తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Child Growth | మీ పిల్లలు ఎత్తు పెరగాలా? అయితే ఈ ఆహారాలు ఇవ్వండి

Child growth | మీ పిల్లలు ఎత్తు పెరగాలా? అయితే ఈ ఆహారాలు ఇవ్వండి

26 February 2022, 7:54 IST

    • పోషకాహారం, జీవనశైలి అలవాట్లు, వ్యాయామం లాంటి అంశాలు పెరుగుతున్న వయస్సుతో పాటు ఎత్తుపై ప్రభావాన్ని చూపుతాయి. అంతేకాకుండా ఎముక సాంద్రత(Bone Density) నష్టాన్ని నివారించడంలో తోడ్పడుతాయి. నిర్దిష్ట వయస్సు తర్వాత ఎవరైనా పరిమితికి మించిన ఎత్తును ఎదగలేరు. కాబట్టి  పోషకాలుండే ఆహారాలను చిన్నప్పటి నుంచే చిన్నారులకు అందిస్తే ఎదుగుదల బాగుంటుంది.
పిల్లల ఎత్తు
పిల్లల ఎత్తు (Unsplash Pixaby)

పిల్లల ఎత్తు

చిన్నప్పటి నుంచే పిల్లలు బాగా ఎత్తు పెరగాలని తల్లిదండ్రులు ఎంతగానో ఆశిస్తారు. అయితే హైట్ అనేది జీన్స్, జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది. 70 నుంచి 80 శాతం వరకు ఎత్తు జన్యుపరంగానే వస్తుంది. మిగిలిన కొద్ది మొత్తం లైఫ్‌స్టైల్‌తో ముడిపడి ఉంటుంది. అయినప్పటికీ దీర్ఘకాలంలో ఇది అపారమైన ఔచిత్యాన్ని కలిగి ఉంటుంది. పోషకాహారం, జీవనశైలి అలవాట్లు, వ్యాయామం లాంటి అంశాలు పెరుగుతున్న వయస్సుతో పాటు ఎత్తుపై ప్రభావాన్ని చూపుతాయి. అంతేకాకుండా ఎముక సాంద్రత(Bone Density) నష్టాన్ని నివారించడంలో తోడ్పడుతాయి. నిర్దిష్ట వయస్సు తర్వాత ఎవరైనా పరిమితికి మించిన ఎత్తును ఎదగలేరు. కాబట్టి ప్రోటీన్లు, కాల్షియం, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఐరన్, విటమిన్ డీ, మెగ్నీషియం, ఫాస్పరస్ లాంటి పోషకాలను చిన్నప్పటి నుంచే చిన్నారులకు అందిస్తే ఎదుగుదల బాగుంటుంది. మరి ఈ పోషకాలు ఏయే ఆహారాల్లో లభిస్తాయో ఇప్పుడు చూద్దాం.

ట్రెండింగ్ వార్తలు

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

బాదం..

ప్రతిరోజూ ఉదయం కొన్ని బాదంపప్పులను చిన్నారులకు ఇవ్వడం ద్వారా వారిలో జ్ఞాపకశక్తి, దృష్టి మెరుగుపడతాయి. అంతేకాకుండా పెరుగుదలకు కూడా దోహదపడుతుంది. వీటిల్లో ఖనిజాలు, విటమిన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఎంతో రుచికరంగానూ ఉంటాయి. బాదంపప్పును నానబెట్టి పాలు లేదా ఓట్‌మీల్‌తో తీసుకోవచ్చు. ఎముకల ఆరోగ్యానికి ఇది ఉత్తమ ఆహారం. ఇందులో ఉండే సహజ సిద్ధమైన విటమిన్-ఈ పిల్లలను చిన్న వయస్సు నుంచే ఎత్తు పెంచడానికి సహాయపడుతుంది.

గుడ్లు..

గుడ్లు.. కొవ్వులు, ప్రోటీన్లకు గొప్ప మూలం. అంతేకాకుండా ఆరోగ్యకరమైన ఆహారాల్లో ప్రధానమైనవి. ఒక పెద్ద గుడ్డు ఆరు గ్రాముల ప్రోటీన్లను ఇస్తుంది. ఇందులో ఉండే అమైనో ఆమ్లాలు ఎముకల నిర్మాణాన్ని ప్రోత్సహిస్తాయి. కాలక్రమేణా బలోపేతం చేస్తాయి. ఇవి కాకుండా గుడ్లలో విటమిన్-డీ ఉంటుంది. ఈ విటమిన్ కాల్షియంను సంగ్రహించడంలో ఎముకలకు సహాయపడుతుంది.

పాలు..

ప్రోటీన్లతో పాటు ఎముకల వృద్ధికి, నిర్మాణానికి అవసరమైన కాల్షియం పాలల్లో పుష్కలంగా దొరుకుతాయి. అంతేకాకుండా పాల ఉత్పత్తులైన పెరుగు, జున్ను, వెన్నలో శరీరానికి అవసరమైన ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫాస్ఫరస్, మెగ్నీషియం ఉంటాయి. పిల్లల పొడవుగా ఎదగడానికి సహాయపడే ఖనిజ లవణాలు సమృద్ధిగా దొరుకుతాయి. ఓ గ్లాసు పాలల్లో 8 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఒకవేళ మీ చిన్నారుల్లో లాక్టోజ్ లోపం ఉంటే పాల ఉత్పత్తులను తీసుకోకపోవడం మంచిది.

పచ్చని ఆకుకూరలు..

మీ పిల్లలకు బచ్చలి కూర, కాలే, కొల్లార్డ్ గ్రీన్స్ లాంటి ఆకుకూరలు ఇవ్వడం వల్ల వారి ఎదుగుదల మెరుగ్గా ఉంటుంది. అయితే వీటిని చిన్నారులు పెద్దగా ఇష్టపడకపోయినా ఎలాగోలా వారికి అందించడం ద్వారా పొడవుగా మారుతారు. బ్రోకలీ లాంటి ఆకుకూరల్లో కాల్షియం మెరుగ్గా ఉంటుంది. ఇది ఎముకల వృద్ధి, పెరుగుదలకు దోహదపడుతుంది.

సోయాబీన్..

ప్రోటీన్లు ఎక్కువగా ఉండే శాఖాహారాల్లో సోయాబీన్స్ ముఖ్యమైనవి. చిన్నారులకు వీటిని అందించడం ద్వారా వారిలో ఎదుగుదల మెరుగ్గా ఉంటుంది. సోయా పాలు రూపంలో వీటిని ఇవ్వవచ్చు. పాల ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగానూ ఉపయోగపడతాయి.

 

టాపిక్

తదుపరి వ్యాసం