తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Places To Visit In January । జనవరి నెలలో విహారయాత్రకు ఈ ప్రదేశాలు ఉత్తమం!

Places to Visit in January । జనవరి నెలలో విహారయాత్రకు ఈ ప్రదేశాలు ఉత్తమం!

HT Telugu Desk HT Telugu

02 January 2023, 17:00 IST

    • Places to Visit in January: ఈ జనవరి మాసంలో ఎక్కడికైనా విహారయాత్ర చేయాలనుకుంటున్నారా? మీరు ప్రకృతి ప్రేమికులైతే, అడ్వెంచర్లను ఇష్టపడేవారైతే ఇక్కడ కొన్ని అద్భుతమైన ఆఫ్‌బీట్ గమ్యస్థానాల గురించి తెలుసుకోండి.
Jibhi Village, Places to Visit in January
Jibhi Village, Places to Visit in January (Unsplash)

Jibhi Village, Places to Visit in January

Places to Visit in January: కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాం, ఈ జనవరి నెలలో సెలవులు చాలా వస్తాయి. మీరు ప్రయాణాలను ఇష్టపడేవారైతే ఈ మాసం అద్భుతంగా ఉంటుంది. నగరాలను విడిచి ప్రశాంతమైన ప్రదేశాలలో విహారయాత్ర చేయడానికి భారతదేశంలో అనేక ప్రదేశాలు ఉన్నాయి. నిశబ్దమైన వాతావరణంలో పచ్చని ప్రకృతి ఒడిలో సేదతీరాలనుకుంటే మీకు ఇక్కడ కొన్ని అద్భుతమైన ఆఫ్‌బీట్ ప్రదేశాల గురించి తెలియజేస్తున్నాం. జనవరి నెలలో ఆహ్లదభరితంగా అనిపించే కొండ ప్రాంతాలు, లోయలలో కొన్ని రోజులు గడుపుతూ, మిమ్మల్ని రీఛార్జ్ చేసుకోవడానికి ఇక్కడికి వెళ్లవచ్చు. ఆంధ్రప్రదేశ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు జాబితాలో ఏయే ప్రదేశాలు ఉన్నాయో మీరే చూడండి.

లంబసింగి

లంబసింగి ఆంధ్ర ప్రదేశ్‌లోని ఒక అద్భుతమైన గ్రామం. శీతాకాలంలో ఈ ప్రాంతం దట్టమైన పొగమంచుతో భూలోక స్వర్గంగా అనిపిస్తుంది. అందుకే ఈ ప్రాంతాన్ని 'ఆంధ్రా కాశ్మీర్' అని పిలుస్తారు. లంబసింగి చుట్టూ పచ్చని టీ , కాఫీ తోటలు ఉన్నాయి. ఈ జనవరి మాసంలో కుటుంబ సమేతంగా విహారయాత్ర చేసే ప్రదేశాలలో ఇది ఒకటి. ఇక్కడ వైల్డ్ లైఫ్ సఫారీ, ఫోటోగ్రఫీ, నేచర్ వాక్ చేయవచ్చు. ఈ ప్రాంతానికి దగ్గరలో అరకులోయ కూడా ఉంటుంది. వీలైతే ఈ రెండు ప్రాంతాలను కవర్ చేసేలా మీ యాత్ర ప్లాన్ చేసుకోండి.

జిభి

భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్రంలో యాత్ర ఒక ప్రత్యేక అనుభూతిని అందిస్తుంది. జనవరి మాసంలో సందర్శించడానికి ఆఫ్‌బీట్ ప్రదేశాలలో ఇక్కడ జిభి ప్రాంతం ఎంతో ఉత్తమంగా ఉంటుంది. ఈ ప్రదేశం చుట్టూ గలాగలా ప్రవహించే నదులు, పచ్చని లోయలు, ఆకర్షణీయమైన జలపాతాలు చాలా ఉన్నాయి. ప్రకృతిని ప్రేమికులు, అడ్వెంచర్ యాక్టివిటీలో మునిగిపోవాలనే వారికి జిభి ఒక స్వర్గధామం. మీరు ఇక్కడ ట్రెక్కింగ్, క్యాంపింగ్, నేచర్ వాకింగ్, ధ్యానం, ఫోటోగ్రఫీ చేయవచ్చు. ఈ స్థలాన్ని సందర్శించడానికి 2 నుండి 3 రోజులు సరిపోతాయి.

మెచుకా వ్యాలీ

అరుణాచల్ ప్రదేశ్‌లో ఉన్న మెచుకా వ్యాలీ సముద్ర మట్టానికి సుమారు 6,000 అడుగుల ఎత్తులో ఉన్న ఒక చిన్న పట్టణం. చుట్టూ పర్వతాలు, సియోమ్ నది, పచ్చని అడవులతో ఈ ప్రదేశం చాలా అందంగా ఉంటుంది. శీతాకాలంలో ఇక్కడ దృశ్యం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. మీరు జనవరి మాసంలో ఈ ఆఫ్‌బీట్ ప్రదేశానికి చేరుకున్నప్పుడు, ప్రతిచోటా దట్టమైన మంచు దుప్పటిని చూస్తారు. ట్రెక్కింగ్, గుర్రపు స్వారీ, సిటీ టూర్ ఇక్కడ చేయవచ్చు. ఇక్కడ 3 నుండి 4 రోజుల వరకు టూర్ ప్లాన్ చేసుకోండి.

తవాంగ్

తవాంగ్ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద బౌద్ధ విహారం. ఆధ్యాత్మికత చింతనతో పాటు అడ్వెంచర్స్ కోరుకునేవారికి తవాంగ్ గొప్ప ప్రదేశం. జనవరి మాసంలో ఈ ప్రదేశం స్వర్గంలా కనిపిస్తుంది. ట్రెక్కింగ్, ప్రసిద్ధ టోర్గ్యా, లోసార్ పండుగలు, వేడుకలలో పాలుపంచుకోవచ్చు. తవాంగ్ షాపింగ్ చేయడానికి కూడా గొప్పగా ఉంటుంది. నగరంలో మూడు ప్రధాన షాపింగ్ కేంద్రాలు ఉన్నాయి, అవి పురానా బజార్, నెహ్రూ బజార్, న్యూ బజార్. ఈ ప్రాంతాన్ని అన్వేషించడానికి 2-3 రోజులు సరిపోతాయి.

ఖోనోమా

నాగాలాండ్‌లోని ఖోనోమా అనే గ్రామం చలికాలంలో ఈశాన్య భారతదేశంలో సందర్శించడానికి అద్భుతమైన ప్రదేశం. ఇది దేశంలోని మరుగున పడిన రత్నాలలో ఒకటి. ఖోనోమా ప్రాంతం దాని అడవులు, వెంచర్‌లు, విశిష్టమైన వ్యవసాయానికి ప్రసిద్ధి చెందింది. మీరు ట్రెక్కింగ్, క్యాంపింగ్, నేచర్ వాక్, ధ్యానం, ఫోటోగ్రఫీ కోసం ఈ ప్రాంతాన్ని ఎంచుకోవచ్చు. ఇక్కడ 2-3 రోజులు గడిపేందుకు ప్రయత్నించండి.

పొల్లాచి

తమిళనాడు రాష్ట్రంలో ఉన్న పొల్లాచి దక్షిణ భారతదేశంలో ఒక అద్భుతమైన పర్యాటక ప్రాంతం. ఇది కోయంబత్తూర్ నుండి 40 కి.మీ దూరంలో ఉంది. సుందరమైన ప్రకృతి దృశ్యాలకు ఇది ప్రసిద్ధి పొందింది. ఇక్కడ ఎన్నో సినిమా షూటింగ్స్ జరుగుతుంటాయి. డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం కూడా ఇది ఒక అద్భుతమైన ప్రదేశం. పాల్‌ఘాట్ ఘాట్‌ల నుండి వచ్చే చల్లని గాలులు మిమ్మల్ని తన్మయత్వానికి గురిచేస్తాయి. ఈ ప్రదేశంలో అనేక సాహస కార్యకలాపాలను ఆస్వాదించవచ్చు.

టాపిక్

తదుపరి వ్యాసం