తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Expensive Potato Chips: ఈ ఆలూ చిప్స్ ప్యాకెట్ కొనాలంటే అందరి తరం కాదు, ఒక్క చిప్ ఎంత ఖరీదో తెలుసా?

Expensive Potato Chips: ఈ ఆలూ చిప్స్ ప్యాకెట్ కొనాలంటే అందరి తరం కాదు, ఒక్క చిప్ ఎంత ఖరీదో తెలుసా?

Haritha Chappa HT Telugu

10 May 2024, 13:15 IST

    • Expensive Potato Chips: ఆలూ చిప్స్ ప్యాకెట్ మార్కెట్లో పది రూపాయలు. పేదవారి నుంచి ధనవంతుల వరకు అందరూ వీటిని కొనగలరు. కానీ ఓ చిప్స్ ప్యాకెట్ మాత్రం కొనాలంటే వేలు ఖర్చుపెట్టాలి.
ఖరీదైన పొటాటో చిప్స్
ఖరీదైన పొటాటో చిప్స్

ఖరీదైన పొటాటో చిప్స్

Expensive Potato Chips: ఆలూ చిప్స్ బయట ఐదు రూపాయల ప్యాకెట్ల నుంచి లభిస్తాయి. ఎక్కువ మంది పిల్లలు ఇష్టంగా తినేది ఈ ఆలూ చిప్స్ నే. అయితే ప్రపంచంలోనే ఖరీదైన బంగాళాదుంప చిప్స్ ఉన్నాయి. వీటిని ప్యాకెట్ల రూపంలో కొనలేము. ఒక బాక్స్ లో వీటిని పెట్టి అమ్ముతారు. అది కూడా కేవలం ఐదు చిప్స్ మాత్రమే అమ్ముతారు. ఒక్కో చిప్ కొనాలంటేనే చాలా ఖర్చు అవుతుంది.

ట్రెండింగ్ వార్తలు

Flaxseeds Gel : చర్మంపై ముడతలను తగ్గించే మ్యాజిక్ జెల్.. ఇలా ఉపయోగించండి

Mobile Side effects: నిద్రపోతున్నప్పుడు మొబైల్ తలగడ పక్కనే పెట్టుకొని నిద్రపోతున్నారా? మీలో ఈ మార్పులు వచ్చే అవకాశం

Chanakya Niti Telugu : భార్య తన భర్త దగ్గర దాచే రహస్యాలు.. ఎప్పుడూ చెప్పదు!

Meaning of Moles: మీ ముఖంలో వివిధ చోట్ల ఉండే పుట్టుమచ్చలు మీ వ్యక్తిత్వాన్ని చెబుతాయి

ఖరీదైన బంగాళాదుంప చిప్స్

చిప్స్ ను ప్రత్యేకమైన బంగాళదుంపల నుండి తయారుచేశారు. ఈ దుంపలను నిలువుగా ఉండే ఈ బంగాళదుంపలతో తయారుచేస్తారు. చేతితోనే ఈ పంటకు కావలసిన పనులన్నీ చేశారు. వీటిని కొండలపై రాతి ప్రాంతంలో పండిస్తారు. అందుకే ఇవెంతో ప్రత్యేకమైనవి.

ఇక ఈ చిప్స్ తయారీలో స్వీడన్లోని అడవుల్లో దొరికే పుట్టగొడుగులను కూడా వినియోగిస్తారు. అలాగే సముద్రంలో ఉండే సీవీడ్ కూడా వాడతారు. అలాగే విలువైన ఉల్లిపాయ జాతి అయినా లెగ్సాండ్ ఉల్లిపాయలను వినియోగిస్తారు. ఇవి వాతావరణంతో సంబంధం లేకుండా చిన్న స్వీడన్ పట్టణంలో పండుతాయి. బార్లీ మాల్ట్ బీర్ తయారీ ప్రక్రియలో వచ్చే పదార్థం వోట్. ఈ వోట్‌ని కూడా ఈ చిప్స్ తయారీలో వినియోగిస్తారు. సాధారణ చిప్స్ తో పోలిస్తే ఈ చిప్స్ తయారీ ఎక్కువ సమయాన్ని తీసుకుంటుంది. అందుకే ఇవి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చిప్స్ గా మారాయి.

ధర ఎంత?

కేవలం ఒక బంగాళాదుంప చిప్ కొనాలంటే 900 రూపాయలు దాకా ఖర్చు పెట్టాలి. ఐదు చిప్స్ ను కలిపి ఒక బాక్స్ లో పెట్టి అందిస్తారు. ఈ ఐదు చిప్స్ కోసం మీరు దాదాపు 5వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. నోట్లో పెట్టగానే టేస్టీగా కరిగిపోయేలా ఉంటాయి. వీటిని చేయడానికి తయారు చేసిన సంస్థ రూపొందించింది. మొదటిసారి కేవలం 100 చిప్స్ పెట్టెలను మాత్రమే రెడీ చేసింది. అవి హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఒక్కో పెట్టెను దాదాపు 5వేల రూపాయలకు అమ్మారు.

ఇందులో వాడే బంగాళదుంపలను బాదం బంగాళదుంపలు అని పిలుస్తారు. అవే ఈ చిప్స్ కు ఎక్కువ రుచిని అందిస్తాయి. కేవలం రాతి కొండలపై మాత్రమే ఈ బంగాళదుంపలు పండుతాయి. ఇవి ప్రపంచంలోనే ఖరీదైన ఆలోచిస్తూగా పేరుపొందాయి.

టాపిక్

తదుపరి వ్యాసం