తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tuesday Motivation : గాయం శరీరానికైనా.. మనసుకైనా.. తగ్గించే మందు మాత్రం ఒక్కటే..

Tuesday Motivation : గాయం శరీరానికైనా.. మనసుకైనా.. తగ్గించే మందు మాత్రం ఒక్కటే..

03 January 2023, 6:30 IST

    • Tuesday Motivation : దెబ్బలు తగలడం అందరికీ సహజమే. కానీ అది త్వరగా తగ్గాలి.. గాయం మానిపోవాలి అనుకుంటే మాత్రం దానిని ఊరికే టచ్ చేయకుండా కంట్రోల్​లో ఉండాలి. అది మిమ్మల్ని ఎంతగా ఇబ్బంది పెట్టినా.. టచ్ చేయకూడదు. అలాగే మిమ్మల్ని బాధపెట్టే విషయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

కోట్ ఆఫ్ ద డే

Tuesday Motivation : మనకి తగిలిన గాయాన్ని నయం చేయాలంటే.. మెడిసిన్ ఇస్తే సరిపోదు. దానికి వీలైనంత దూరంగా మన చేతులను ఉంచాలి. అప్పుడే అది త్వరగా హీల్ అవుతుంది. గాయం దురద పెడుతుందనో.. లేదా ఇంకేదైనా రీజన్ వల్లనో ఊరికే దానిని టచ్ చేస్తూ ఉంటే గాయం పెద్దది అవుతుందే తప్పా.. తగ్గదు. గాయాలనేవి మన ఓపికని టెస్ట్ చేస్తాయి. మీరు ఎంత మరిచి పోయినా.. దురదతో మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఎంతగా అంటే పర్లేదు ఓ సారి దీనిని టచ్ చేస్తే ఏమి కాదు అని దానిని తరచూ టచ్ చేసేలా చేస్తాయి. అలా దురద నుంచి ఉపశమనం పొందుతున్నాము అనుకుంటాము కానీ.. గాయాన్ని పెద్దది చేస్తున్నామని గుర్తించము. అది పెద్దదై.. పరిస్థితి మన చేయి దాటిపోయాక ఈ విషయాన్ని గ్రహిస్తాము.

ట్రెండింగ్ వార్తలు

Chanakya Niti Telugu : భార్యాభర్తల మధ్య వయసు తేడా ఎక్కువగా ఉంటే ఈ సమస్యలు వస్తాయి

Fruits for Dinner: డిన్నర్లో కేవలం పండ్లనే తినడం మంచి పద్ధతేనా? ఇది ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?

Oats Egg Omelette : ఓట్స్ ఎగ్ ఆమ్లెట్.. మీ అల్పాహారాన్ని ఆరోగ్యకరంగా మార్చగలదు

Tuesday Motivation : పెళ్లి జీవితంలో చాలా ముఖ్యమైనది.. కానీ ముందుగా ఈ విషయాలు చెక్ చేసుకోండి

ఒంటికి తగిలిన గాయమే ఇంత ఇబ్బంది పెడుతుంటే.. మనసుకి తగిలిన గాయం ఇంకెంత ఇబ్బంది పెడుతుంది. శరీరానికి తగిలినది అయినా.. మనసుకి తగిలిన గాయమైనా.. వాటికి ఎంత దూరంగా ఉంటే.. మీరు అంత త్వరగా ఉపశమనం పొందుతారు. మీరు వాటిని ఊరికే గుర్తు చేసుకుంటూ.. టచ్ చేస్తూ ఉంటే.. అవి ఎప్పటికీ మానవు సరికదా.. అవి పెద్దవి అయి.. మిమ్మల్ని మరింత ఇబ్బంది పెడతాయి. మరి ఇవి ఇబ్బంది పెడుతున్నపుడు దూరం పెట్టడం ఎలా అంటే.. మీరు అవి ఉన్న సంగతే మరచిపోవాలి. ఎలాంటి పరిస్థితి అయినా పదే పదే గుర్తొస్తుంది అంటే.. మీరు దానిని మరిపించే పనులు చేయాలి. లేదా మీ పనుల్లో మీరు బిజీగా ఉండాలి. మీకు గాయం తగిలింది అని ఎప్పుడూ గుర్తొస్తుందో.. అప్పుడే మీరు దాని వల్ల కలిగే బాధను అనుభవిస్తారు. కానీ మీరు గాయం ఉన్న సంగతి మరచిపోయినప్పుడు మీకు ఏమాత్రం దీనిగురించి, దీనివల్ల కలిగే బాధ ఉండదు.

ఒకటే గుర్తుపెట్టుకోండి. మీకు మాత్రమే గాయాలు తగలవు.. మీరు మాత్రమే హర్ట్ కారు. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఏదొక సమయంలో వీటిని అనుభవిస్తారు. కష్టాలు ఎప్పుడూ మీకు మాత్రమే ఉన్నాయి అనుకుంటే అది కచ్చితంగా పొరపాటే. పైగా ఈ ఆలోచన మిమ్మల్ని మరింత కృంగదీస్తుంది. ఎవరికుండే ఇబ్బందులు వారికి ఉంటాయి. వాటిని కొందరు ఒకలా చూపిస్తారు. మరికొందరు మరోలా వాటిని ఎదుర్కొంటారు. ఎదుటివాళ్లు గాయం చూపించట్లేదు అంటే దాని అర్థం వారికి నొప్పి లేదని కాదు. ఆ నొప్పిని వారు చూపించకుండా దాచేసి.. ఆ బాధను అధిగమించడానికి ప్రయత్నిస్తున్నారని అర్థం. అలా మనం ట్రై చేసినప్పుడే గాయాలు మెల్లిగా మనకి దూరం అవుతాయి.

గతంలోని బాధలు మిమ్మల్ని వెంటాడుతుంటే.. మీరు వాటినుంచి పారిపోనవసరం లేదు. వాటిని మరచిపోతే చాలు. మరచిపోవడం అంత సులువేమి కాదు కానీ.. మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకున్నప్పుడు కచ్చితంగా మీ బాధ కాస్త దూరం అవుతుంది. చేసేది ఏ పని అయినా.. ఫోకస్ అంతా దాని మీదనే ఉండేలా చూసుకోండి. ఇది మిమ్మల్ని గాయం, బాధ, నొప్పి నుంచి దూరం చేసి.. మీ రాబోయే రోజుల్లో మీరు మరింత శక్తివంతంగా మారేలా చేస్తుంది. మీ గతాన్ని ఉన్న చోటే వదిలేసినప్పుడు మాత్రమే.. మీ భవిష్యత్తు ప్రకాశవంతంగా మారుతుందని గుర్తించుకోండి.

తదుపరి వ్యాసం