తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Porn Addiction : వర్క్ ఫ్రమ్​ హోమ్​లో.. పోర్న్ చూసే వారి సంఖ్య పెరిగిపోయిందట..

Porn Addiction : వర్క్ ఫ్రమ్​ హోమ్​లో.. పోర్న్ చూసే వారి సంఖ్య పెరిగిపోయిందట..

26 August 2022, 12:20 IST

    • Porn Addiction : కొవిడ్​ వల్ల దాదాపు అన్ని దేశాల్లో వర్క్​ ఫ్రమ్​ హోమ్​ కల్చర్ పెరిగింది. అప్పటినుంచి కొన్ని సంస్థలు ఇంకా వర్క్​ ఫ్రమ్​ హోమ్​ని కంటిన్యూ చేస్తాయి. అయితే ఓ దేశంలో మాత్రం కొత్త చిక్కును తీసుకువచ్చింది. అదేంటంటే పోర్న్ అడిక్షన్. ఇంతకీ అది ఏ దేశం. ఎలా విషయాన్ని గుర్తించిందో ఇప్పుడు తెలుసుకుందాం. 
వర్క్ ఫ్రమ్​ హోమ్​లో పోర్న్ చూస్తున్నారంట..
వర్క్ ఫ్రమ్​ హోమ్​లో పోర్న్ చూస్తున్నారంట..

వర్క్ ఫ్రమ్​ హోమ్​లో పోర్న్ చూస్తున్నారంట..

Porn Addiction : కరోనా సమయంలో వర్క్​ ఫ్రమ్ హోమ్ బాగా ప్రజాదరణ పొందింది. అయితే దీనివల్ల యూకే పౌరులు మాత్రం కొత్త సమస్యను ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్​లో ఉన్నప్పుడు పోర్న్ చూసే యూకే పౌరుల సంఖ్య రెట్టింపు అయ్యిందని డైలీ మెయిల్ నివేదించింది. ఏదైనా లిమిట్ ఉన్నంతవరకు బాగానే ఉంటుంది.. ఎక్కువైతేనే సమస్యలు వస్తాయనడానికి ఇదే నిదర్శనం.

ట్రెండింగ్ వార్తలు

Sweetcorn Dosa: స్వీట్ కార్న్ దోశ రెసిపీ, ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు

Friday Motivation: మీ మనసును అదుపులో పెట్టుకుంటేనే విజయం దక్కేది, అందుకోసం ధ్యానం చేయక తప్పదు

Patha Chinthakaya Pachadi: పాత చింతకాయ పచ్చడి ఇలా చేసుకున్నారంటే దోశె, ఇడ్లీ, అన్నంలోకి అదిరిపోతుంది

Diabetes and Methi water: ఖాళీ పొట్టతో మెంతి నీళ్లు తాగి చూడండి, నెలలోనే మ్యాజిక్ చూస్తారు

పోర్న్ చూస్తూ.. కాలం గడిపేస్తూ..

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వర్క్​ ఫ్రమ్​ హోమ్​లో ఉన్నవారిలో పోర్న్​ చూసే వారు ఎక్కువయ్యారని.. పోర్న్ వీక్షణ ఓ వ్యసనంలా మారిందని తెలిపారు. దానివల్ల వారు మరింత దిగజారారని తెలిపారు. అశ్లీలం, పోర్న్ వీక్షణ అనేది ఒక రకమైన సెక్స్ వ్యసనం అన్నారు. దీని వినియోగదారులు ఆహ్లాదకరమైన అనుభూతికి లేదా లైంగిక కార్యకలాపాలకు సంబంధించిన "అధిక" వ్యసనానికి బానిసలవుతారని పేర్కొంది. గంటలకొద్దీ వారు పోర్న్ చూస్తూ కాలం గడిపేస్తున్నారని తెలిపింది.

14 గంటలు అదే పనిలో

లండన్‌లోని లారెల్ సెంటర్.. బ్రిటన్‌లోని అతిపెద్ద సెక్స్, పోర్న్ అడిక్షన్ క్లినిక్​లో.. ఇప్పుడు రోజుకు 14 గంటల వరకు పోర్న్ చూసే కొంతమందికి చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది. సెంటర్ క్లినికల్ డైరెక్టర్ పౌలా హాల్ మాట్లాడుతూ.. "వర్క్​ ఫ్రమ్​లో పని చేసే వారు.. ఎక్కువగా, ఒంటరిగా తమ కంప్యూటర్ల ముందు సమయం గడుపుతున్నారు. అప్పుడు వారికి ప్రైవసీ ఎక్కువగా ఉంటుంది.

అంతకుముందు రాత్రులు పోర్న్ చూసే వారు ఉన్నారు. కానీ ఇప్పుడు వారికి ప్రైవసీ ఉండడం వల్ల రాత్రి వరకు వేచి చూడాల్సిన అవసరం లేకపోయింది. అందుకే వారు పగటిపూట కూడా పోర్న్ చూస్తున్నారు." అని ఆమె మెయిల్​ ఆన్​లైన్​తో తెలిపింది.

రెట్టింపు అయిపోయింది..

లారెల్ సెంటర్ 2022 మొదటి ఆరు నెలల్లోనే దాదాపు 750 మంది పోర్న్ బానిసలను చూసింది. 2019 మొత్తానికి 950 మంది మాత్రమే ఉన్నారు. అంటే అక్కడ వాళ్లు ఎంతగా పోర్న్​కి అడిక్ట్​ అయ్యారో తెలుసుకోవచ్చు. పైగా ఈ సంవత్సరం క్లినిక్‌కి వచ్చే రోగులకు "మరింత ఇంటెన్సివ్ ట్రీట్‌మెంట్ అవసరం" అని వైద్యులు పేర్కొంటున్నారు.

నివేదిక ప్రకారం లండన్ క్లినిక్‌లోని థెరపిస్ట్‌లు 2019లో నెలకు కేవలం 360 గంటలతో పోలిస్తే ఇప్పుడు పోర్న్ వ్యసనాలతో బాధపడుతున్న వ్యక్తులకు సహాయం చేయడానికి నెలకు 600 గంటల సమయం వెచ్చిస్తున్నారు.

టాపిక్

తదుపరి వ్యాసం