Viral | ఆ కాలేజీలో 'పోర్న్​' కోర్సు.. విద్యార్థులందరు కలిసి చూడాల్సిందే..!-a college in america is offering porn class for students ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Viral | ఆ కాలేజీలో 'పోర్న్​' కోర్సు.. విద్యార్థులందరు కలిసి చూడాల్సిందే..!

Viral | ఆ కాలేజీలో 'పోర్న్​' కోర్సు.. విద్యార్థులందరు కలిసి చూడాల్సిందే..!

HT Telugu Desk HT Telugu
Apr 23, 2022 07:01 AM IST

అమెరికా: విద్యార్థులకు పోర్న్​ కోర్సు ప్రవేశపెట్టింది ఓ కాలేజీ. అందుకోసం ప్రత్యేక క్లాస్​రూమ్​ను సైతం ఏర్పాటు చేసింది. విద్యార్థులందరు కలిసి అక్కడ పోర్న్​ చూడవచ్చు..!

కాలేజీలో విద్యార్థులకు పోర్న్​ పాఠాలు…!
కాలేజీలో విద్యార్థులకు పోర్న్​ పాఠాలు…! (Shutterstock)

Porn course for students | పోర్న్​ సైట్లను నిషేధించాలని ఎన్నో ఏళ్లుగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా వాటిని చూసి పిల్లలు చెడిపోతున్నారన్న వాదనలు ఇటీవలి కాలంలో పెరుగుతున్నాయి. అయితే.. ఓ ఆర్ట్​ కాలేజీ మాత్రం.. ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కాలేజీలో పోర్న్​ను ప్రదర్శించాలని ఫిక్స్​ అయ్యింది. దాని కోసం ఓ ప్రత్యేక క్లాస్​రూమ్​ని కూడా ఏర్పాటు చేసింది. అక్కడ.. విద్యార్థులందరు కలిసి పోర్న్​ చూసుకోవచ్చు!

అమెరికాలోని యూటాలో ఉంది ఈ వెస్ట్​మినిస్టర్​ ఆర్ట్స్​ కాలేజీ. పోర్న్​ కోసం ప్రత్యేక క్లాస్​రూమ్​ను ఏర్పాటు చేస్తున్నట్టు కాలేజీ ప్రకటించింది. అమ్మాయిలు, అబ్బాయిలు అనే భేదం లేకుండా.. అందరు కలిసే పోర్న్​ చూడాలన్నది తమ ఉద్దేశం అని స్పష్టం చేసింది. ఈ క్లాస్​కు 'ఫిల్మ్​ 3000 పోర్న్​' అని పేరు కూడా పెట్టింది.

అయితే ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను ఆ కాలేజీ వెల్లడించింది. పోర్న్​ అనేది అమెరికాలో ఓ భాగం అని అభిప్రాయపడింది. ఆదివారం ఫుట్​బాల్​ ఆడటం ఎంత సహజమో.. అమెరికాలో పోర్న్​ చూడటం అంతే సహజం అని చెప్పుకొచ్చింది. సామాజిక సమస్యలు, లింగ సమానత్వం, లింగ వివక్షలపై చర్చించేందుకు ఇది ఒక మంచి వేదిక అవుతుందని భావిస్తున్నట్టు వెల్లడించింది. ఈ కోర్సు తీసుకున్న విద్యార్థులకు రెండు క్రెడిట్​ పాయింట్లు కూడా దక్కుతాయని కాలేజీ చెప్పడం విశేషం. 2022-23 నుంచి ఆ పోర్న్​ కోర్సు అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.

క్లాస్​రూమ్​లో పోర్న్​ ప్రదర్శించాలని కాలేజీ నిర్ణయం తీసుకున్న వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. దీనిపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు.

'టీచర్లతో కలిసి విద్యార్థులు పోర్న్​ చూడాలా','వావ్​.. విద్యార్థులకు పోర్న్​ చూపించేందుకు టీచర్లకు జీతాలిస్తున్నారు,' అంటూ కామెంట్లు పెడుతున్నారు. 'కలిసి పోర్న్​ చూడటం అవసరమా? ఇది ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?' అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్