తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Saturday Motivation : సంవత్సరంలో ఫస్ట్, లాస్ట్ రోజు మాత్రమే ఎంజాయ్ చేస్తారా? మిగిలిన రోజులు మీవి కావా?

Saturday Motivation : సంవత్సరంలో ఫస్ట్, లాస్ట్ రోజు మాత్రమే ఎంజాయ్ చేస్తారా? మిగిలిన రోజులు మీవి కావా?

31 December 2022, 6:57 IST

    • Saturday Motivation : 2022లో ఇదే చివరి రోజు. ఈరోజు మీరు కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పడానికి ప్లాన్ చేసుకునే ఉంటారు. ఇయర్​లో మొదటిరోజు ఎలా ఉంటే.. మిగతా రోజులు అలానే ఉంటాయని భావిస్తారు కొందరు. అయితే న్యూఇయర్​ కోసం మీరు ఎలా సిద్ధమయ్యారో.. మీ జీవితంలో ప్రతిరోజూ అలా అద్భుతంగా గడపాలని ప్లాన్ చేసుకోండి.
కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

కోట్ ఆఫ్ ద డే

Saturday Motivation : మనకున్న చిన్న జీవితంలో పండుగలకో, పుట్టినరోజులకో మాత్రమే హ్యాపీగా ఉండాలని రూల్ లేదు. మీ జీవితంలో ప్రతిరోజూ హ్యాపీగా ఉండే హక్కు మీకుంది. కాబట్టి మీ జీవితాన్ని మీరే గోల్స్ సెట్ చేసుకోండి. ఎంజాయ్ చేయడానికి.. ప్రతి క్షణాన్ని ఆస్వాదించడానికి వచ్చే ఏ అవకాశాన్ని వదలుకోకండి. పెండింగ్ పనులు పెట్టుకోకండి. జీవితాన్ని ప్రతిరోజూ కొత్త కోణంలో చూడండి.

ట్రెండింగ్ వార్తలు

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

Mango Pakodi: పచ్చిమామిడి కాయ పకోడీలు ఇలా చేశారంటే పుల్లపుల్లగా టేస్టీగా ఉంటాయి

Dry Fruits For Skin : ఖరీదైన క్రీములు అవసరం లేదు.. డ్రైఫ్రూట్స్ మీ ముఖాన్ని మెరిసేలా చేస్తాయి

Drink for Lungs: ఊపిరితిత్తులు శుభ్రపడాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి చాలు, ఏ మందులూ అవసరం లేదు

అందరీ జీవితం ఒకేలా ఉండదు. అలాంటప్పుడు ప్రతిరోజూ న్యూ ఇయర్ ఎందుకవుతుంది? పుట్టినరోజు ఎందుకవుతుంది అనుకుంటున్నారా? అవును నిజమే ప్రతిరోజూ మనం గొప్పగానే ఉండాలేము. ఎందుకంటే పరిస్థితులు ఎప్పుడూ మనకు అనుకూలంగా ఉండవు. ఏదొక సమస్యను మనకి ఇస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి సందర్భంలో.. కనీసం రోజులో ఓ గంట మీకోసం.. మీ శరీరానికి, మానసికంగా రిలాక్స్ ఇవ్వడానికి స్పెండ్ చేయండి. కనీసం 5 నిముషాలైనా.. ప్రశాంతంగా కూర్చొని.. లైఫ్​లో ఏమి చేస్తున్నారు.. ఈరోజు ఏమి చేశారు.. ఈ జరిగిన వాటిలో మీరు ఎన్ని సార్లు నవ్వుకున్నారు వంటి ప్రశ్నలు మీకు మీరే వేసుకోండి.

వారానికి ఓసారైనా మీకు నచ్చిన ఫుడ్ తినండి. మీరు సంపాదించే 100 రూపాయల్లో పదిరూయాలు మీకోసమే ఖర్చు చేసుకోండి. నెలకి ఓసారైనా మీకు నచ్చిన సినిమాకు వెళ్లండి. లేదా బయటకు వెళ్లి రండి. కనీసం ఆరునెలలకు లేదా సంవత్సరానికి ఓసారైనా.. ఎటైనా ట్రిప్​కి వెళ్లండి. న్యూ ఇయర్, బర్త్ డే.. ఇలా స్పెషల్​ డే మాత్రమే ఇంపార్టెంట్ కాదు. ప్రతిరోజు ప్రతి గంట, ప్రతి నిముషం ఆఖరికి ప్రతి క్షణం కూడా ఇంపార్టెంట్.

మీ జీవితాన్ని ఎంత వరకు ఎంజాయ్ చేయాలి.. ఎలా ఎంజాయ్ చేయాలనేది మీ చేతుల్లోనే ఉంది. దీనికోసం కూడా ఎవరి పర్మిషన్ కోసమో ఎదురుచూస్తున్నారంటే.. మీకన్నా మూర్ఖులు మరొకరుండరు. లాస్ట్ టైమ్ ఎప్పుడూ ఎంజాయ్ చేశావ్ అని ఎవరైనా అడిగితే.. అప్పుడెప్పుడో జమానాలో ఇలా చేశాము.. అలా చేశాము అని చెప్పుకునేలా మాత్రం ఉండకండి. ప్రతిరోజూ.. ఉన్నదానిలోనే మీ సంతోషాన్ని వెతుక్కోండి. ఈ జీవితం మీదే అనే గుర్తించుకోండి. ప్రతి రోజూను.. పండుగలా సెలబ్రేట్ చేసుకోండి. హ్యాపీగా ఉండండి.

తదుపరి వ్యాసం