid Eating Garlic : వెల్లుల్లితో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వంటకాల్లో ముఖ్యమైన పదార్థం ఇది. వెల్లులి అనేక అనారోగ్య సమస్యలకు ఉపయోగపడుతుంది. అయితే వెల్లుల్లికి కొంతమంది దూరంగా ఉండటం కూడా బెటర్ అంటున్నారు వైద్యులు.
వెల్లుల్లి
వెల్లుల్లి (unsplash)

వెల్లుల్లి

భారతీయ వంటలలో సాధారణ పదార్థం వెల్లుల్లి(Garlic). జలుబు, క్యాన్సర్ చికిత్సతో సహా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. వెల్లుల్లి మీ రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడం, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్(cholesterol) స్థాయిలను తగ్గిస్తుంది. యాంటీబయాటిక్(antibiotic) లక్షణాలను కలిగి ఉంటుంది. ఇంకా వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అయినప్పటికీ కొంతమంది వ్యక్తులు వెల్లుల్లికి దూరంగా ఉండాలి.

ట్రెండింగ్ వార్తలు

Quitting Job: మీరు చేస్తున్న ఉద్యోగాన్ని విడిచి పెట్టేముందు ఈ విషయాలను గురించి ఆలోచించండి

Weight Loss Tips : బరువు తగ్గడానికి అల్పాహారం, రాత్రి భోజనం ఎంత ముఖ్యమో తెలుసుకోండి..

Chanakya Niti On Women : ఈ 5 గుణాలున్న స్త్రీని పెళ్లి చేసుకుంటే పురుషుల జీవితం స్వర్గమే

Oats vegetables khichdi: ఓట్స్ వెజిటబుల్స్ కిచిడి... ఇలా చేస్తే బరువు తగ్గడం సులువు, రుచి కూడా అదిరిపోతుంది

మీకు ఎసిడిటీ ఉంటే వెల్లుల్లి తినకండి

వెల్లుల్లికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ, వైద్యులు సాధారణంగా మీకు యాసిడ్ రిఫ్లక్స్ ఉన్నట్లయితే వెల్లుల్లిని తినకూడదని సలహా ఇస్తారు. అలాంటి వారికి వెల్లుల్లి తింటే గుండెల్లో మంట వస్తుంది. ఎసిడిటీ(acidity) సమస్యలతో బాధపడేవారు ఖాళీ కడుపుతో దీనిని తినకూడదు

మీ పొట్టను చూసుకోండి

కొంతమందికి పొట్టు చాలా సున్నితమైనదిగా ఉంటుంది. ఏం తిన్నా పడదు. జీర్ణవ్యవస్థ కాస్త అటు ఇటుగా ఉన్నవారు కూడా వెల్లుల్లిని తినకూడదు. ఎందుకంటే వెల్లుల్లిలో ఫ్రక్టాన్స్ అనే ఆమ్లం ఉంటుంది. ఇది అన్నవాహిక లైనింగ్‌ను చికాకుపెడుతుంది. మంటను కలిగిస్తుంది.

మీకు స్మెల్ ప్రాబ్లమ్ ఉందా?

వెల్లుల్లి(Garlic) కాస్త దుర్వాసనకు కారణమవుతుంది. అందువల్ల మీరు ఇప్పటికే నోటి దుర్వాసన లేదా శరీర దుర్వాసనను అనుభవిస్తున్నట్లయితే, వెల్లుల్లిని తీసుకోవడం మానేయాలి. వెల్లుల్లిని తీసుకోవడం వల్ల మీ శరీరం, నోటి దుర్వాసన అధ్వానంగా మారుతుంది

మందులు వాడుతూ వెల్లుల్లి తినకూడదు

ఆహారంలో భాగంగా వెల్లుల్లిని తక్కువ మొత్తంలో తిన్నంత మాత్రాన ఏం కాదు. కానీ కొన్ని రకాల మెడిసిన్స్(Medicine) తీసుకుంటే కాస్త వెల్లుల్లి తగ్గించడం మంచిది. వెల్లుల్లిని పెద్ద పరిమాణంలో తీసుకున్నప్పుడు, అది రక్తం గడ్డకట్టడాన్ని నిరోధించే మందులతో సమస్య వస్తుంది. రక్తస్రావం ప్రమాదాన్ని పెంచుతుంది

శస్త్రచికిత్స చేయించుకునే ముందు

మీరు శస్త్రచికిత్స(surgery) చేసుకునేందుకు షెడ్యూల్ చేసుకున్నట్టయితే.. వెల్లుల్లిని నివారించండి. వెల్లుల్లి రక్తస్రావం పొడిగించవచ్చు. రక్తపోటును మార్చవచ్చు. వెల్లుల్లి రక్తంలో చక్కెర స్థాయిలను కూడా తగ్గిస్తుంది. శస్త్రచికిత్సకు కనీసం రెండు వారాల ముందు మీరు వెల్లుల్లిని తీసుకోవడం మానేయాలని సిఫార్సు చేస్తున్నారు వైద్యులు. అంతేకాదు ఫుడ్ అలెర్జీ కొంతమందికి ఉంటుంది. అలాంటి వారు కూడా.. వెల్లుల్లిని కాస్త తగ్గించాలట.

తదుపరి వ్యాసం