తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sleeping Hacks : రాత్రిళ్లు నిద్ర రావట్లేదా? అయితే ఇవి చేయండి.. త్వరగా నిద్ర వస్తుందట..

Sleeping Hacks : రాత్రిళ్లు నిద్ర రావట్లేదా? అయితే ఇవి చేయండి.. త్వరగా నిద్ర వస్తుందట..

10 November 2022, 21:00 IST

    • Effective Sleep Hacks : ఈ మధ్యకాలంలో చాలామంది రాత్రిళ్లు సరైన నిద్రలేక ఇబ్బందులు పడుతున్నారు. ఆరోగ్యం పరంగా, మానసికంగా.. నిద్రలేకపోవడం వల్ల పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. మెరుగైన నిద్ర కావాలనుకునే వారు కొన్ని చిట్కాలు పాటిస్తే.. ఈ సమస్యను అధిగమించవచ్చు అంటున్నారు.
నిద్రపోవాలంటే ఇవి ఫాలో అవ్వండి
నిద్రపోవాలంటే ఇవి ఫాలో అవ్వండి

నిద్రపోవాలంటే ఇవి ఫాలో అవ్వండి

Effective Sleep Hacks : రోజంతా బాగా కష్టపడినా.. రేపు మరింత కష్టపడాల్సి వచ్చినా.. ఆ కష్టాన్ని మరచిపోయి రేపటికి సిద్ధంగా ఉండేందుకు హాయిగా పడుకోవాలి. కానీ కొందరు రాత్రి సమయంలో నిద్రతో పోరాటం చేస్తారు. సరైన నిద్ర లేక.. అలసట తీరక.. మరింత కష్టపడుతూ ఉంటారు. ప్రస్తుత యువతలో ఈ సమస్యలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Dry Fruits For Skin : ఖరీదైన క్రీములు అవసరం లేదు.. డ్రైఫ్రూట్స్ మీ ముఖాన్ని మెరిసేలా చేస్తాయి

Drink for Lungs: ఊపిరితిత్తులు శుభ్రపడాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి చాలు, ఏ మందులూ అవసరం లేదు

IDIOT Syndrome : ఇంటర్నెట్‌లో ప్రతిదీ సెర్చ్ చేస్తే ఇడియట్.. ఈ రోగం ఉన్నట్టే!

Boti Masala Fry: బోటీ మసాలా ఫ్రై ఇలా చేస్తే బగారా రైస్‌తో జతగా అదిరిపోతుంది

దీర్ఘకాలంలో నాణ్యమైన నిద్ర లేకపోతే.. రక్తపోటు, గుండె సమస్యలు, అధిక రక్తపోటు, అధిక బరువు, అకాల మరణం వంటివి సంభవిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. సమస్య మరీ తీవ్రంగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించండి. కానీ జీవనశైలిలో కొన్ని మార్పులు చేయడం ద్వారా కూడా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మీ గాడ్జెట్‌లను అన్‌ప్లగ్ చేయండి..

సాధ్యమైనంతవరకు మంచి నిద్రను పొందడానికి.. పడుకునే ముందు కనీసం ఒక గంట ముందు పరికరాలను గాడ్జెట్స్ ఆఫ్ చేయాలని పరిశోధనలు సూచిస్తున్నాయి. కాల్‌లు, మెసేజ్స్, రీల్స్, గేమ్స్ వంటి వాటిని దూరంగా ఉంచండి. వీటిని ఉపయోగించడం వల్ల మెదడు బిజీగా ఉండి.. మీ నిద్రను కష్టతరం చేస్తుంది. కాబట్టి మీ ఫోన్, ఇతర గాడ్జెట్లకు దూరంగా ఉండండి.

ఆల్కహాల్ తగ్గించండి

మీరు పడుకునే ముందు కనీసం నాలుగు గంటల ముందే మీరు ఆల్కహాల్ తీసుకోవడం మానేయాలి. కొన్నిసార్లు విశ్రాంతి తీసుకోవడానికి మీకు ఒక గ్లాసు బీర్ అవసరం. చాలామంది నిద్రపోవాలని మందు తాగుతారు కానీ.. దాని వల్ల కలిగే నష్టాల్లో నిద్ర నష్టం కూడా ఒకటి.

మంచి పరుపు కొనండి

నాణ్యమైన పరుపు శరీరాన్ని, వెన్నెముక భంగిమను కాపాడుతూ.. మంచి నిద్ర ఇస్తుంది. సరైన దిండు ఉండేలా చూసుకోవడం కూడా చాలా ముఖ్యం. స్లీపింగ్ పొజిషన్‌ సరిగ్గా ఉన్నప్పుడే.. మంచి నిద్ర సాధ్యమవుతుంది.

గది చీకటిగా ఉండేలా చూసుకోండి..

గదిలో కాస్త వెలుతురు కనిపించినా మన నిద్ర చెదిరిపోతుంది. డిజిటల్ అలారం, అతి సూక్ష్మమైన కాంతి వల్ల కూడా నిద్రకు భంగం కలుగుతుంది. మీ గదిలో కాంతిని పూర్తిగా నిరోధించలేకపోతే సౌకర్యవంతమైన ఐ మాస్క్ ధరించండి. అంతేకాకుండా పడుకునే సమయంలో మీకు హాయినిచ్చే దుస్తులను వేసుకోండి.

కెఫిన్ మానుకోండి..

కెఫీన్ నిద్రపోవడాన్ని కష్టతరం చేస్తుంది. కాబట్టి దానిని నివారించడం మంచి ఆలోచన. పడుకునే ముందు దీనిని పూర్తిగా నిరోధిస్తే మంచిది. దానికి బదులుగా తేనె లేదా అల్లం వంటి హెర్బల్ టీని ప్రయత్నించండి. డిన్నర్ హెవీగా లేకుండా.. కారం, మసాల లేని ఫుడ్ తీసుకోండి.

పడుకునే ముందు వేడి నీళ్లతో స్నానం చేయండి..

పడుకునే ముందు వేడినీళ్లతో స్నానం చేస్తే.. చాలా రిలాక్స్ ఉంటుంది. అంతేకాకుండా ఇది మన శరీర ఉష్ణోగ్రతను, మనం నిద్రకు సిద్ధం చేసే విధంగా మార్చవచ్చు. అలసిపోయిన మీ శరీరానికి ఇది మంచి హాయినిచ్చి.. నిద్రను ప్రేరేపిస్తుంది. ఈ నిద్ర చిట్కాలలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఉపయోగించినా.. మీరు నిస్సందేహంగా మీ నిద్ర నాణ్యతలో మెరుగుదలని గమనించవచ్చు.

టాపిక్

తదుపరి వ్యాసం