తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Overnight Oats: వండే అవసరం లేని ఓవర్ నైట్ ఓట్స్

overnight oats: వండే అవసరం లేని ఓవర్ నైట్ ఓట్స్

11 May 2023, 22:33 IST

  • overnight oats: ఆ మధ్య బాగా పాపులర్ అయిన ఓవర్ నైట్ ఓట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూడండి. 

over night oats
over night oats (pexels)

over night oats

వండుకోవాల్సిన అవసరమే లేకుండా ఉదయాన్నే నేరుగా తినగలిగే ఓవర్ నైట్ ఓట్స్ చేసుకోవడం చాలా సులువు. కొన్ని పదార్థాలు కలిపిన ఓట్స్ ని ఫ్రిజ్ లో పెట్టుకుని ఉదయాన్నే పండ్లముక్కలతో తినేయొచ్చు. దీంట్లో తీపి కోసం చక్కెర కూడా కలుపుకోవచ్చు. అలాగే నీళ్లకు బదులు పాలూ, పెరుగు కూడా వాడొచ్చు.

ట్రెండింగ్ వార్తలు

Single Reasons : మీరు సింగిల్‌గా ఉండడానికి ఈ 5 అంశాలు కారణం కావొచ్చు

Brinjal Chutney : 4 వంకాయలు ఉడకబెట్టి ఇలా చట్నీ చేస్తే.. ఎంతో ఇష్టంగా తింటారు

Ginger Garlic Paste: అల్లం వెల్లుల్లి కలిపి పేస్ట్ చేయడం మంచి పద్ధతి కాదా? పోషకాలు తగ్గుతాయా?

Nuts for one Month: ఒక నెల రోజులపాటు ప్రతిరోజు ఉదయం గుప్పెడు నట్స్ తినండి మార్పును మీరే గమనించండి

కావాల్సిన పదార్థాలు:

ఓట్స్ - సగం కప్పు

తేనె లేదా బెల్లం పొడి - 2 టీస్పూన్స్

చియా గింజలు - సగం టేబుల్ స్పూన్

నీళ్లు- సగం కప్పు

అన్ని రకాల పండ్ల ముక్కలు (యాపిల్, మామిడి పండు, అరటిపండు, బెర్రీ)- సగం కప్పు

డ్రై ఫ్రూట్స్ - 2 టేబుల్ స్పూన్లు (సన్నగా తరిగినవి)

తయారీ విధానం:

step 1: ఒక గాజు పాత్రలేదా, కాస్త పొడవుగా ఉండే మేసన్ జార్ లో ఓట్స్ వేసుకోవాలి.

step 2: పైన తీపి కోసం తేనె లేదా బెల్లం పొడి వేసుకోవాలి

step 3: ఇపుడు అరకప్పు ఓట్స్‌కి అరకప్పు నీళ్లు పోసుకోవాలి.

step 4: రుచి ఇంకాస్త బాగుండటానికి నీళ్లకు బదులుగా పాలు, బాదాం పాలు, పెరుగు కూడా వేసుకోవచ్చు.

step 5: ఇప్పుడు మీదుగా చియా గింజలు వేసుకోవాలి. ఇవి నచ్చకపోతే వదిలేయొచ్చు.

step 6: ఇవన్నీ వేసుకున్న గాజు పాత్రను ఫ్రిజ్ లో పెట్టేసి ఉదయాన్నే నేరుగా తినేయడమే. ఉదయాన్నే బయటకు తీసాక ఈ నానిన ఓట్స్ మీద పండ్ల ముక్కలు, డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి.

టాపిక్

తదుపరి వ్యాసం