తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Clay Pot Water Benefits : మట్టి కుండలో నీరు తాగితే ఈ సమ్యలు మీ దరిచేరవు

Clay Pot Water Benefits : మట్టి కుండలో నీరు తాగితే ఈ సమ్యలు మీ దరిచేరవు

Anand Sai HT Telugu

09 April 2024, 18:30 IST

    • Clay Pot Water Benefits In Telugu : వేసవిలో అనేక మంది ఫ్రిజ్ నీరు తాగుతుంటారు. కానీ ఇది చాలా చెడ్డ అలవాటు. వేసవిలో మట్టి కుండలో నీరు తాగండి. దీనితో అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
మట్టి కుండ నీటితో ప్రయోజనాలు
మట్టి కుండ నీటితో ప్రయోజనాలు (Unsplash)

మట్టి కుండ నీటితో ప్రయోజనాలు

వేసవి కాలం ప్రారంభం కావడంతో చాలా మంది ఫ్రిజ్‌లో నీటిని పెట్టి తాగుతుంటారు. కానీ ఇది మంచి పద్ధతి కాదు. అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. దానికి బదులుగా మట్టి కుండలో నీరు తాగండి. కొంతమంది తమ ఇళ్లలో మట్టి కుండలను కొనుగోలు చేసి అందులోని నీటిని తాగుతున్నారు. అయితే ఈ కుండలోని నీటిని తాగడం వల్ల వేడి, ఎండల నుంచి శరీరాన్ని సురక్షితంగా, చల్లగా ఉంచడమే కాకుండా శరీరానికి ఎన్నో లాభాలు చేకూరుతాయని మీకు తెలుసా?ఒకవేళ మీకు తెలియకపోతే తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకోండి.

ట్రెండింగ్ వార్తలు

Morning Habits : ఉదయం ఈ 5 అలవాట్లు చేసుకుంటే ఒక్క నెలలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది

Godhuma Laddu: పిల్లలకు బలాన్నిచ్చే గోధుమ పిండి లడ్డూలు, ఇలా సులువుగా చేసేయండి

Two Flush Buttons : టాయిలెట్‌లో రెండు ఫ్లష్ బటన్లు ఉండటానికి కారణం ఏంటో మీరు తెలుసుకోవాలి

Hair Fall Causes: అకస్మాత్తుగా జుట్టు రాలిపోతోందా? అయితే ఇవి కారణాలు కావచ్చు, ఓసారి చెక్ చేసుకోండి

మట్టి కుండ నీటిలో విటమిన్లు

మట్టి కుండ నీటిలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరం గ్లూకోజ్ స్థాయిని నిర్వహిస్తుంది. అలాగే ఇది మన శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ వేసవిలో ఫ్రిజ్ వాటర్ కి బదులు మట్టి కుండలో నీరు తాగడం మంచిది.

గ్యాస్ సమస్యలు పోతాయి

మట్టి కుండలోని నీటిని తాగడానికి చల్లగా, మంచి రుచిగా ఉంటుంది. ఈ వాటర్‌తో గ్యాస్ సమస్య కూడా తొలగిపోతుంది. ఇది కాకుండా ఈ నీరు రక్తపోటును నియంత్రిస్తుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. మట్టి కుండలో నీటిని ఉంచడం వల్ల అనేక వ్యాధులు నయమవుతాయనేది నిజమే. ముఖ్యంగా ఈ నీటిని తాగితే కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.

కుండ నీటిని చల్లగా చేసుకోండి

అంతే కాకుండా రక్తహీనత వంటి తీవ్ర వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. చర్మ సంబంధిత వ్యాధులకు ఈ నీరు అద్భుతమైన ఔషధం. ఈ మట్టి కుండ నీళ్లను తాగితే ముఖంపై వచ్చే మొటిమలు త్వరగా నయమై ముఖం కాంతివంతంగా మారుతుంది. ఇది కాకుండా మీకు ఐరన్ లోపం ఉంటే ఈ నీటిని క్రమం తప్పకుండా తాగడం వల్ల త్వరగా నయమవుతుంది. కుండలోని నీరు చల్లగా అయ్యేందుకు దాని చుట్టు నీటిని చల్లుతూ ఉండండి. లేదంటే ఏదైనా గుడ్డను తీసుకుని కుండ చుట్టు కట్టి.. దానిని తడుపుతూ ఉండండి.

ఫ్రిజ్‌లో నీటితో సమసస్యలు

ఫ్రిజ్‌లో ఉంచిన నీటిని ఎప్పుడూ తాగకండి. ఇది మీకు హాని చేస్తుంది. ఇది మీ గొంతు వాపు, బొంగురుపోయేలా చేస్తుంది. వేసవిలో ఫ్రిజ్ వాటర్ మంచిది కాదు. ముఖ్యంగా బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారికి ఇది ప్రమాద కారకం. . చల్లటి నీరు తాగడం వల్ల రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో గొంతు నొప్పి, దగ్గు లేదా ఏదైనా ఇన్ఫెక్షన్ రావచ్చు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఫ్రిజ్ లో చల్లటి నీళ్లకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

గది ఉష్ణోగ్రతకు సమానమైన నీటిని తాగాలని నిపుణులు చెబుతున్నారు. లేదంటే మట్టి కుండలో నీరు తాగవచ్చు. ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అనారోగ్యం బారిన పడకుండా చేస్తుంది.

చల్లని నీటి వల్ల కలిగే సమస్యలు : గొంతు మంట, గొంతు ఇన్ఫెక్షన్, దగ్గు, జ్వరం, తలనొప్పి, మలబద్ధకం సమస్య, రోగనిరోధక శక్తి బలహీనపడటం

తదుపరి వ్యాసం