తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్స్ ఫీ స్ట్రక్చర్‌లో మార్పులు

ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్స్ ఫీ స్ట్రక్చర్‌లో మార్పులు

10 February 2022, 12:50 IST

    • ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్స్ ఫీ స్ట్రక్చర్‌లో ఫిబ్రవరి 10, 2022 నుంచి మార్పులు తెస్తున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది.  నగదు ఉపసంహరణ, చెక్ రిటర్న్ వంటి అంశాలకు సవరించిన రుసుములు అమల్లోకి వస్తాయని తెలిపింది.
క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపు
క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపు (unsplash)

క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపు

ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్స్ సంస్థ ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ తదితర సంస్థలతో పాటు అగ్రశ్రేణి క్రెడిట్ కార్డు సంస్థలలో ఒకటిగా నిలిచింది. వివిధ లావాదేవీలకు గాను ఈ సంస్థ ఫిబ్రవరి 10 నుంచి సవరించిన రుసుములను వసూలు చేయనుంది. ఈమేరకు సర్క్యులర్ జారీచేసింది.

ఫీజుఫీజు స్ట్రక్చర్ (ఫిబ్రవరి 10, 2022 నుంచి వర్తింపు)
క్యాష్ అడ్వాన్స్ - ట్రాన్సాక్షన్ ఫీఅన్ని కార్డులపై - క్యాష్ అడ్వాన్స్‌మెంట్‌లో 2.50 శాతం, కనీసం రూ. 500
రిటర్న్ ఆఫ్ చెక్మొత్తం డ్యూ అమౌంట్‌పై 2 శాతం (కనీసం రూ. 500)
ఆటో డెబిట్ రిటర్న్ ఫీమొత్తం అమౌంట్‌పై 2 శాతం (కనీసంగా రూ. 500)
లేట్ పేమెంట్ ఛార్జీలు (ఎమరాల్డ్ కార్డు మినహా)బకాయి మొత్తాన్ని బట్టి లేట్ పేమెంట్ ఛార్జీ ఉంటుంది
 మొత్తం బకాయిలేట్ పేమెంట్ ఛార్జీలు
రూ. 100 లోపులేవు
రూ. 100 - 500రూ. 100
రూ. 501 - 5,000రూ. 500
రూ. 5,001 - 10,000రూ. 750
రూ. 10,001 - 25,000రూ. 900
రూ. 25,001 - 50,000రూ. 1000
రూ. 50,001 పైనరూ. 1,200
దీనికి అదనంగా రూ. 50 ప్లస్ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది

పైకి కనిపించేవే ఇవి..

నిజానికి లేట్ పేమెంట్ ఛార్జీలు పైకి కనిపించేవి ఇలా ఉన్నప్పటికీ.. వాస్తవంగా క్రెడిట్ కార్డు బిల్లు ఏ నెలకు ఆ నెల కట్టనిపక్షంలో మరుసటి నెల తడిసిమోపెడవుతుంది. మరుసటి నెల వడ్డీ రహిత రోజులు వర్తించవు. పైగా డ్యూ ఉన్న కాలానికి మొదటి రోజు నుంచి క్రెడిట్ కార్డు వడ్డీ పడుతుంది. క్రెడిట్ కార్డు వడ్డీ అంటే సుమారు 36 శాతం నుంచి 48 శాతం వరకు ఉంటుంది. అలాగే క్రెడిట్ స్కోరు కూడా దెబ్బతింటుంది. అందువల్ల ఎప్పటికప్పుడు క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించడంలో నిర్లక్ష్యం అస్సలే వద్దు. అందువల్ల గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చుకోవద్దు. 

క్రెడిట్ కార్డు సక్రమంగా వాడుకుంటే అనేక ప్రయోజనాలు పొందవచ్చు. కానీ నిర్వహణలో ఏ చిన్న లోపం ఉన్నా నష్టాలే అధికం. క్రెడిట్ కార్డులు వచ్చిన కొత్తలో వడ్డీ రేట్లు, నిబంధనలు తెలియక అనేకమంది నష్టపోయి క్రెడిట్ స్కోరు పడిపోయింది. కానీ ఇటీవలికాలంలో క్రెడిట్ కార్డు బిల్లింగ్, క్రెడిట్ కార్డుల ప్రయోజనాలు, క్రెడిట్ కార్డు సంస్థల మధ్య పోటీతత్వం పెరగడం వల్ల ఖాతాదారులకు ప్రయోజనాలు పెరిగిపోయాయి. 

 

తదుపరి వ్యాసం