తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Indoor Plants | ఎయిర్ ప్యూరిఫయర్ మొక్కలు ఇంట్లో పెంచుకోవాలనుందా?

Indoor Plants | ఎయిర్ ప్యూరిఫయర్ మొక్కలు ఇంట్లో పెంచుకోవాలనుందా?

22 February 2022, 7:26 IST

    • Indoor plants | ఎయిర్ ప్యూరిఫయర్ కొనుగోలు చేయడం ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. దీనికి ప్రత్యామ్నాయంగా స్వచ్ఛమైన గాలిని ఇచ్చే, ఇంట్లో ఆక్సిజన్ పెంచే మొక్కలు పెంచుకోవడం కంటికి ఇంపుగా కూడా ఉంటుంది. ఇంట్లో పాజిటివిటీని పెంచుతుంది. 
ఇండోర్ ప్లాంట్స్
ఇండోర్ ప్లాంట్స్ (unsplash)

ఇండోర్ ప్లాంట్స్

ఎయిర్ ప్యూరిఫయర్‌కు బదులు మొక్కలు పెంచుకోవడానికి ఇంట్లో తగిన స్థలం ఉండాలి. చాలా వరకు ఈ మొక్కలకు సూర్య రశ్మి అవసరం ఉండదు. అయితే. వీటన్నింటికంటే ముందు ఏ మొక్కలు ఇంట్లో పెంచుకునేందుకు అనుకూలమో, ఏవి బాగా ఎయిర్ ప్యూరిఫయర్‌గా పనిచేస్తాయో కూడా తెలుసుకోవాలి. ముందుగా ఒకటి రెండు మొక్కలతో మొదలు పెడితే మీకు తగిన అనుభవం వచ్చాక ఇల్లంతా విస్తరించుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

కలబంద మొక్క

అనేక ఔషధ గుణాలు కలిగిన కలబంద మొక్క ఇంట్లో ఎయిర్ ప్యూరిఫయర్‌గా కూడా పనిచేస్తుంది. దీనికి నీరు కూడా పెద్దగా అవసరం ఉండదు. ఒక చిన్న కుండీలో తగిన తేమ కలిగిన మట్టిలో కూడా పెరుగుతుంది. సూర్యరశ్మి కూడా తప్పనిసరి కాదు. కాలిన గాయాలకు, చర్మం కోసుకుపోయినప్పుడు దీనిని ఔషధంగా ఉపయోగించవచ్చు. అన్ని నర్సరీల్లో దొరుకుతాయి.

బెగోనియా (begonia)

ఇది కూడా బాగా ప్రాచుర్యం పొందిన ఇండోర్ ప్లాంట్. రోజూ నీరు అందించాల్సిన అవసరం ఉండదు. సూర్యరశ్మి కూడా అవసరం లేదు. పైగా మార్కెట్లో విస్తృతంగా అందుబాటులో ఉంటుంది.

అబ్యుటిలాన్ (abutilon)

అబ్యుటిలాన్ మొక్కకు కాస్త సూర్మరశ్మి అవసరం. తేమతో కూడిన మట్టిలో, వెలుతురు బాగా ప్రసరించే చోట పెంచాలి. ఎరుపు, తెలుపు, పసుపు రంగుల ఆకులతో అందంగా కనిపిస్తుంది.

కలేడియం (caladium)

కలేడియం పెంచడం చాలా సులభం. చిక్కటి రంగులతో కూడిన ఆకులతో ఆకట్టుకుంటుంది. ఈ మొక్కలను కంటైనర్లలో పెంచాలి. కలేడియం మొక్కలకు క్రమం తప్పకుండా నీళ్లు పోయాలి.

రబ్బర్ ప్లాంట్ (rubber plant)

రబ్బర్ ప్లాంట్ అందమైన పెయింటింగ్‌లా ఆకర్షణీయంగా ఉంటుంది. ఎత్తుగా కూడా పెరుగుతుంది. మంచి డెకొరేషన్‌లా కనిపిస్తుంది. తగిన కాంతి, నీరు అవసరం. మట్టిని తేమగా ఉంచితే సరిపోతుంది.

అరెకా పామ్ ప్లాంట్ (areca palm)

అరెకా పామ్ ప్లాంటు పెంచేందుకు తగిన సూర్యకాంతి అవసరం. అలా అని బయటే పెంచాల్సిన అసవరం లేదు. తగిన కాంతి ప్రసరించేలా చూడాలి. మొక్కకు తగినంత నీళ్లు అందించాలి.

స్నేక్ ప్లాంట్ (snake plant)

ఆకులు రిబ్బన్ల మాదిరిగా పైకి లేస్తుంటాయి. ఎయిర్ ప్యూరిఫయర్‌గా ప్రాచుర్యం పొందింది. పొడి వాతావరణంలో పెరుగుతాయి.

స్పైడర్ ప్లాంట్

ఈజీగా పెంచుకోగల మరో మొక్క స్పైడర్ ప్లాంట్. నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. పరోక్షంగా వచ్చే సహజ కాంతిలో పెరుగుతుంది.

పీస్ లిల్లీస్

లిల్లీ కుటుంబానికి చెందిన పీస్ లిల్లీస్ ఇండోర్ ప్లాంట్. వీటికి సూర్య రశ్మి పెద్దగా అవసరం లేదు. వారానికోసారి తప్ప పెద్దగా నీళ్లు పోయాల్సిన అవసరం ఉండదు.

కాక్టి ప్లాంట్

కాక్టి ప్లాంట్‌కు తగిన కాంతి అవసరం. అయితే నీళ్లు పెద్దగా అవసరం లేదు. చక్కటి రూపంతో ఇంటికి అందాన్నిస్తూ పాజిటివిటీ పెంచుతాయి.

ఎయిర్ ప్యూరిఫయర్‌కు బదులు మొక్కలు పెంచుకోవడానికి ఇంట్లో తగిన స్థలం ఉండాలి. చాలా వరకు ఈ మొక్కలకు సూర్య రశ్మి అవసరం ఉండదు. అయితే. వీటన్నింటికంటే ముందు ఏ మొక్కలు ఇంట్లో పెంచుకునేందుకు అనుకూలమో, ఏవి బాగా ఎయిర్ ప్యూరిఫయర్‌గా పనిచేస్తాయో కూడా తెలుసుకోవాలి. ముందుగా ఒకటి రెండు మొక్కలతో మొదలు పెడితే మీకు తగిన అనుభవం వచ్చాక ఇల్లంతా విస్తరించుకోవచ్చు.

కలబంద మొక్క

అనేక ఔషధ గుణాలు కలిగిన కలబంద మొక్క ఇంట్లో ఎయిర్ ప్యూరిఫయర్‌గా కూడా పనిచేస్తుంది. దీనికి నీరు కూడా పెద్దగా అవసరం ఉండదు. ఒక చిన్న కుండీలో తగిన తేమ కలిగిన మట్టిలో కూడా పెరుగుతుంది. సూర్యరశ్మి కూడా తప్పనిసరి కాదు. కాలిన గాయాలకు, చర్మం కోసుకుపోయినప్పుడు దీనిని ఔషధంగా ఉపయోగించవచ్చు. అన్ని నర్సరీల్లో దొరుకుతాయి.

బెగోనియా (begonia)

ఇది కూడా బాగా ప్రాచుర్యం పొందిన ఇండోర్ ప్లాంట్. రోజూ నీరు అందించాల్సిన అవసరం ఉండదు. సూర్యరశ్మి కూడా అవసరం లేదు. పైగా మార్కెట్లో విస్తృతంగా అందుబాటులో ఉంటుంది.

అబ్యుటిలాన్ (abutilon)

అబ్యుటిలాన్ మొక్కకు కాస్త సూర్మరశ్మి అవసరం. తేమతో కూడిన మట్టిలో, వెలుతురు బాగా ప్రసరించే చోట పెంచాలి. ఎరుపు, తెలుపు, పసుపు రంగుల ఆకులతో అందంగా కనిపిస్తుంది.

కలేడియం (caladium)

కలేడియం పెంచడం చాలా సులభం. చిక్కటి రంగులతో కూడిన ఆకులతో ఆకట్టుకుంటుంది. ఈ మొక్కలను కంటైనర్లలో పెంచాలి. కలేడియం మొక్కలకు క్రమం తప్పకుండా నీళ్లు పోయాలి.

రబ్బర్ ప్లాంట్ (rubber plant)

రబ్బర్ ప్లాంట్ అందమైన పెయింటింగ్‌లా ఆకర్షణీయంగా ఉంటుంది. ఎత్తుగా కూడా పెరుగుతుంది. మంచి డెకొరేషన్‌లా కనిపిస్తుంది. తగిన కాంతి, నీరు అవసరం. మట్టిని తేమగా ఉంచితే సరిపోతుంది.

అరెకా పామ్ ప్లాంట్ (areca palm)

అరెకా పామ్ ప్లాంటు పెంచేందుకు తగిన సూర్యకాంతి అవసరం. అలా అని బయటే పెంచాల్సిన అసవరం లేదు. తగిన కాంతి ప్రసరించేలా చూడాలి. మొక్కకు తగినంత నీళ్లు అందించాలి.

స్నేక్ ప్లాంట్ (snake plant)

ఆకులు రిబ్బన్ల మాదిరిగా పైకి లేస్తుంటాయి. ఎయిర్ ప్యూరిఫయర్‌గా ప్రాచుర్యం పొందింది. పొడి వాతావరణంలో పెరుగుతాయి.

స్పైడర్ ప్లాంట్

ఈజీగా పెంచుకోగల మరో మొక్క స్పైడర్ ప్లాంట్. నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. పరోక్షంగా వచ్చే సహజ కాంతిలో పెరుగుతుంది.

పీస్ లిల్లీస్

లిల్లీ కుటుంబానికి చెందిన పీస్ లిల్లీస్ ఇండోర్ ప్లాంట్. వీటికి సూర్య రశ్మి పెద్దగా అవసరం లేదు. వారానికోసారి తప్ప పెద్దగా నీళ్లు పోయాల్సిన అవసరం ఉండదు.

కాక్టి ప్లాంట్

కాక్టి ప్లాంట్‌కు తగిన కాంతి అవసరం. అయితే నీళ్లు పెద్దగా అవసరం లేదు. చక్కటి రూపంతో ఇంటికి అందాన్నిస్తూ పాజిటివిటీ పెంచుతాయి.

|#+|

తదుపరి వ్యాసం