తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  New Year Party Hangover : న్యూ ఇయర్ పార్టీ హ్యాంగోవర్‌ను నయం చేసేందుకు వంటగదిలోని ఇవి చాలు

New Year Party Hangover : న్యూ ఇయర్ పార్టీ హ్యాంగోవర్‌ను నయం చేసేందుకు వంటగదిలోని ఇవి చాలు

Anand Sai HT Telugu

31 December 2023, 13:00 IST

    • New Year Party Hangover Home Remedies : 2024 సంవత్సరం వచ్చేసింది. న్యూ ఇయర్ అంటేనే చాలామందికి పార్టీ. దీంతో హ్యాంగో‌వర్‌ వస్తుంది. దీని నుంచి బయటపడేందుకు వంటగదిలోని కొన్ని వస్తువులు సరిపోతాయి.
న్యూ ఇయర్ హ్యాంగోవర్
న్యూ ఇయర్ హ్యాంగోవర్ (unsplash)

న్యూ ఇయర్ హ్యాంగోవర్

నూతన సంవత్సరం మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేసే సమయం. అందరూ వేడుకల్లో పాల్గొంటారు. ఇందులో తప్పనిసరిగా మద్యం ఉండాలనేది ఓ నియమంగా మారింది. ఈవెంట్స్ సందర్భాలలో మద్యపానం సరదాగా ఉంటుంది, కానీ తర్వాత దాని పరిణామాలు భయంకరంగా ఉంటాయి.

మద్యం సేవించిన ప్రతిసారీ తలనొప్పి, హ్యాంగోవర్‌తో ఇబ్బంది పడతారు. మీరు 2024 న్యూ ఇయర్ రోజున హ్యాంగో‌వర్‌తో మంచం మీద గడపకూడదనుకుంటే కొన్ని టిప్స్ పాటించాలి. మీ ముఖంపై చిరునవ్వుతో నూతన సంవత్సరంలోకి ఆహ్వానం పలకాలి. మీకు సహాయపడే కొన్ని సులభమైన, సమర్థవంతమైన పరిష్కారాలు ఇక్కడ ఉన్నాయి. ఇంటి నివారణలు హ్యాంగోవర్‌ను నయం చేయడంలో సహాయపడతాయి. ఇవి ఎక్కడో కాదు.. మీ వంట గదిలోనే దొరుకుతాయి.

శతాబ్దాలుగా మన ఆహారంలో, ఔషధాలలో అల్లం ఒక అనివార్యమైన పాత్రను పోషిస్తోంది. ఇది రుచి, దాని ఔషధ గుణాల కారణంగా చాలా ఫేమస్. ఇందులోని ఔషధ గుణాలు జీర్ణక్రియకు, శక్తిని పెంచేందుకు సహకరిస్తాయి. దీని థర్మోజెనిక్ లక్షణాలు కొవ్వును సమర్థవంతంగా కాల్చడానికి సహాయపడతాయి. హ్యాంగోవర్ ఉంటే అల్లం టీని చేసుకుని తాగండి. లేదంటే ఓ అల్లం ముక్కను నోట్లో వేసుకోండి. కాస్త రిలీఫ్ అవుతుంది.

పుదీనా ప్రత్యేక సువాసనకు ప్రసిద్ధి చెందింది. కేవలం రిఫ్రెష్ కాకుండా, పుదీనా మీ జీవక్రియను పెంచే, కాలేయ ఆరోగ్యానికి సహాయపడే పదార్థాలను కలిగి ఉంటుంది. ఇది ఆల్కహాల్ వల్ల కలిగే కాలేయ నష్టాన్ని తగ్గిస్తుంది. పుదీనా టీని చేసుకుని తాగితే హాయిగా ఉంటుంది. కొన్ని పుదీనా ఆకులను కూడా నమలవచ్చు.

నిమ్మ రసం అత్యంత ప్రజాదరణ పొందిన వాటిలో ఒకటి. మద్యం సేవించిన తర్వాత మరుసటి రోజు ఉదయం నిమ్మరసం తాగడం చాలా మందికి అలవాటు. నిమ్మకాయలో విటమిన్ సి, పొటాషియం పుష్కలంగా ఉన్నాయి. నిమ్మకాయను నీటిలో కలపడం వల్ల మంచి ఆర్ద్రీకరణను ప్రోత్సహిస్తుంది. డీహైడ్రేషన్ కాకుండా ఉంటారు.

నీరు, ఫైబర్ అధికంగా ఉండే దోసకాయ ఆరోగ్యానికి మంచిది. దోసకాయ అనేది టాక్సిన్స్‌ను బయటకు పంపడానికి, మిమ్మల్ని హైడ్రేట్‌గా ఉంచడానికి, మీ కాలేయానికి మద్దతు ఇవ్వడానికి సరైన పదార్థం.

అయితే అసలు చిట్కా ఏంటంటే.. పైన చెప్పిన పదార్థాలతో పానీయం తయారు చేస్తే సమర్థవంతంగా పనిచేస్తుంది. నిమ్మరసంలో అల్లం, పుదీనా, దోసకాయలను కొద్దిగా నీరుపోసి బాగా కలపండి. మీ రోజు ప్రారంభించే ముందు ఈ పానీయం తాగడం వల్ల మీరు హైడ్రేట్‌గా ఉంటారు. ఆల్కహాలిక్ హ్యాంగోవర్‌ను నయం చేస్తుంది. ఈ పానీయం తయారు చేయడం చాలా సులభం.

తదుపరి వ్యాసం