తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  ఉత్తమ కెరీర్ ఎంపికలు.. భవిష్యత్తులో డిమాండ్ ఉన్న కోర్సులు ఇవే!

ఉత్తమ కెరీర్ ఎంపికలు.. భవిష్యత్తులో డిమాండ్ ఉన్న కోర్సులు ఇవే!

28 February 2022, 18:12 IST

    • విద్యార్థులు ఎంచుకునే కెరీర్ ఆప్షన్ భవిష్యత్తులో జరిగే పరిణామాలను తట్టుకుని నిలబడేలా ఉండాలి. అప్పుడే వృత్తిపరమైర జీవితం ఎలాంటి ఒడుదొడుకులు లేకుండా సాగుతుంది. భవిష్యత్తు బాగుండాలంటే ఎలాంటి కోర్సులు ఎంచుకోవాలి? ఏవి విద్యార్థి జీవితాన్ని అత్యుత్తమంగా నిలుపుతాయో ఇప్పుడు చూద్దాం
career-option
career-option

career-option

చక్కటి కెరీర్ అప్షన్ ఎంపిక విద్యార్థి భవిష్యత్తును నిర్దేశిస్తుంది. కెరీర్‌లో భద్రత,స్థిరత్వంతో పాటు భవిష్యత్తులో డిమాండ్‌ ఉండే కోర్సులను ఎంచుకోవాలి. నేటి విద్యార్థుల్లో చాలావరకు ఎలాంటి కోర్సులను ఎంచుకోవాలో బాగా తెలుసు.. అయినప్పటికీ కొంతమంది సరైన ఆప్షన్‌ను ఎంచుకోలేకపోతున్నారు. విద్యార్థులు తమ కెరీర్‌లో ఏం ఆశిస్తున్నరనే అంశంపై స్పష్టత లేకుండా ఉన్నారు. కెరీర్ ఆప్షన్ ఎంచుకునేటప్పుడు తొందపాటుతో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. 2020లో  చాలా మార్పులను చూశాం. ఈ సంవత్సరం మనకు చాలా పాఠాలను నేర్పింది. కాబట్టి భవిష్యత్తు ఉహించలేం. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. 

ట్రెండింగ్ వార్తలు

Monday Motivation: ఎవరి గొప్ప వారిదే, జీవితంలో ఎదురయ్యే ఎవరినీ చులకనగా చూడకండి

Acid Reflux At Night : రాత్రి గుండెల్లో మంట రావడానికి కారణాలు.. ఈ అసౌకర్యాన్ని ఎలా తొలగించాలి?

Relationship Tips : పెళ్లికి ముందే ఈ 5 విషయాలు చర్చించండి.. లేదంటే తర్వాత సమస్యలు

Cashew Tomato Gravy : టొమాటో జీడిపప్పు గ్రేవీ తయారు చేయండి.. ఎంజాయ్ చేస్తూ తింటారు

విద్యార్థులు ఎంచుకునే కెరీర్ ఆప్షన్ భవిష్యత్ పరిణామాలను తట్టుకుని నిలబడేలా ఉండాలి అప్పుడే వృత్తిపరమైర జీవితం ఎలాంటి ఒడుదొడుకులు లేకుండా సాగుతుంది. భవిష్యత్తు బాగుండాలంటే ఎలాంటి కోర్సులు ఎంచుకోవాలి? ఎలాంటివి ఎంచుకుంటే విద్యార్ధి జీవితం బాగుంటుందో ఇప్పుడు చూద్దాం. 

భవిష్యత్తులో ఉత్తమ కెరీర్ ఎంపికలు

1. డేటా సైంటిస్ట్

డేటా సైన్స్ ప్రస్తుతం అత్యంత ప్రాధాన్యత కలిగిన రంగాలలో ఒకటి. డిజిటల్ ప్రపంచంలో డేటా కంపెనీలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. సంస్థలకు డేటాను సమర్థవంతంగా ఉపయోగించడంలో సహాయపడేందుకు డేటా సైంటిస్టుల నైపుణ్యం అవసరం. ఈ రంగంలోని ఉద్యోగులకు గిరాకీ ఎక్కువగానే ఉంది. డేటా సైన్స్ రంగంలో ఉద్యోగాలు ప్రతి సంవత్సరం 37శాతం పెరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు. గత కొన్నేళ్లుగా డేటా సైంటిస్టుల డిమాండ్ ఎలా పెరిగిందో వాటిలోని ఉద్యోగ ప్రకటనలను చూస్తేనే తెలుస్తోంది. 

వచ్చే దశాబ్దానికి ఇది అత్యుత్తమ కెరీర్ ఆప్షన్‌లలో ఒకటిగా నిలిచిపోతుందనడం ఎలాంటి అతిశయోక్తి లేదు. డేటా సైన్స్ నిపుణులను నియమించుకోవడంలో భారతదేశం ప్రపంచంలో రెండవ స్థానంలో ఉండగా.. ఈ విషయంలో యునైటెడ్ స్టేట్స్ ముందువరుసలో ఉంది. ఈ విభాగంలో నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడం వల్ల మీరు రాబోయే రోజుల్లో ఉన్నత స్థితిలో ఉండవచ్చు. ఈ-కామర్స్, స్టార్టప్‌లు, పరిశోధనా సంస్థలు, మార్కెటింగ్ ఏజెన్సీల్లో డేటా శాస్త్రవేత్తలకు డిమాండ్ పెరుగుతోంది. 

తమ సంస్థకు సహాయపడే అత్యంత అనుకూలమైన డేటా అనలిటిక్స్ సొల్యూషన్‌లను గుర్తించాల్సిన బాధ్యత వీరిపై ఉంటుంది. సమర్ధవంతంగా విధులను పూర్తి చేయడానికి లోతైన లెర్నింగ్, మెషిన్ లెర్నింగ్ అలాగే సంబంధిత సాంకేతికత అంశాలపై అవగాహాన ఉండాలి. ఈ రంగాన్ని కెరీర్ ఆప్షన్‌గా ఎంచుకునే వారు డేటా సైన్స్ కోర్సులో ప్రవేశం పొంది అవసరమైన నైపుణ్యాలను నేర్చుకోవాలి.

2. డేటా అనలిస్ట్

డేటా సైంటిస్టులు డేటాను విశ్లేషించి, వాటిని ఉపయోగించి పరిష్కారాలను కనుగొంటారు. ఆ డేటాను అందరికీ అర్థమయ్యేలా చేయగలిగే నిపుణులే డేటా అనలిస్ట్. సంక్లిష్ట డేటాను సులభమైన పద్దతిలో విశ్లేషించి సామాన్యుడికి అర్థమయ్యేలా చేయడమే వీరి ముఖ్య బాధ్యత. మీరు గణితంలో ఎక్స్‌పర్ట్స్ అయితే ఇది మీకు అద్భుతమైన కెరీర్ ఆప్షన్. ఇందుకు పైథాన్, SQLతో సహా వివిధ ప్రోగ్రామింగ్ లాంగ్వేజిలో నైపుణ్యం అవసరం. అలాగే డేటా విశ్లేషకుడిగా, సంక్లిష్ట వ్యాపార సమస్యలకు పరిష్కారాలను గుర్తించడానికి మీరు డేటాను ఉపయోగించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సెక్టార్‌లో కెరీర్‌ను కొనసాగించడానికి మీరు బిజినెస్ అనలిటిక్స్‌లో సర్టిఫికేషన్ కలిగి ఉండాలి. ఈ ఫీల్డ్‌ ఎంచుకోవడం ద్వారా భవిష్యత్-ప్రూఫ్ కెరీర్‌ను మీరు పొందగలుగుతారు. ఈ రంగంలో నిపుణుల కొరత ఎక్కువగా ఉంది. దీంతో డిమాండ్ ఎక్కువై డేటా విశ్లేషకులకు ప్రవేశ స్థాయిలోనే కూడా భారీ జీతాలు ,అద్భుతమైన ప్రోత్సాహకాలు లభిస్తున్నాయి.

3. బ్లాక్‌చెయిన్ డెవలపర్

బిట్‌కాయిన్ లాంటి వర్చువల్ కరెన్సీల నిర్వహణలో బ్లాక్‌చెయిన్ ప్రాత చాలా కీలకం. వాటిలో పెట్టుబడి పెట్టిన వినియోగదారులకు గణనీయమైన రాబడిని ఇవ్వడానికి ఈ టెక్నాలజీల సహాయపడుతుంది. క్రిప్టోకరెన్సీ నిర్వహణ బ్లాక్‌చెయిన్‌పై ఆధారపడి ఉంటుంది. బ్లాక్‌చెయిన్ ఆధారిత  సాంకేతికత వివిధ పరిశ్రమలను విప్లవాత్మకంగా మారుస్తుందని నిపుణులు విశ్వసిస్తున్నారు. ఈ రంగంలో వృత్తిని ఎంచుకోవడం ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు. 

ప్రస్తుత పరిస్థితులను చూస్తే బ్లాక్‌చెయిన్ డెవలపర్‌లకు పరిశ్రమలో ఉన్న డిమాండ్‌ ఏంటో అర్థమవుతుంది. Blockchain నైపుణ్యాల అవసరం ఇటీవల 2000 నుంచి 6000 శాతం పెరిగాయి. ఈ రంగంలో డెవలపర్ల జీతాలు సంప్రదాయ కోర్సుల కంటే 50-100% ఎక్కువ ఉన్నాయి. ఫైనాన్స్, ఆరోగ్యం, లాజిస్టిక్స్, రవాణా మొదలైన వివిధ పరిశ్రమలు బ్లాక్‌చెయిన్ డెవలపర్‌ల కోసం ఎదురుచూస్తున్నాయి. అంతేకాకుండా క్రిప్టోగ్రఫీ, ప్రోగ్రామింగ్‌లో విస్తృత నైపుణ్యాలు ఈ రంగంలో అవసరం. పరిశ్రమకు అవసరమైన ఇన్-డిమాండ్ నైపుణ్యాలను కవర్ చేసే బ్లాక్‌చెయిన్ కోర్సును తీసుకోవడం ద్వారా మీరు డెవలపర్‌గా మారవచ్చు .

4. డిజిటల్ మార్కెటర్

కాలం మారుతుంది, ఇప్పుడంతా స్ట్మార్ట్ యుగం. సమాచారం డిజిటలైజేషన్ అయిపోయింది. వ్యాపార సంస్థ తమ ఉత్పత్తిలకు ప్రచారం, అమ్మడం వంటి అనేక వ్యవహారాలు ఆన్‌లైన్ వేదికగానే చక్కబెడుతున్నాయి. దీంతో ఈ విభాగంలో పనిచేసే నిపుణులకు డిమాండ్‌ ఏర్పడుతోంది. ఇంటర్నెట్ క్రియేటివ్ స్కిల్ ఉన్నవారికి డిజిటల్ మార్కెటింగ్ సరైన ఫీల్డ్. భారత్‌లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలలో డిజిటల్ మార్కెటింగ్ ఒకటి. 25-30% వార్షిక రేటుతో ఈ రంగంలో అవకాశాలు పెరుగుతున్నాయి. 2018 నాటికి, భారత్‌లో 500 మిలియన్ల ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు. 

ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్స్ వినియోగం విపరీతంగా పెరగడంతో సమాచారం అంతా ఆన్‌లైన్ వేదికగానే పంచుకుంటున్నారు. దీంతో ఈ-కామర్స్,డిజిటల్ చెల్లింపులు, ఈ-బ్యాకింగ్ వ్యవహారాలు అన్ని ఇంటర్నెట్ ఆధారంగానే జరుగుతున్నాయి. ఫలితంగా డిజిటల్ మార్కెటర్ డిమాండ్ పెరిగిపోయింది. కాబట్టి ఇది నిస్సందేహంగా భవిష్యత్తులో అత్యుత్తమ కెరీర్ ఎంపికలలో ఒకటని చెప్పవచ్చు. ఈ ఫీల్డ్ ఎంచుకునేవారికి పెద్దగా సాంకేతిక పరిజ్ఞానం ఉండాల్సిన అవసరం లేదు. డిజిటల్ మార్కెటింగ్ అనేది సాంకేతిక నైపుణ్యం, సృజనాత్మకతల కలయిక. ఈ రంగంలో రాణించలంటే SEO, కంటెంట్ మార్కెటింగ్, కంటెంట్ ఆప్టిమైజేషన్, SEM మొదలైన నైపుణ్యాల ఉండాలి.

5. క్లౌడ్ కంప్యూటింగ్ ప్రొఫెషనల్

కంపెనీలకు నిర్వహణ ఖర్చులను తగ్గించడంతో పాటు అవి మరింత సమర్థవంతంగా మారడానికి క్లౌడ్ టెక్నాలజీ అవసరం. ఈ విధానం ద్వారా ఉత్పాదకత సులభతరమవుతుంది. ఈ టెక్నాలజీ ద్వారా ఇంతటి ప్రయోజనం ఉండడంతో కంపెనీలు ఈ సాంకేతికతను అమలు చేయడం ప్రారంభించాయి. ఫలితంగా క్లౌడ్ కంప్యూటింగ్ నిపుణుల కోసం డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. రానున్న రోజుల్లో ఇది ఉత్తమ కెరీర్ ఎంపికలలో ఒకటిగా మారనుంది. IDC సర్వే ప్రకారం, 64% భారతీయ సంస్థలు క్లౌడ్ కంప్యూటింగ్ డిమాండ్‌కు పెరుగుతుందని భావిస్తున్నాయని పేర్కొంది. అంతేకాకుండా కరోనా మహమ్మారి  క్లౌడ్ సాఫ్ట్‌వేర్‌కు డిమాండ్‌ను పెంచిందని సర్వే పేర్కొంది. ఇంజినీరింగ్ డిగ్రీలో క్లౌడ్ కంప్యూటింగ్‌లో ప్రత్యేక దృష్టి పెట్టడం ద్వారా మీరు ఈ రంగంలో ప్రొఫెషనల్‌గా మారవచ్చు. క్లౌడ్ కంప్యూటింగ్‌లో ప్రముఖ సంస్థలు పీజీ కోర్సును అందిస్తున్నాయి.

 

టాపిక్

తదుపరి వ్యాసం