గ్రీన్ బీన్స్‌తో ఆరోగ్యానికి చాలా మేలు: లాభాలు ఇవే
Photo: Unsplash
By Chatakonda Krishna Prakash Dec 26, 2023
Hindustan Times Telugu
గ్రీన్ బీన్స్‌లో చాలా విటమిన్లు, మినరల్స్, ఫైబర్ సహా మరిన్ని పోషకాలు ఉంటాయి. ఈ కూరగాయ తినడం వల్ల ఆరోగ్యానికి కలిగే లాభాలు ఏవో ఇక్కడ చూడండి.
Photo: Unsplash
గ్రీన్ బిన్స్‌లో విటమిన్ కే పుష్కలంగా ఉంటుంది. దీంతో ఇవి తింటే ఎముకల దృఢత్వానికి మేలు జరుగుతుంది.
Photo: Unsplash
గ్రీన్ బీన్స్‌లో ఫైబర్ ఉంటుంది. దీంతో ఇది పేగుల కదలికలను తోడ్పడి, జీర్ణక్రియను మెరుగుపరచగలదు. ఆహారం త్వరగా జీర్ణమయ్యేందుకు సహకరిస్తుంది.
Photo: Unsplash
గ్రీన్ బీన్స్‌లో విటమిన్ సీ కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే రోగ నిరోధక శక్తిని కూడా ఇది మెరుగుపరచగలదు.
Photo: Unsplash
ఎక్కువ సేపు కడుపు నిండిన ఫీలింగ్‍ను గ్రీన్ బీన్స్ ఇస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ వల్ల ఇలా జరుగుతుంది. దీంతో బరువు తగ్గాలనుకునే వారికి కూడా బీన్స్ మేలు చేస్తుంది.
Photo: Unsplash
గ్రీన్ బీన్స్‌లో ఫ్లోరేట్, పొటాషియమ్ సహా మరిన్ని పోషకాలు ఉంటాయి. అవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
Photo: Unsplash
గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి