తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Artificial Sugars: కృత్రిమ చక్కెరలు తింటే ఇంత డేంజరా?

artificial sugars: కృత్రిమ చక్కెరలు తింటే ఇంత డేంజరా?

07 May 2023, 8:32 IST

  • artificial sugars: కృత్రిమ చక్కెరల్లో తక్కువ కేలరీలు ఉండొచ్చు. కానీ వాటివల్ల బరువు పెరగడం, గుండె సంబంధిత వ్యాధులొచ్చే ప్రమాదం ఉంది. ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా ఇవి కారణమవుతాయి. 

     

కృత్రిమ చక్కెరలు
కృత్రిమ చక్కెరలు (Unsplash)

కృత్రిమ చక్కెరలు

మధుమేహం ఉన్నవాళ్లు పంచదారకు ప్రత్యామ్నాయంగా తక్కువ కేలరీలుండే ఆర్టిఫిషియల్ స్వీటెనర్లను వాడుకోవడం ఈ మధ్య బాగా పెరిగింది. సకారిన్, సుక్రాలోజ్, నియోటేమ్, ఆస్పర్టేమ్ ఇవన్నీ కూడా కృత్రిమ స్వీటెనర్లకు ఉదాహరణలు. మధుమేహంతో ఉన్నవాళ్లు, లేదా బరువు తగ్గాలనుకునే వారు ఈ తక్కువ కేలరీలుండే స్వీటెనర్లు వాడుతున్నారు. కానీ ఇవి ఆరోగ్యానికి హాని చేస్తాయని చాలా సర్వేలు చెబుతున్నాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఇవి కాలేయానికి కూడా హాని చేస్తాయి. అంతేకాదు మానసికంగా కూడా మన భావోద్వేగాల మీద ఇవి పనిచేస్తాయని తేలింది. వీటివల్ల మైగ్రేన్, తలనొప్పి వచ్చే అవకాశం ఉంది.

ట్రెండింగ్ వార్తలు

Chanakya Tips In Telugu : ఈ 6 గుణాలపై మీకు నియంత్రణ లేకుంటే జీవితంలో ఓడిపోతారు

Jeera Rice : ఉదయం అల్పాహారంగా జీలకర్ర రైస్ ఇలా చేసుకోండి.. 10 నిమిషాల్లో రెడీ..

Tuesday Motivation : అందాన్ని చూసి వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేయకు.. అంతమించిన విషయాలు చాలా ఉంటాయి

Talking In Sleep : నిద్రలో మాట్లాడే సమస్య ఉంటే బయటపడేందుకు సింపుల్ చిట్కాలు

వీటివల్ల కలిగే దుష్ఫలితాలు:

  1. బరువు పెరగడం: ఇవి రుచిలో చక్కెర లాగా ఉండి తక్కువ కేలరీలతో ఉంటాయని వీటి ప్రాముఖ్యత పెరిగింది. కానీ వీటివల్ల బరువు పెరిగే అవకాశాలున్నాయని అనేక అధ్యయనాల్లో తేలింది. ఇవి తరచూ తినాలనే కోరికను పెంచి, మన శరీరానికి ఉండే కేలరీలను నియంత్రించే సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. దీనివల్ల అతిగా తినాలనిపిస్తుంది. బరువు పెరగడానికి కారణం అవుతుంది.
  2. భావోద్వేగాలు: మన మెదడులో ఉండే న్యూరో ట్రాన్స్‌మిటర్ స్థాయుల్ని ఇవి ప్రభావితం చేస్తాయి. వాటి వల్ల మానసిక స్థితి, ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది. మెదడులో ఉండే సిరటాయిన్ స్థాయుల్ని నియంత్రించడం వల్ల ఆందోళన పెరుగుతుంది.
  3. కాలేయ ఆరోగ్యం: ఆర్టిఫిషియల్ స్వీటెనర్లు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి కారకాలుగా పరిగణించబడతాయి. ట్రై గ్లిసారాయిడ్ అనేది ఒక కొవ్వు. అస్పార్టమె లాంటి కృత్రిమ స్వీటెనర్లలో ట్రై గ్లిసారాయిడ్లు ఉంటాయి. ఇవి కాలేయంలో పేరుకొనిపోయి కాలేయ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.
  4. ఇతర రోగాలు: కొన్ని సర్వేల ప్రకారం కృత్రిమ స్వీటెనర్లు టైప్ 2 డయాబెటిస్, గుండెవ్యాధులు కలగజేసే కారకాలని తేలింది. కొన్ని చక్కెరలు ఇన్సులిన్ నిరోధకతను పెంచుతాయి. మంటను పెంచుతాయి.
  5. తలనొప్పి: కృత్రిమ చక్కెరలు మెదడు పనితీరుమీద, నాడీవ్యవస్థమీద ప్రభావం చూపుతాయి. న్యూరో ట్రాన్స్‌మిటర్ స్థాయుల్లో మార్పుకు, రక్త సరఫరాలో మార్పుకు కారణమవుతాయి. దీనివల్ల తలనొప్పి, మైగ్రేన్ లాంటి సమస్యలొస్తాయి.

టాపిక్

తదుపరి వ్యాసం