తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Periods Delay Reasons : పీరియడ్స్ ఆలస్యం కావడానికి ఇవే ప్రధాన కారణాలు

Periods Delay Reasons : పీరియడ్స్ ఆలస్యం కావడానికి ఇవే ప్రధాన కారణాలు

Anand Sai HT Telugu

19 February 2024, 18:40 IST

    • Periods Delay Reasons In Telugu : మహిళల్లో పీరియడ్స్ ఆలస్యం కావడానికి కొన్ని ప్రధాన కారణాలు ఉంటాయి. లైఫ్ స్టైల్ ఆధారంగా ఇవి ప్రభావితమవుతాయి.
పీరియడ్స్ ఆలస్యం కారణాలు
పీరియడ్స్ ఆలస్యం కారణాలు (Unsplash)

పీరియడ్స్ ఆలస్యం కారణాలు

స్త్రీ రుతుచక్రం ఆమె ఆరోగ్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఆరోగ్యంగా ఉంటే సరైన సమయంలో పీరియడ్స్ అవుతూ ఉంటాయి. యుక్తవయస్సులో సరిగా కనిపించే రుతుచక్రం.. తర్వాత మారిపోతూ ఉంటుంది. ఆమె పాటించే జీవనశైలి కూడా ఇందుకు కారణం అయి ఉండవచ్చు. కొందరికి రావడం ఆగిపోతాయి, మరికొందరికి చాలా టైమ్ తీసుకుని వస్తుంటాయి. రుతుక్రమం ఆలస్యం కావడం గర్భం దాల్చడానికి సంకేతం. కానీ కొన్నిసార్లు రుతుక్రమం రాకపోవడానికి ఇతర కారణాలు కూడా ఉండవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

Mango Fruit Bobbatlu: మామిడిపండు బొబ్బట్లు చేసి చూడండి, రుచి అదిరిపోతుంది

Pregnancy Tips : గర్భంతో ఉన్నప్పుడు బొప్పాయి ఎందుకు తినకూడదో అసలైన కారణాలు

Ashwagandha powder: ప్రతిరోజూ అశ్వగంధ చూర్ణాన్ని ఇలా తీసుకోండి, ఎలాంటి ఆరోగ్య సమస్యలే రావు

Ivy gourd and Diabetes: డయాబెటిస్ అదుపులో ఉండాలంటే ప్రతిరోజూ దొండకాయలు తింటే చాలు, వాటితో ఎన్నో అద్భుత ప్రయోజనాలు

క్రమరహిత రుతుస్రావం రెండు సందర్భాలలో మాత్రమే ఉంటుంది. ఒకటి రుతుక్రమం ప్రారంభం కాగానే, రెండోది రుతుక్రమం ఆగిపోయే సమయంలోనే. కానీ స్త్రీ శరీరం అనేక మార్పులకు అనుగుణంగా, రుతుచక్రంలో మార్పులు ఉండవచ్చు. ప్రతి నెలా స్త్రీలకు 28 రోజులకు ఒకసారి రుతుక్రమం జరగాలి. 21 నుండి 35 రోజుల మధ్య కాలం ఆరోగ్యకరమైనది. ఈ వ్యవధిలో రుతుక్రమం జరగకపోతే దానిని క్రమరహిత రుతుస్రావం అంటారు. అలాంటప్పుడు శరీరంలో ఏదో సమస్య ఉందని అర్థం చేసుకోవాలి.

ఒత్తిడి ప్రధాన కారణం

శారీరక లేదా మానసిక ఒత్తిడికి లోనైనప్పుడు శరీరంలో ఒత్తిడి హార్మోన్లు విడుదలవుతాయి. ఈ హార్మోన్లు అధికంగా ఉంటే, అది పునరుత్పత్తి వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. పునరుత్పత్తి వ్యవస్థ కార్యకలాపాలు తాత్కాలికంగా ఆగిపోవచ్చు. దీని ద్వారా రుతుచక్రం ఆలస్యం కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి.

గర్భనిరోధక మాత్రలు

గర్భనిరోధక మాత్రల వల్ల రుతుక్రమం ఆలస్యం అయ్యే అవకాశాలు ఎక్కువే ఉన్నాయి. గర్భనిరోధక మాత్రలు శరీరంలో గుడ్లు విడుదలను నిలిపివేస్తాయి. అండం విడుదల కాకపోతే రుతుక్రమం రాదు. అత్యవసర గర్భనిరోధక మాత్రలు రుతుస్రావం ఆలస్యం లేదా వాయిదా వేయవచ్చు. యాంటిడిప్రెసెంట్స్ కూడా రుతుస్రావం ఆలస్యం చేయవచ్చు. యాంటిసైకోటిక్స్, కార్టికోస్టెరాయిడ్స్, కీమోథెరపీ కూడా దీనికి కారణం అవ్వొచ్చు.

మధుమేహంతోనూ సమస్యలే

మధుమేహం లేదా పేగు సమస్యలు వంటి దీర్ఘకాలిక వ్యాధులు రుతుచక్రాన్ని ప్రభావితం చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలు మారినప్పుడు హార్మోన్ల మార్పులు జరుగుతాయి. ఇది చాలా అరుదు. కానీ మధుమేహం క్రమరహిత రుతుచక్రాలకు దారి తీస్తుంది.

అధిక బరువు ప్రమాదం

ఊబకాయం శరీరం హార్మోన్ల మార్పులకు కారణం అవుతుందని తెలుసు. ఇది కూడా రుతుస్రావం ఆలస్యం అయ్యే అవకాశాన్ని పెంచుతూ ఉంటుంది. అలాంటప్పుడు డాక్టర్ సూచించిన ఆహారం, వ్యాయామాలు పాటించాలి. అప్పుడే ప్రతినెలా సరైన సమయంలో పీరియడ్స్ వస్తాయి.

కొన్ని సమస్యలు ఉన్న స్త్రీలు తక్కువ శరీర బరువు కలిగి ఉంటారు. అలాంటి సమయంలో రుతుక్రమం ఆలస్యం లేదా కోల్పోయే అవకాశం ఉంది. అందుకే బరువును కూడా సరిగా మెయింటెన్ చేయాలి. పీరియడ్స్ సరిగా ఉంటే స్త్రీల ఆరోగ్యం బాగుంటటుంది.

థైరాయిడ్ ఎఫెక్ట్

మెడలో ఉండే థైరాయిడ్ గ్రంథి శరీర జీవక్రియను నియంత్రిస్తుంది. శరీరం సరిగ్గా పనిచేయడానికి ఇది ఇతర శరీర వ్యవస్థతో సంబంధం ఉంటుంది. థైరాయిడ్ అసమతుల్యత, హైపర్ థైరాయిడిజం రుతు చక్రంలో మార్పులకు కారణం అయ్యే ఛాన్స్ ఉంది.

తల్లిపాలు ఇచ్చేవారైతే

మీరు తల్లిపాలు ఇస్తున్నట్లయితే కొంత కాలం వరకు మీకు పీరియడ్స్ రాకపోవచ్చు. తల్లి పాలను ఉత్పత్తి చేయడానికి కారణమయ్యే ప్రోలాక్టిన్ అనే హార్మోన్ కారణంగా ఇది జరుగుతుంది. బిడ్డలకు పాలు పట్టే చాలా మంది స్త్రీలకు పీరియడ్స్ సరిగా రాకుండా ఉంటాయి.

తదుపరి వ్యాసం