తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Summer Tan | సమ్మర్​లో ట్యాన్​ ప్రాబ్లమా? ఇలా తగ్గించుకోండి..

Summer Tan | సమ్మర్​లో ట్యాన్​ ప్రాబ్లమా? ఇలా తగ్గించుకోండి..

HT Telugu Desk HT Telugu

23 April 2022, 14:30 IST

    • సమ్మర్​లో బయటకు వెళ్లకుండా ఉండడమే మంచిది. కానీ వెళ్తే మాత్రం ఎదుర్కోవాల్సిన ప్రధాన సమస్యలలో ఒకటి ట్యాన్. సమ్మర్​లో స్కిన్​ ట్యాన్​ అవుతుందని మనందరికి తెలుసు. ఆ డార్క్​నెస్​ పొగొట్టుకోవడం అంత సులువేమి కాదు. కానీ ఈ చిట్కాలు పాటిస్తే.. ట్యాన్​ను సులభంగా తొలగించుకోవచ్చు.
ట్యాన్ తొలగించుకోండి ఇలా..
ట్యాన్ తొలగించుకోండి ఇలా..

ట్యాన్ తొలగించుకోండి ఇలా..

Skin Care in Summer | ఎండాకాలంలో ఉదయాన్నే సన్ కిస్డ్​ ఫోటోలు, డ్రెస్సింగ్ ఎంపికలు చాలానే ఉన్నాయి. అదే సమయంలో ఎండవల్ల వచ్చే సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ముఖ్యంగా ట్యాన్. వేసవిలో యూవీ కిరణాల ఎక్స్​పోజర్ ఎక్కువగా ఉంటుంది. ఇది మన చర్మంపై ముదురు రంగు ట్యాన్ ఏర్పరుస్తుంది. అంతేకాకుండా చర్మ సంబంధిత సమస్యలు కూడా ఎక్కువగా వస్తాయి. మండుతున్న ఎండలు, అధిక వేడి, కాలుష్యం, చెమట కారణంగా మన చర్మం సహజమైన మెరుపును కోల్పోతుంది. సూర్యరశ్మికి గురైన వెంటనే మన చర్మం మెలనిన్‌ను విడుదల చేస్తుంది. అది చివరికి ట్యాన్ కలిగిస్తుంది. అయితే ట్యానింగ్​ను ఎలా తగ్గించుకోవాలని మీరు ఆలోచిస్తుంటే.. ఇది చదివేయండి. సమ్మర్​లో చర్మ సంరక్షణ చిట్కాలు మీకోసం..

ట్రెండింగ్ వార్తలు

Godhuma Laddu: పిల్లలకు బలాన్నిచ్చే గోధుమ పిండి లడ్డూలు, ఇలా సులువుగా చేసేయండి

Two Flush Buttons : టాయిలెట్‌లో రెండు ఫ్లష్ బటన్లు ఉండటానికి కారణం ఏంటో మీరు తెలుసుకోవాలి

Hair Fall Causes: అకస్మాత్తుగా జుట్టు రాలిపోతోందా? అయితే ఇవి కారణాలు కావచ్చు, ఓసారి చెక్ చేసుకోండి

Parenting Tips : ఏడాదిలోపు పిల్లలకు ఆవు పాలు తాగిస్తే మంచిది కాదు.. గుర్తుంచుకోండి

1. శుభ్రం చేసుకోండి..

మంచి ఫేస్ వాష్ చర్మాన్ని ప్రకాశవంతం చేయడంలో, యూవీ కిరణాలనుంచి రక్షణను అందించడంలో, సహజ టోనర్‌గా పని చేస్తుంది. మాయిశ్చరైజర్‌గా పని చేస్తూ.. డార్క్ స్పాట్‌లకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది. సహజమైన ఫేస్ వాష్‌ను రోజుకు రెండుసార్లు ఉపయోగించడం మంచిది. ఎందుకంటే ఇది లోతుగా చర్మాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది. మురికి, ధూళిని తొలగిస్తుంది.

2. ఫేస్ సీరం

ఫేస్ సీరమ్ సూర్యరశ్మిని నిరోధిస్తుంది. నల్లటి వలయాలను కాంతివంతం చేస్తుంది. చర్మపు రంగును ప్రకాశవంతం చేస్తుంది. మాయిశ్చరైజర్‌గా చాలా ముఖ్యమైన పని చేస్తుంది. మంచి సీరమ్ టాన్‌ను రిమూవ్ చేయడంలో సహాయం చేస్తుంది.

3. ఎక్స్‌ఫోలియేట్

చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయకపోతే, మీరు ఎంత క్రీమ్ వాడినా.. ఏమి వాడినా.. మీరు ఎప్పటికీ ప్రకాశవంతమైన, మెరిసే చర్మాన్ని పొందలేరు. అందువల్ల మంచి ఆర్గానిక్, నేచురల్ ఫేస్ స్క్రబ్‌తో చర్మాన్ని శుభ్రం చేయడం చాలా అవసరం. గులాబీ, కలబంద సారం సమృద్ధిగా ఉన్న స్క్రబ్‌ని ఉపయోగించండి. ఏడాది పొడవునా అందమైన చర్మం కావాలంటే.. వారానికి 2-3 సార్లు ఇలా చేయాలి.

4. తేమగా ఉండే చర్మం కోసం..

వేసవి కాలంలో మీ చర్మానికి తేమ అవసరం. మంచి టాన్ డిఫెన్స్ క్రీమ్‌ను ఉపయోగించడం అవసరం. క్రీమ్‌లో ఆరెంజ్ సారం ఉంటే అది డార్క్ సన్‌స్పాట్‌లను పోగొట్టడానికి, ఛాయను ప్రకాశవంతం చేయడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా చర్మాన్ని మృదువుగా చేసి.. మెరుపునివ్వడంలో సహాయం చేస్తుంది.

క్రమబద్ధమైన చర్మ సంరక్షణా విధానాన్ని అనుసరించడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, తాగడం, సహజ పదార్ధాలతో తయారు చేయబడిన ఉత్పత్తులను ఉపయోగించడం ద్వారా వేసవిలోనూ చర్మాన్ని కాపాడుకోవచ్చు.

టాపిక్

తదుపరి వ్యాసం