తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Avoid Food Cravings: తిండి ఎక్కువగా తినాలనిపిస్తోందా? అయితే ఇలా చేయండి

Avoid Food Cravings: తిండి ఎక్కువగా తినాలనిపిస్తోందా? అయితే ఇలా చేయండి

HT Telugu Desk HT Telugu

11 September 2023, 19:10 IST

  • Avoid Food Cravings: తరచూ ఏదైనా తినాలనే కోరిక అదుపులో ఉండట్లేదా. దానివల్ల బరువు పెరిగి ఇతర సమస్యలు రావచ్చు. దాన్నెలా నియంత్రణలో ఉంచుకోవాలో తెలుసుకోండి.

తినాలనే కోరిక తగ్గించే మార్గాలు
తినాలనే కోరిక తగ్గించే మార్గాలు (pexels)

తినాలనే కోరిక తగ్గించే మార్గాలు

కొందరికి అప్పుడే భోజనం చేసినా మళ్లీ ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది. ఆకలి వేయకపోయినా తిని చాలా సేపు అయితే చాలు.. ఏదో ఒకటి తినాలన్న కోరిక కలుగుతూ ఉంటుంది. ఇలాంటి ఫుడ్‌ క్రేవింగ్స్‌ వల్ల శరీరం బరువు పెరుగుతుంది. అదనంగా కొవ్వులు, కార్బోహైడ్రేట్‌లు శరీరంలోకి వచ్చి చేరతాయి. లేనిపోని ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. మరి మీకూ ఇలాంటి ఫుడ్‌ క్రేవింగ్స్‌ ఉన్నాయా? వీటిని తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలున్నాయి. అవేంటో తెలుసుకుని పాటించేయండి.

ట్రెండింగ్ వార్తలు

Meaning of Moles: మీ ముఖంలో వివిధ చోట్ల ఉండే పుట్టుమచ్చలు మీ వ్యక్తిత్వాన్ని చెబుతాయి

Soya Dosa: టేస్టీ సోయా దోశ రెసిపీ, డయాబెటిక్ పేషెంట్లకు బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్

Monday Motivation: ఎవరి గొప్ప వారిదే, జీవితంలో ఎదురయ్యే ఎవరినీ చులకనగా చూడకండి

Acid Reflux At Night : రాత్రి గుండెల్లో మంట రావడానికి కారణాలు.. ఈ అసౌకర్యాన్ని ఎలా తొలగించాలి?

  • ఏదైనా తినాలని అనిపిస్తున్నప్పుడు ఎక్కువ మంచినీటిని తీసుకునేందుకు ప్రయత్నించండి. రెండు, మూడు గ్లాసుల నీళ్లు తాగడం వల్ల పొట్ట నిండుగా అనిపిస్తుంది.
  • ఆహారాన్ని తీసుకునేటప్పుడు ఎక్కువ కార్బోహైడ్రేట్లను కాకుండా ప్రొటీన్లు, పీచు పదార్థాలను తీసుకునేలా ప్రణాళిక చేసుకోండి. అప్పుడు చాలా సేపటి వరకు పొట్ట నిండుగా ఉన్న భావన కలుగుతుంది. గుడ్లు, చికెన్‌, చేపలు, సోయా లాంటివి తీసుకోవడం వల్ల తొందరగా మళ్లీ ఏదో ఒకటి తినాలని అనిపించదు.
  • భోజనం సరిగ్గా ఒకే సమయానికి చేయాలి. వేళల్లో మార్పులు లేకుండా చూసుకోవాలి. అలాగే ఒకేసారి ఎక్కువగా తినడం వల్ల ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంటుంది.
  • అలాగే రోజులో ఏది ఎంత తినాలి? అనేదాన్ని ప్లాన్‌ చేసుకోండి. దీని వల్ల అతిగా తినకుండా ఉండగలుగుతాం.
  • తినేప్పుడు తినడంపైనే దృష్టి పెట్టండి. నోట్లోకి వెళ్లిన ప్రతి పదార్థాన్ని బాగా నమలండి. అది పూర్తిగా లాలాజలంతో కలిసి లోపలికి వెళ్లడం వల్ల డైజెస్టివ్‌ ఎంజైములు అవసరమైనంత విడుదల అవుతాయి. దృష్టి పెట్టి తినడం వల్ల ఎంత తిన్నాం? అనేదానిపైన లెక్క ఉంటుంది.
  • ఏదైనా తినాలని అనిపించినప్పుడు ప్రోసెస్డ్ ఫుడ్‌లు, ఫ్యాక్డ్‌ ఆహారాలకు దూరంగా ఉండండి. బదులుగా నాలుగైదు నట్స్‌ని తినేందుకు ప్రయత్నించండి. నట్స్‌లో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది.
  • సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల ఆకలి ఎక్కువగా వేస్తున్నట్లు అనిపిస్తుంది. అందుకనే రోజులో కచ్చితంగా ఏడు నుంచి ఎనిమిది గంటలు నాణ్యమైన నిద్ర ఉండేలా చూసుకోండి. రాత్రి నిద్ర హార్మోన్లను నియంత్రణలో ఉంచుతుంది. ఎక్కువగా తినాలన్న కోరికలను రానీయదు.
  • మనకు ఒత్తిడి ఎక్కువగా ఉన్నా ఫుడ్‌ క్రేవింగ్స్‌ పెరుగుతాయని అధ్యయనాల్లో తేలింది. కాబట్టి ఎక్కువ ఒత్తిడి లేకుండా చూసుకోండి. యోగా, మెడిటేషన్‌, డీప్‌ బ్రీతింగ్‌ వ్యాయామాలు చేయడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. చేసే పనులను ప్రణాళిక ప్రకారం చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.

టాపిక్

తదుపరి వ్యాసం